గాయం
గాయం బాధను దాచిన మొహానికి నవ్వును అద్ది కిరణాన్ని అడిగాను నీ వెలుగుకు కారణమేమని జీవించాలనే కోరిక అంది ఈసారి నక్షత్రాలను అడిగాను ఆకాశంలో తారలెలా అయ్యారని బతికిన క్షణాలను దాచుకోవటంతో అన్నాయి తేరిపారచూస్తూ ఆకాశాన్నడిగాను తనువంతా శూన్యమేగా, బాధలేదా! మేలుచేసే సూరీడు వెంటే ఉంటే శూన్యమైనా వెలుగు తోటే అంది తనువంతా చీకటి గాయాలని వగచేవేందుకు నన్నడిగాయన్నీ! గాయాలను ఆశతో కడిగేయన్నాయ్ అని ఫక్కున నవ్వాయ్ కలచెదిరింది.. ఉదయం విచ్చుకుంది.. - సి.యస్.రాంబాబు