b radhika

గతం

గతం గతమే గతిని నిర్దేశించేది. జ్ఞాపకంలా గుర్తుండిపోయేది. అనుభవాల సారమిది. అనుభూతులు మిగిల్చేది. వర్తమానానికి దిక్సూచిది. భవిష్యత్తుకు నిఘంటువిది. గతమనేది జీవిత కాలపు గుర్తు. గతమే లేని జీవితం లేదు. గతంలోనే జీవనం సాగిస్తే, వర్తమానానికి జీవం వుండదు. భవిష్యత్తు జీవితం వుండదు. -బి రాధిక
Read More

బంధం

బంధం మనిషి ,మనిషికి మధ్య వుండేది కాదు. మనసు మనసుతో కలుపునేది. మనసు, మనసును కలిపేది, సహజమైన మనసుకు, సహజంగా ముడిపడేది. నా అనే ఆలోచన నుంచి, మన అనే భావన కలిగించేది. "బంధం" - బి రాధిక
Read More

ఓ వెన్నెలమ్మా…

ఓ వెన్నెలమ్మా... ఓ వెన్నెలమ్మా వెన్నెల రాత్రులు, ఏ రోజైనా, ఎన్ని కాలాలు మారినా, యుగాలు  గడిచినా, వన్నె తరగని కాంతి నిచ్చే వెన్నెలను, నిండు చందమామకు వన్నె తెచ్చే వెలుగును, తారలు  మిల మిల మెరిపించే తళుకులను, గగనాన్ని చూసి మురిసిపోయే సమయాలను, జగాన  వెలుగుల విరజిమ్మే వేళలను, ప్రేమికుల మనసులు మెరిసిపోయే అందమైన క్షణాలను, కవుల మనసుల్లో భావాన్ని పుట్టించే రేయివిగా, జాబిలమ్మను అందించే వెలుగులు రాతిరిగా,  పూలకొమ్మలకు, వెన్నెలమ్మను ఆభరణంగా  అలంకరించే నడిరేయిగా, సర్వజగత్తుకు వెలుగును పంచే అద్భుతమైన రాత్రివి, అందమైన మనసుల్లగా, చల్లని  వెలుగుల వెన్నెలమ్మను అందించే జామురాతిరివి. తొలిరేయి అనుభవాన్ని, వెన్నల రాత్రి  అరుదైన అనుభూతిని, ఎన్ని మనసులైనా ఆస్వాదించేలా చేసే మైమరపు సమయాలను నింపుకున్నావు. ఆలుమగలు  వలపులతో అల్లుకుపోతున్న వేళలను, రాతిరిని రేయిగా మలిచే వెన్నెలను నింపుతున్నావు. నింపుకున్నావు. వెన్నెలరాత్రివి నువ్వు.  వర్ణనకు అద్భుతమైన ఆలోచనలు పంచే అధ్బుతానివి నీవు.... -బి. రాధిక
Read More

వెలిగే రంగు

వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక
Read More

అమూల్యమైన భావన

అమూల్యమైన భావన అశతోకాదు, శ్వాసగా భావిస్తే, అమూల్యమైన భావన, నీ సొంతం అవుతుంది. సంతోషం నీలో నిలుస్తుంది. సంతృప్తి నీకు వస్తుంది. -బి. రాధిక
Read More

బంధం

బంధం సృష్టిలో ప్రతీ ప్రాణికి  ఏదో రూపంలో, ఎవరితో ఒకరితో బంధం ఏర్పడుతుంది. అన్ని ప్రాణులకన్నా, మానవ జన్మకు ఎక్కువ బంధాలు కలిగి వున్నాయి. మనిషి ప్రకృతితో, పశువులతో, పక్షులతో,  మనుషులతో, జంతువులతో, జలచరాలతో కూడా బంధం ఏర్పరచుకున్నాడు. కానీ, మనిషికి అంత్యంత అమూల్యమైన బంధమైన తనతో తాను బంధం చేసుకోవడంలో నేటి మానవుడు విఫలమవుతున్నాడు. మనిషిగా అన్నీ బంధాలతో అన్యోన్యంగా వుండే ముందు, తన అంతరంగంతో, తన ఆత్మతో బంధం ఏర్పరచుకోవాలి. అప్పుడే, మానవుడు ఎన్ని బంధాలనైనా కలుపోగలుగుతాడు. కలిసి జీవించగలుగుతాడు.  స్వార్ధానికి చోటు లేని, త్యాగానికి చిరునామాగా నిలిచి, వాస్తవంలో బతకాలనే ఆలోచనలతో, పరిస్థితులను సానుకూల దృక్పథంతో తీసుకునే బాధ్యత గలిన వ్యక్తులు, తనతో తాను బంధం కలిగిన మనసున్న మనుషులు తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. -బి రాధిక
Read More

రేపటి విజయం

రేపటి విజయం నేటి, నీ ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలు,‌‌‌‌‌‌‌‌‌ ఛీత్కారాలే, రేపటి నీ విజయానికి సత్కారాలు. - బి రాధిక
Read More

స్నేహం

స్నేహం పది కాలాలు పదిలంగా నిలిచేది,స్నేహం. నవమాసాలు అమ్మ కడుపును పంచుకోకపాయినా, నూరేళ్ళు పంచుకునేది, స్నేహం. అష్టకష్టాలు వచ్చినప్పుడు, అండగా నిలిచేది, ఆదరించేది,స్నేహం. సప్తసముద్రాలు దాటి వెళ్ళినా, తెంచుకోలేనిది ,స్నేహం. ఆరడగుల గోతిలో  చేరేవరకు నిలిచేది,స్నేహం. పంచభక్ష్య పరమాన్నాలు వున్నా,లేకున్నా! కలుపుకుపోయేది,స్నేహం. నలుగురిలో తోడుందేది,స్నేహం. ముక్కంటికి మరో రూపం, స్నేహం రెండు వేరు వేరు వర్ణనాలను, వర్గాలను మనసులతో జత చేసేది ,స్నేహం. అభిప్రాయాలు,ఆలోచనలు వేరైనా, ఒక్కటిగా జీవించమనేది, జీవించేది, స్నేహం. -బి రాధిక
Read More

సంక్రాంతి సంబరం

సంక్రాంతి సంబరం సంకురుడు వచ్చెను, సంక్రాంతిని తెచ్చెను. మగువలు ముగ్గులతో ముంగిళ్ళను నింపెను. ముచ్చటగా గొబ్బెమ్మలను పేర్చేను. కూడలిలో భోగి మంటలు వెలిగించెను, ఇంటిలోని పిల్లలు అవుపిడకల హరం ధరింపచేసెను. ఆనాడు నెయ్యి, బెల్లం, పచ్చి పులుసులతో పులగన్నం ఆరగించేను. పెద్దపండగనాడే, పెద్దలు వచ్చెను, అమ్మలు, పెద్దమ్మలు పేరంటము పెట్టును. పప్పు, గారెలు వడ్డించేను. కనుమ రోజున కోడి నైవేద్యమయ్యేను. బూరెలతో బుట్ట నిండిపోవును. అయినవారితో ఇళ్ళు కళకళలాడేను. కొత్త అల్లుళ్లతో, దేవుని ఉరేగింపులతో, పిల్లల ఆటపాటలతో, హరిదాసుల రాగాలతో, గంగిరెద్దుల మేళాలతో ఊరంతా సంబరమయ్యేను. సంక్రాంతి పండగ అందరికి ఆనందాన్ని, అందాన్ని తెచ్చెను. అందరి మనసులు మురిసేను. -బి. రాధిక
Read More