ధరణి మొదటి భాగం
ధరణి మొదటి భాగం మల్లెల వాన , మల్లెల వాన , నాలోనా అంటూ చెట్టుకు పూసిన పువ్వుని తన బుగ్గ మీద కొట్టుకుంటూ , సంతోషపడుతున్న మనవరాలిని చూస్తూ , ఒసే పిచ్చి మొఖమా పాడింది చాల్లే , కానీ వచ్చి ఇంత ఉడకేసి చావు , అంది నాయనమ్మ అనసూయ. అబ్బా ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండనివ్వదు, ఈ ముసలిది అంటూ వస్తున్నా , అని లోపలికి నడిచింది ధరణి. ఏంటి ముసలమ్మ ఆకలి బాగా వేస్తోందా నీకు, అయినా ఇప్పుడే కదే చెంబు నిండా పాలు తాగావు , అప్పుడే మళ్ళి ఆకలి వేస్తుందా నాన్నమ్మ ,అంటూ అమయాకంగా అడిగింది ధరణి .. ఓ యబ్బో మరి చిక్కటి పాలా, ఏమన్నన్నా, పాలు ఇచ్చావు, నేనది తాగి అరగక ఆపసోపాలు పడుతున్నా... నీ బాబు నాకు మంచి పండ్లు, పాలు తెస్తే ఇంకేం అనేదానివో, అయినా…