bhavya charu aksharalipi

నా తెలంగాణ

నా తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ అమరుల త్యాగం నా తెలంగాణ త్యాగధనుల వరం నా తెలంగాణ సంప్రదాయాల ఘని నా తెలంగాణ ఆడపడుచులను పూజించు నా తెలంగాణ షడ్రుచుల సమ్మేళనం నా తెలంగాణ పువ్వులను పూజించేది నా తెలంగాణ అన్ని కులాలకు అతీతం నా తెలంగాణ అలయ్ బలయ్ నేస్తం నా తెలంగాణ అందరికీ నిలయం నా తెలంగాణ ఆలయాలకు ప్రసిద్ధి నా తెలంగాణ మతాలoనీటిని కలిపేది అందుకే నా తెలంగాణ కోటి రతనాల వీణ - భవ్య చారు
Read More

మౌనం

మౌనం ఆ మధ్య కాలంలో ఏదో మాటపై మాట వచ్చి నేను మా అమ్మ గారి తో కాస్త గొడవ పడ్డాను. చిన్న మాట నే కానీ నా ఆవేశం వల్ల నేను తొందరపడ్డాను. కానీ నాకు కోపం చాలా వచ్చింది. దాంతో నేను మా అమ్మతో మాట మానేశాను. అది కూడా కరోనా సమయంలోనే, ఈ కారణం అనేది చాలామందిని చాలా ప్రస్టేషన్ కి గురిచేసింది. అందరూ ఇంట్లోనే ఉండడం వల్లనో ఏమో చేసే పని ఎక్కువ అయింది పని ఎంత చేసినా తరగదు. ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుభవమయ్యే ఉంటుంది. అయితే ఆ ప్రస్టేషన్ లో నేను మా అమ్మ కాస్త గొడవ పడిన మాట నిజం. పాపం మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు నిలబడి వంట చేయలేదు. ఇది తెలిసినా కూడా నేను రోజూ చేయడం విసుగొచ్చి నువ్వు ఒకసారి…
Read More

అజ్ఞాత వ్యక్తి

అజ్ఞాత వ్యక్తి కొన్ని రోజులుగా నేను చెప్పుకోలేని ఒక సమస్య తో బాధ పడుతున్నా... అదేవరికి చెప్పుకోలేని సమస్య ఎలా ఏం చేయాలో అర్థం కాలేదు. నెలాఖరు రోజులు ఎవర్నీ అడిగినా డబ్బు సాయం అందడం లేదు. అడిగితే లేదనే సమాధానం కన్నా అడగకుండా ఉండడమే మంచిది అని ఎవర్నీ అడగలేదు.కానీ సమస్య తీవ్రత ఎక్కువ అవుతుంది. ఏం చేయాలి తెలియక నా సోషల్ మీడియా తెరిచాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో పెంచాలని ఎప్పటి నుండో అనుకున్నా, అందుకోసం అంతకు ముందు నా సోషల్ మీడియా అకౌంట్ లో అడిగాను. ఫలానా మొక్క కావాలని, తర్వాత నేను అది పట్టించుకోలేదు నా సమస్య వల్ల, అయితే నేను నా అకౌంట్ తెరవగానే ఒక సందేశం, ఆ మొక్క నేను పంప లేను కానీ అందుకు అయ్యే డబ్బు సాయం చేయగలను అంటూ ఒకరు మెసేజ్ చేశారు. నా సంతోషానికి…
Read More

పలకరింపు

పలకరింపు కాలం కన్నిరై కరుగుతుంటే... కవ్విస్తున్న కోరికలన్నీ సమిధలై కాల్చేస్తుంటే... నన్నిలా నేనిలా ఓదార్చకుంటుంటే... నేనున్నానమ్మా అంటూ ఆప్యాయంగా నీ పలకరింపు, నాకెంతో ఆశ కలిగించింది. - భవ్య చారు
Read More

నీ కోసం

నీ కోసం కానరాని చీకటేదో మనసు లోతుల్లో దాగుతుంటే, కన్నీరు సంద్రమై, మానసోక నావలా పరుగెత్తమంటుంటే, కాలం మూడిందంటూ కళ్ళముందు కదలాడుతుంటే, జీవన గమ్యము ఏమిటో తెలియనిస్థితిలో, కబోధిలా వెతుకుతున్నా రంగుల లోకంలో.. నీ కోసం..... - భవ్యచారు
Read More

సంఘర్షణ పార్ట్ 3

సంఘర్షణ పార్ట్ 3 సంఘర్షణ మొదటి రెండు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి. అప్పుడే మీకు మొత్తం అర్థం అవుతుంది. అవసరాలు తీర్చడం కోసం అప్పులు చేయడం సహజం, కానీ ఆ అప్పులు తీర్చే మార్గం ఉంటేనే అప్పులు చేయాలి, ఆ అప్పు భారం కాకూడదు. పస్తులు ఉండి అయినా అప్పులేకుండ చూడాలి. కానీ పంట పండించే రైతు రేపనే ఆశ తో అప్పులు చేసి కట్టలేక అవమానాల పాలు అవుతూ, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు చేతులు కట్టుకుని చిద్యలు చూస్తున్నాయి. అప్పులు తీర్చడం కోసం కన్న బిడ్డలను అమ్ముకున్న వారు ఉన్నారు.. ******** అబ్బబ్బ ఏం ఊరిస్తున్నావే తొందరగా చెప్పి తగలడు అంది విసుగ్గా కరుణ. నువ్వు ఇలా చిరాగ్గా మాట్లాడావనుకో నేను అప్పుడే చెప్పను అప్పుడు నీకు ఏ దారి ఉండదు. నువ్వు నాకు సేవ చేసుకో అప్పుడే నేను చెప్తాను అంది పోజు…
Read More

తారా చరణీయం రెండో భాగం

తారా చరణీయం రెండో భాగం ఈ సీరియల్ మొదటి భాగం తారా చరణియం పరిచయం చదవండి తర్వాత ఇది చదవండి అప్పుడే మీకు అర్థమవుతుంది. అమ్మాయ్ జ్యోతి నువ్వు బడికెళ్ళే ముందు నాన్నగారికి కొట్టులో టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్ళమ్మా పొద్దుననగా వెళ్ళారు ఏమీ తినలేదు. పాపం ఎంత ఆకలిగా ఉన్నారో.... అసలే అంతంత మాత్రం ఆరోగ్యం అంటూ బాక్స్ పట్టుకుని అద్దం ముందు తయారవుతున్న కూతురి దగ్గరికి వచ్చింది జయమ్మ. అబ్బా అమ్మా నేను వెళ్లనే నాకు అక్కడికి వెళ్లాలి అంటే అదోలా అనిపిస్తుంది. అందరూ పిచ్చి చూపులు చూస్తారు అంది జ్యోతి కొంచం నీరసంగా.... అయ్యో అలా అనుకుంటే ఎలా తల్లి... నువ్వు వెళ్ళేది మీ నాన్న కోసం కదా, అవ్వన్నీ పట్టించుకుంటే మనం వ్యాపారం చేయలేం చూసి చూడనట్టు వదిలేయాలి. అక్కడే ఉండవు కదా బాక్స్ ఇచ్చి తొందరగా వెళ్ళిపో.... మనం బతికేది అదే వ్యాపారంతో కదమ్మా…
Read More

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2 వాళ్లిద్దరూ జగన్ గదికి వెళ్ళారు. ఏదో కావాలనే కోరికతో కాలిపొతున్న అద్వైత అతని వెంట బలికాబోతున్న మేకలా వెళ్ళింది. జగన్ తన గదిలో ఎవరితోనో చెప్పి ఏర్పాట్లు చేయించాడు. అవేవీ తెలియని అద్వైత అతనితో జరగబోయే సంగమం గురించి ఆలోచనలతో వెళ్ళింది. ఇద్దరూ గది దగ్గరకు వెళ్ళగానే జగన్ తనకు అనుమానం రాకుండా తాళం తీశాడు. అంతకు ముందే జగన్ దగ్గర పనిచేసే కుర్రాడు చెప్పుల కింద పెట్టిన తాళం చెవిని తీసుకుంటూ చుట్టూ ప్రక్కల ఎవరు లేని ఆ ఏకాంత ప్రదేశంలో ఉన్న తన గదిలోకి అద్వైతము ఆహ్వానించాడు. చుట్టూ ఎవరున్నారో, అసలు ఆ గది ఎక్కడ ఉందో, తనకేం జరుగుతుంది కూడా గమనించే స్థితిలో లేదు అద్వైత. ఏదో కావాలని మాత్రం చాలా బలంగా అనిపించసాగింది. వయసు వేడి ఏమీ ఆలోచించకుండా ఏమీ పట్టించుకోకుండా చేసింది. చిన్న గదిలో ఒక సింగిల్ బెడ్…
Read More

చివరి చూపు చివరి భాగం మాయ

చివరి చూపు చివరి భాగం మాయ వాసు కి కనిపించిన ఫైల్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ బైక్ పై ఉండేసరికి చూడలేక ఇంటికి వెళ్ళి చూడాలని అనుకున్నాడు. వాసు ఇంటికి వెళ్లేసరికి తలుపులన్నీ తీసి ఉన్నాయి. అలా యెప్పుడూ ఉండదు. తల్లి ఎప్పుడూ తలుపులు వేసే ఉంచుతుంది. అమ్మకు ఏమైంది అనుకుంటూ అమ్మా, అమ్మా అంటూ లోపలికి వెళ్ళాడు వాసు. కానీ లోపలి నుండి ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. ఎవరు పలకడం లేదు. అరే ఎవరూ లేరెంటి ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ నాన్న, నాన్న అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. లోపల బెడ్ రూం లో బెడ్ పైన తండ్రిని పట్టుకుని తల్లి ఓదారుస్తూ ఉంది. అది చూసి ఎంతో ఆశ్చర్య పోయాడు వాసు. ఇన్నేళ్లుగా తండ్రి ఏడవడం అసలు చూడలేని వాసు ఎంతో విభ్రాంతిగా చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని. వాసు ని గమనించిన తల్లి…
Read More

విశ్రాంతి ఎప్పుడు?

విశ్రాంతి ఎప్పుడు? పొద్దున్నే లేస్తావు బొంగరం లా తిరుగుతావు నిరంతర యంత్రంలా పనిచేస్తావు నీవొక మనిషన్న సంగతి మరుస్తావు  మాటలెన్నో మాట్లాడుతూ మంచికి ప్రయత్నిస్తావు మగువా మగువా నీకెక్కడిదే మనుగడ లేని జీవితం గడుపుతావు మాటలెన్నో పడతావు అవమానిస్తాడు. అనుమానిస్తాడు అయినా నీ పెదవి పై చిరునవ్వు కదలనీవు మగువా మగువా మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ఎంతో శ్రమ కొరుస్తావు  అందరి ఆరోగ్యం చూస్తూ నీ ఆరోగ్యం చూసుకోవూ నవమాసాలు మోసి నరకం చూస్తూ ఆనందాన్ని పొందుతావు మగువా మగువా నీ మనుగడ కోసం ఎప్పుడు అలోచిస్తావు నీకు నువ్వు విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటావు? - భవ్యచారు
Read More