bhanu sree meghana

బ్రతుకు పోరు

బ్రతుకు పోరు కనులకు కునుకు చేరదు.. కాళ్ళు ముడుచుకుని.. డొక్కలెండిన శరీరాలకు.. బ్రతుకుపోరు వినపడదు.. బ్రతికే ఆరాటంలో చివరి వరకూ చిరునామాగా మిగిలిపోయే జీవాత్మల అనుసంధానం తానని చెప్పదు.. తనను దాటి వెళ్ళే దారి చూపదు.. విడిచిపోదు.. మరచిపోనీదు..!! - భాను శ్రీమేఘన
Read More

అర్ధరాత్రి

అర్ధరాత్రి సుడులు తిరుగుతుంది.. మనసు.. సహకారం అందించే చేతులకోసం.. సమయం చిక్కక అందుకునేందుకు.. నేను లేని నా అనే వాడి జాడతో.. ఓ చేయూతకై చేస్తుంది సమరం, సర్వ ప్రయత్నాలకూ తీసుకుపోతూ.. యుద్ధభూమిగా ఆ క్షేత్రం.. అర్థం చెప్పే రాత్రి తానుగా ఏదో కథ చెప్పడం విశేషం..!! - భాను శ్రీమేఘన
Read More

కన్నతల్లి

కన్నతల్లి జీతమే లేని జీవితానైనా .. జీవితాలను పంచు జీవమురా.. నాభిమూలము నడక ధారణ.. చేయు ఘనత తనదేరా.. నవ్య జగతికి అంకురార్పణ.. ఆ తల్లి ఋణమేరా.. సర్వసృష్టికి సార్వభౌమము.. ఆమెయే కదరా.. !   - భాను శ్రీమేఘన
Read More

ప్రణయాగ్ని

ప్రణయాగ్ని నీ మది తలుపులు తెరుచుకునే శుభోదయం..! ఎద ఎపుడంటూ అడుగుతుంది.. ఆ ఉషోదయం..! సాగే ఈ ప్రణయాగ్నికి కట్టుబడి.. ప్రతి ఉదయం..! ఓ ప్రళయాన్నే మోస్తుంది.. నిరీక్షిస్తూ నా హృదయం..!! - భాను శ్రీమేఘన
Read More

అభిమతమే…

అభిమతమే... ఒడిదుడుకూ అలజడులే.. ఒద్దిక కుదరని మురిపములే.. ఉదయించడమే నైజములే.. ఉడికించడమే తన విధులే.. మదిలో కూడే సంగమమే.. మోహావేశపు పరిచయమే.. కోరికలాడే ఆటకు సుమలతమే.. తపనల తీరం దారులకై.. అన్వేషించుట అభిమతమే..!! - భాను శ్రీమేఘన
Read More

గతం

గతం గమనిస్తున్నా.. పయనిస్తున్నా.. గతాన్ని ముడిపడి అడుగేస్తున్నా.. గతులు గుంతలుగ కనిపిస్తున్నా.. గమ్యం కోసం రమ్యత కోసం సాహసదారుల సాయంచేసి.. సాధన చేస్తున్నా.. మునుపటి తప్పుల ముప్పులు మరువక.. రేపటి కిరణపు కాంతుల కోసం.. ఆశయసాధన ఆంక్షల దిశగా.. పరుగెడుతున్నా.. గతం వదిలిన అనుభవాలతో తెలివిగ ముడిపెడుతున్నా..! - భాను శ్రీమేఘన
Read More