బంధం
బంధం బంధం ఏదైనా నమ్మకం ముఖ్యం నమ్మకం లేని బంధం ఏదైనా వృధానే... ఒరేయ్ అన్నయ్య నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది నువ్వు నాతో వస్తావా అంటూ అడిగింది లత. నేను ఎందుకే నీతో అవసరం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్లిరా, నేను రావడం ఎందుకు? అయినా నా బాబాయ్ ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఎగ్జామ్ రాయడం ఎందుకే మరోసారి రాసుకోవచ్చులే ఎంత చదివినా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళే దానివి కదా ఇప్పుడు చదువు అవసరమా అన్నాడు నిష్టూరంగా మురళి. ఇదిగో చూడు అన్నయ్య నువ్వు ఇలా అంటే నాకు ఎక్కడో మండుతుంది. ఎంత వేరే ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్ళేవాళ్ళం అయినా మా కాళ్ళ మీద మేము నిలబడాలని మాకు మాత్రం ఉంటుంది. చదువుకుంటే తప్పేంటి ఆయన నీ సన్నిధిలో తీసుకు వెళ్తున్నట్టు ఆ మాటలు ఏంటి నేను నాకు వచ్చిన స్కాలర్షిప్ తోనే చదువుకుంటున్నాను నాకు…