c s rambabu

నీడ

నీడ

నీడ కొత్త ఆలోచనలతో మనిషి వికసించడు కొత్త గృహంలో నివసించాలనుకుంటాడు కొత్తగా మార్పేమీ చెందడు పాతనే కొత్త చేద్దామనుకుంటాడు సర్వమానవ సౌభ్రాతృత్వం అంటాడు మతం కులం ప్రాంతం కంచె వేసుకునుంటాడు ఋతుశోభను ఆస్వాదిస్తాడు ఋతుమార్పులను ఆకళింపు చేసుకోడు తన నీడే తనని భయపెడుతుంటుంది నిజాలను దాచుకున్న నీడ ఎక్కడ ప్రశ్నగ మారుతుందోనని - సి.యస్.రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి తపియించె మనసు నిను చూడాలియనుచు జపియించ సాగెనుగా గోవింద నామమును చరణం గల్లంతు కాగా ఆశలన్నియు మావి నీవే దిక్కనుచు కొలిచేము స్వామి కాపాడమనుచు వేడేము నిన్ను కలలోనయినా దర్శనము ఈయవా చరణం ఇబ్బందులున్నాయని నీ తలపు మానము మనసు తలుపులను తెరిచి ఉంచేము కొలువై ఉంటావని కోరికలను తీర్చేవని మా నిధివి నీవు మా సన్నిధివి నీవు మరిచిపోకయ్యా తరతమభేదములు లేవు నిను చూచువారికి చరణం నీ నీడచాలుగా నీ ధ్యాసనిలిపేందుకు నీ తోడు చాలుగా కష్టములను దాటేందుకు నిను నమ్మినాము మన్నించి రావయ్యా మమతనే పంచేందుకు వేగమే రావయ్యా వెతలు తీర్చేందుకు - సి.యస్.రాంబాబు
Read More
యుద్ధం

యుద్ధం

యుద్ధం   నగరాన్ని నిద్రలేపక్కర్లా పడుకుంటేనే కదా! నగరం రాత్రిపూట మరో ప్రపంచాన్ని చూస్తుంది ఆకలితో పస్తుండేవాళ్ళు,జానెడు జాగా దొరక్క తిరుగుతుంటారు జాలిగుండెతో కన్నీటి స్నానం చేయిస్తుంది! తిన్నదరగనివారికి నగరమో నిషాకనుల సుందరి కార్ రేసింగ్ బైక్ రేసింగ్ లతో నగరంతో ఆడుకుంటారు ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తుంటుంది! భద్రజీవులం కదా కలల ప్రపంచంలో మన యుద్ధాలు మనవి నగరానిది మాత్రం తెరిపిలేని యుద్ధం! - సి.యస్.రాంబాబు
Read More
నన్ను దోచిన వాడు

నన్ను దోచిన వాడు

నన్ను దోచిన వాడు     కలల కంబళి కప్పుకుని రాత్రి సంచారానికి బయలుదేరాను సౌధాల సౌందర్యం వివశుణ్ణి చేసింది పచ్చని అరణ్యాల వెచ్చని ఊపిరికి మానసవీణ మురిసి హృదయరాగాన్ని మీటింది కొలనులన్నీ కన్నుగీటుతున్నాయి తమలోతు చూడమని కంబళి తొలగించి దూకానా కలచెదిరి ఇహలోకంలో పడ్డాను నా కలల సామ్రాజ్యాన్ని దోచిన భానుడు ఫక్కున నవ్వాడు భానుడు బతుకు వస్త్రం చిరుగులకు వెలుగు అతుకులు వేయమంటావా అంటూ కళ్ళతోనే అడుగుతుంటే వాస్తవాన్ని కనకధారాస్తవంలా పఠించాను తన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాను - సి.యస్.రాంబాబు
Read More
తొలిసంధ్య

తొలిసంధ్య

తొలిసంధ్య నిలకడలేని హృదయాలుంటాయేమో కానీ నిలకడలేని ఉదయాలుండవు అప్పుడే పూచిన పువ్వులా విప్పారుతూ ఉదయం వినిపించని రాగాలను శ్రుతిచేస్తుంది ఉదయాన్నే ఓ వెలుగు రేఖ ఆనందాన్ని ఒంపుతుంటే పరవశించని మనిషెందుకు నీకు నాకూ లక్ష గొడవలుండొచ్చు కలిసి ఉదయాన్ని చూశామా వేరే సంధి అక్కర్లేదు తొలిసంధ్య తొలకరి జల్లులాంటిది - సి.యస్.రాంబాబు  
Read More
సాయి చరితము

సాయి చరితము

సాయి చరితము పల్లవి మే నమ్మే సత్యము నీవుగా మే వెతికే దైవము నీవుగా మా బరువు బాధ్యత నీదిగా నువు లేని బతుకే శూన్యము చరణం నీ తలపే మాకు రక్షణ నీ చరితము మాకు భిక్షగ అది చదివిన మనసుకు శాంతిగా లేదింక మాకే భ్రాంతిగా చరణం నీ తలపులు మాకు వెలుగుగా ముసిరిన చీకటి తొలుగుగా నీ పలుకే చిలుకును అమృతం అది ఎదలో కురియు సుభాషితం చరణం ఆశ నిరాశల ఊయలై భయపెడుతున్నది ఈ జీవితం నీ నామము ఒకటే శాశ్వతం నీ ధ్యానము ఒకటే మా హితం చరణం నమ్మకమొకటే మిగలగ విశ్వాసముతోటి సాగుదాం సాయినాధుడే నీడగా భయచింతనయే వీడుదాం - సి.యస్.రాంబాబు
Read More
వీలునామా

వీలునామా

వీలునామా రాత్రంతా జ్ఞాపకాల పహారాలో గడిపాను ఎక్కడెక్కడి వారో పలకరించి వెళ్ళారు ఆ పరిమళం ఇంకా వీడలేదు నన్ను నిద్ర గొప్పది అప్పుడప్పుడు మేలు చేస్తుంది పక్షుల కిలకిలలతో మళ్ళీ మనలోకంలో పడ్డాను వెచ్చని కిరణాలన్నీ ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి కళ్ళలో ఆ మెరుపేమిటని నేను మరచిన వారి జాడలవి అన్నాను కాలం వేళ్ళసందుల్లోంచి జారే ఇసకలాంటిది గ్రహించేంత వీలూ ఇవ్వదు జ్ఞాపకాల వీలునామా భద్రపరుచుకుంటే కృతజ్ఞతల వెన్నెల ఎప్పుడయినా కురిపించవచ్చు - సి.యస్.రాంబాబు
Read More
పోలిక

పోలిక

పోలిక ఎగిరే పక్షికి ఆంక్షలు లేవు ఎదిగే మనిషిపై నిఘా ఉంటుంది పక్షి తిండిపై అభ్యంతరం ఉండదు తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని మనిషిపై సందేహం ఉంటుంది సంచార జీవనమే పక్షికి తెలుసు స్థిరజీవనంతో కూడబెట్టడమే మనిషికి పని పక్షి తన పిల్లలకు స్వేచ్ఛను నేర్పుతుంది మనిషి తన సంతానానికి భయం నేర్పుతాడు పక్షి స్వేచ్చను చూసి మనిషి అసూయపడుతుంటాడు మనిషి స్వార్థానికి పక్షి కలవరపడుతుంది పక్షికి కుత్సితాలు తెలీవు మనిషికి మనిషిగా ఉండటం తెలియదు - సి.యస్.రాంబాబు
Read More
పోలిక

పోలిక

పోలిక ఎగిరే పక్షికి ఆంక్షలు లేవు ఎదిగే మనిషిపై నిఘా ఉంటుంది పక్షి తిండిపై అభ్యంతరం ఉండదు తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని మనిషిపై సందేహం ఉంటుంది సంచార జీవనమే పక్షికి తెలుసు స్థిరజీవనంతో కూడబెట్టడమే మనిషికి పని పక్షి తన పిల్లలకు స్వేచ్ఛను నేర్పుతుంది మనిషి తన సంతానానికి భయం నేర్పుతాడు పక్షి స్వేచ్చను చూసి మనిషి అసూయపడుతుంటాడు మనిషి స్వార్థానికి పక్షి కలవరపడుతుంది పక్షికి కుత్సితాలు తెలీవు మనిషికి మనిషిగా ఉండటం తెలియదు - సి.యస్.రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి శ్రీనివాసుని చూసెదమండీ కష్టాలన్నీ తీరునులెండి పదమే పాడుతు కదలాలండీ ఏడుకొండలు ఎక్కెదమండీ చరణం కలియుగమున వెలసినవాడు నిత్యపూజలను గైకొనువాడు భక్తసులభుడూ శ్రీనివాసుడు అభయమునిచ్చి కాపాడేవాడు చరణం కలతలు నలతలు తనవంటాడు తనువు మనసు తనదందాము కలియుగమందున వెలసినవాడు వేదనలన్నీ తెలిసినవాడు చరణం చిరునవ్వేగా తన ఆభరణము తన కరుణేగా మనసాధనము అండగ నిలిచి ధైర్యమునిచ్చి వేడుక చేయును మన జీవితమును - సి.యస్.రాంబాబు
Read More