bhavya charu

అనుకున్నదోకటి అయినదొకటి

అనుకున్నదోకటి అయినదొకటి

అనుకున్నదోకటి అయినదొకటి రమ ఎంతో మంచిది. రమేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేవు ,కాని ఇద్దరు పిల్లలు పుట్టాక డబ్బులు సరిపోక పోవడం వలన రమేష్ దుబాయి కి వెళ్ళాలని అనుకున్నాడు దాంతో రమ తో అలోచించి వాళ్ళు భర్త దుబాయి కి వెళ్ళాలని తానూ ఒక కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తానని పిల్లలను హాస్టల్ లో వేసి చదివించాలని నిర్ణయించుకున్నారు.తర్వాత రమేష్ మధ్యవర్తి సహాయం తో దుబాయి కి వెళ్ళిపోయాడు.రమ ఒక కాలేజ్ లో లెక్చరర్ గా జాయిన్ అయ్యి,పిల్లలని హాస్టల్ లో చేర్చింది. తన తల్లిని తనతో పాటు ఉండమని అడగడంతో తల్లి నిర్మల సరే అంది. ఇక రమేష్ దుబాయ్ నుండి బాగానే సంపాదించి రమ కి పంపడం వలన తాను తొందరలోనే ఒక మంచి ఇల్లు కొన్నది.అలాగే ఒక కార్ కూడా కొనుక్కుంది.దాంతో పాటే కొన్ని…
Read More
కపట ప్రేమలు

కపట ప్రేమలు

కపట ప్రేమలు శాంతికి పెళ్లి జరిగింది ఒక కొడుకు పుట్టాక అత్తారింట్లో గొడవలు మొదలయ్యాయి. దాంతోపాటు భర్త పోరు కూడా పెరగడంతో ఆమె భరించలేక తన పుట్టింటి వారికి చెప్పింది అయితే ఆమె తండ్రి పంచాయతీ పెట్టాడు పెద్ద మనుషుల్లో భర్త ఇంకా కట్నం తీసుకురమ్మని లేదంటే తాను ఆమెను వదిలేస్తానని చెప్పడంతో నేను కట్నం ఇవ్వలేను అలాగని నా కూతుర్ని ఎక్కడ ఉంచలేను ఆమెను ఎప్పుడూ మీరు చంపుతారో తెలియదు కాబట్టి నా కూతురు నాకేం భారం కాదు నీకు నేనున్న బిడ్డ అంటూ తన పుట్టింటికి తీసుకొని వచ్చాడు.. అందుకే భారంగా ఉండడం ఇష్టం లేని శాంతి తనకు తగిన చిన్న ఉద్యోగం చూసుకని, ఉద్యోగంచేయ సాగింది.. కానీ అనుకోని పిడుగుల ఆమె తండ్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు అప్పటికి శాంతికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వారు చిన్నవాళ్ళు కావడంతో శాంతి వారి బాధ్యతలు తీసుకుంది. తండ్రి ది…
Read More
కల

కల

కల కలలన్ని కల్లలు గా మారితే నిజమేదో అబద్దమేదో తెలియని నిశి రాత్రి లో కనులపై రెప్పలు మూయని కలలతో నింగి అంచులు తాకుతూ ఆకాశం అంతా మబ్బులు కమ్మిన చీకట్లో జీవితం అంధకారమయ్యిందో లేదో నిజమేదో కలేదో తెలియక సతమతం అవుతూ తెలియని స్థితిలో చేసిన తప్పులన్నీ కలగా మాయమైతే బాగుండేమో అనే ఆశ రేపటి కోసం ఎదురు చూస్తూ మూయలేని కనురెప్పలు బలవంతంగా మూసుకుంటూ రేపు అనే ఆశ మినుకు మినుకు ఒక తార దూరంగా కనిపిస్తుంటే అదే రేపటి తార కాబోలని భ్రమ పడాలని మనసుని తనువునీ నిద్రపుచ్చుతూ ఏదో శక్తే నడిపిస్తుందని నమ్ముతూ బరువైన రెప్పలు మూసుకున్నాయి ఈ రేయి నాదని అనుకున్నా కానీ అదెప్పుడో మరొకరి స్వంతం అని తెలిసి బరువైన గుండె అంచున బాధ అదిమిపెట్టి నిత్యకృత్యాల కోసం నా అవసరం ఉన్నవారి కోసం నా బాధ్యతలు పూర్తి చేయాలనీ అన్నీ ఆదిమి…
Read More

నలుగురిలో నగుబాటు

నలుగురిలో నగుబాటు ఆ రోజు మహిళా దినోత్సవం. ఒక టీవీ ఛానెల్ వాళ్ళు ఆ మహిళా దినోత్సవం గురించి చాలా గొప్పగా వివరించారు. మహిళల ఔనత్యం గురించి వారీ ఓపిక, సహనాల గురించి చక్కగా మాటల మాత్రజాలం తో మైమరపింపు చేశారు. అబ్బా చాలా చక్కగా మహిళల గురించి వారీ భావాల గురించి చక్కగా వివరిస్తుంటే అందరూ అబ్బా ఈ ఛానెల్ వాళ్ళు మహిళల గురించి ఇంత చక్కగా చెప్తున్నారు. ఇక వాళ్ళ ఛానెల్ లో పని చేసే ఉద్యోగులను ఎంత చక్కగా చూసుకుంటారో అని బయట నుండి చూస్తున్న జనాలు అనుకున్నారు. కానీ లోపల అదే మహిళా దినోత్సవం రోజున వనజ అదే ఛానెల్ లో సబ్ ఎడిటర్ పని చేస్తుంది. ఆమె చేసిన చిన్న పనిలో లోపం జరిగింది. అదే లోపం గురించి ఆమె తో ఎడిటర్ చూడు వనజ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావ్ అది…
Read More
మాయ లోకం

మాయ లోకం

మాయ లోకం రాములు కు ఒక్కగానొక్క కూతురు లయ తాను కాలేజీ లో ఇంటర్ చదువుతుంది. రాములు భార్య శాంత లయ పుట్టగానే చనిపోవడంతో రాములు తన కూతరు కి తల్లి తండ్రి అన్నీ తానే అయ్యి పెంచుకున్నాడు. లయ కూడా తండ్రీకి తగ్గ తనయగా అన్నిటిలో ముందుంటూ చదువుతుంది. చదువు తో పాటు ఆటపాటల్లో కూడా తాను ముందుంటూ స్కాలర్షిప్ తో చదువుతుంది. తన ఆశయం ఒక్కటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకొని తండ్రినీ బాగా చూసుకోవాలని ఆశ పడుతుంది. అనుకున్నట్టుగానే ఇంటర్ అయిపొయింది. లయ ఇంజనీరింగ్ లో చేరింది. మొదటి సంవత్సరం భయం భయంగా అయిపోయింది రెండో సంవత్సరం నుండి స్నేహితులు ఎక్కువ కావడం వలన తాను విలాసాలకి అలవాటు పడింది. చివరి సంవత్సరంలో తన చదువుతో బాటు ఉద్యోగం కూడా వచ్చింది. మంచి ప్యాకేజీ తో ఉద్యోగం రావడంతో లయ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇక…
Read More
చేదుగానే అనిపిస్తాయి

చేదుగానే అనిపిస్తాయి

చేదుగానే అనిపిస్తాయి శ్రీనివాస్ ఒక మధ్యతరగతి కాంట్రాక్టర్. సొంతంగా కష్టపడి పనిచేస్తూ, ఉన్నదానితో... తృప్తిపడుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో అతని సంసారం హాయిగా సాగిపోతోంది. క్రమశిక్షణ, నిజాయితీ అతనికి సమాజంలో మంచి పేరు తెచ్చిపెట్టాయి.కానీ , సజావుగా సాగుతున్న అతని జీవితంలోకి అత్యాశ అనే చీకటి ప్రవేశించింది.ఒకరోజు శ్రీనివాస్‌కు వినోద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వినోద్ ఒక అక్రమ డబుల్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో నకిలీ కంపెనీ నడుపుతున్నాడు."మూడు నెలల్లో మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. కష్టపడి సంపాదించడం పూర్వకాలం పద్ధతి, తెలివితో కోట్లు సంపాదించాలి" అంటూ శ్రీనివాస్‌కు పెద్ద పెద్ద కలలు చూపించాడు.వినోద్ మాయమాటల్లో చిక్కుకున్న శ్రీనివాస్ మనసులో ఒక్కసారిగా కష్టపడకుండా కోటీశ్వరుడైపోవాలనే పిచ్చి ఆలోచన ప్రవేశించింది.ఈ విషయం తెలిసిన శ్రీనివాస్ ప్రాణస్నేహితుడు రమేష్, భార్య లక్ష్మి అతన్ని తీవ్రంగా హెచ్చరించారు."శ్రీనూ! కష్టపడకుండా ఊరికే ఏదీ రాదు? ఇలాంటి ఆశలు చూపి మోసం చేసేవాళ్లు ఈరోజుల్లో…
Read More
అవని

అవని

అవని అవని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. తాను పనిచేస్తున్న కంపెనీ ఉరవతల ఉండడం వలన రోజు పొద్దున్నే వెళ్ళేది. సాయంత్రం కూడా కాస్త తొందరగా ఆఫీస్ నుండి బయటకు వచ్చి బస్ లో ఇంటికి వెళ్ళేది. అవని ఒక మధ్యతరగతి అమ్మాయి.చాలా కష్టపడి చదువుకుని మంచి జాబ్ కూడా తెచ్చుకుంది. తాను తన తల్లిదండ్రులకు ఉన్న ముగ్గురు కూతుర్లలో మొదటిది కావడం వలన తను తన తండ్రి కి ఆసరాగా ఉండాలని బాధ్యతలు పంచుకోవాలనీ బాగా కష్టపడుతూ ఉండేది. అందుకే ఉరవతల ఉన్న కంపెనీ అయినా జాబ్ లో జాయిన్ అయ్యింది అవని. అవని ఆ రోజు బయటకు వద్దాం అనుకుంటున్న సమయంలో బాస్ వచ్చి ఒక ప్రాజెక్టు చేయాలి టైమ్ లేదని తొందరగా చేయాలనీ చెప్పడంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలా ప్రాజెక్టు చేస్తూ టైమ్ తెలియలేదు అవనికి అవన్నీ పూర్తయ్యి బాస్ కి చెప్పి బయటకు…
Read More
అనుభవం నేర్పిన పాఠం

అనుభవం నేర్పిన పాఠం

అనుభవం నేర్పిన పాఠం నాకు పోయిన సంవత్సరం జూన్ లో కొన్ని కుటుంబ సమస్యల వలన అలోచించి అలోచించి ఆ ఆలోచనలతో మనసు ఒత్తిడికి గురయ్యి ఆ ఒత్తిడి లో ఎప్పుడో ఇరవై ఏళ్లకి వచ్చిన ఫీట్స్ నాకు మరలా ఇప్పుడు వచ్చాయి. అసలు ఆ రోజు ఏమైందంటే నేను నాకున్న సమస్యలతో ఆలోచిస్తూ షాప్ మూసేసి ఇంటికి వచ్చాను ఆ రోజు ఆదివారం కాబట్టి అందరు ఇంట్లోనే ఉన్నారు. నేను అన్నం, బీరకాయ కూర, బీరకాయ టమాటా పచ్చడి, చారు చేశాను, ఆ తర్వాత మా తమ్ముళ్లకు పెట్టి వాళ్ళు తింటున్నప్పుడు నా మనసులో ఆలోచనలు వారికీ చెప్పాను. నేను అప్పుడు చాలా ఆవేశంగా ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళు తిన్నాక నేను తినడానికి కూర్చొని అన్నంలో పచ్చడి కలుపుతూ రెండు ముద్దలు పెట్టుకొని తింటూ మాట్లాడాలి అనుకున్న మాట్లాడుతున్న ఆవేశంలో ఉన్నాను తింటూ మాట్లాడుతూ ఉండగానే నాకు ఫీట్స్…
Read More
మోజులో పడితే

మోజులో పడితే

మోజులో పడితే అరుణ, కిరణ్ ఇద్దరు భార్యాభర్తలు. కిరణ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాబట్టి డబ్బుకు లోటు ఉండదు.అరుణ డబ్బుకు లోటు లేదు కాబట్టి ఏడాపేడా ఖర్చులు చేసేది. వారం వారం బ్యూటీ పార్లర్ కి వెళ్తూ, విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ ఉండేది. కిరణ్ కూడా ఆఫీస్ ఒత్తిడి వలన కాస్త తాగుడు అలవాటు అయ్యింది. అది కాస్త రోజు తాగకపోతే ఉండలేని స్థితికి వచ్చాడు. కిరణ్ తాగడం, అరుణ ఖర్చులు చేయడంతో వాళ్ళకి అసలు దాపరికం అనేది లేకుండా పోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా ఒకరోజు కిరణ్ ఆఫీస్ లో వాళ్ళు కొందర్ని జాబ్ లోంచి తీసేస్తున్నాం అని ప్రకటించారు. అందులో కిరణ్ కూడా ఉన్నాడు. ఉద్యోగం పోయిన బాధలో ఇంకాస్త ఎక్కువ తాగాడు కిరణ్. ఇంటికి వచ్చాక ఏంటి ఇంతగా తాగారా ఈరోజు ఏమైంది మీకు అంటూ అడిగింది అరుణ దానికి కిరణ్ నా జాబ్ పోయింది…
Read More
నీ గానం గంధర్వం,,,,,!!

నీ గానం గంధర్వం,,,,,!!

నీ గానం గంధర్వం,,,,,!! నా కలం కవితా గీతం నీ గళంలో తొణికిసలాడే వేల రాగాల సమ్మిళితం మధురాతి మధురం,,,,,,,,నీ అద్భుత కోయిల స్వరం పాడే నా అక్షరాలు సువర్ణాంబరాలు ఈ జగతికి,,,,,,ఈ రేయి పూసిన తారల్లో చంద్రుడు ఇలపై రువ్వే వెన్నెలలు చినబోతున్నాయి నీ గానం మధురిమల్లో ఓ ప్రియ సఖీ,,,,,,,నీ మందిరం చుట్టూర పూసిన పూవులన్నీ నీ రాగ రంజిత గానం ఆలకించి మూర్ఛిళ్ళుతున్నాయి సఖీ,,,,,ఏ బ్రహ్మ అమృత జలములు పోసిన గళం గంధర్వాలో నీ గానం,,,,,,,ఆహూతుల హృదయాలు చూరగొని వికసిత పుష్పాలు జేసి రంజిళ్ళు నీ సప్తస్వరాలు,,,,,,,నేను తెల్లకాగితంపై రాస్తున్న అక్షరాల మల్లే సాగిపోయే నీ గానం ఆహూతులకు ఊహల మధురానుభూతి సఖీ,,,,,,గులాబీలా విరబూసిన నీ గళం పాడే మధురిమలు వీణుల విందు జేసే సువర్ణ రాగాలు ఇలలో,,,,,,, అపరాజిత్
Read More