గతం
గతం గతమంతా ఒక పిడ కలగా గడిచిన రోజులు ఒక అనుభవంగా గడిపిన గడ్డు కాలం ఒక గుణ పాఠంగా గడిచిన జ్ఞ్యాపకాలు విషాదాలుగా గతం ఒక మారుతున్న కాలానికి గుర్తుగా అనుభవాల పాఠాలుగా బాధల మయంగా బ్రతుకుతున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోలేని గురుతులుగా మారి భవిష్యత్తును భయపెడుతున్నప్పుడు రాబోయే కాలంలో అయినా ... గతం పడగ నీడ పడకూడదు అని గత పీడ కలలన్నీ మర్చిపోయి మారుతున్న కాలంతో పాటు కాస్తయినా సంతోషాన్ని వెతుక్కోవాలి అని ఉరుకులు పరుగులు పెడుతూ, ఉవ్విళ్లూరుతున్న కోరికలతో...... కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని కోరుకోని దేవ్వరు. భవిష్యత్తు అయినా బంగారు మయం అవ్వాలని అన్ని బాధలు పోయి, పీడ కలలన్నీ కలలే అని కొత్త కలలతో కొత్త జీవితాన్ని కోరుకుందాం... కొత్తగా ఉందాం.... - భవ్యచారు