eeroju amsham:- vennela

వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెలతో నా అనుభవాలు వెన్నెల తో పెద్దగా పరిచయం లేదు 😐 కానీ, వేసవి కాలంలో మాత్రం మా ఇంటి వసారా లో మా అమ్మగారు చాప వేసి, వంట పాత్రలన్నీ తెచ్చి, అందరికీ ఒకే దగ్గర కలిపి పెట్టేది. కొత్తగా పెట్టిన అవకాయలో కాచిన నెయ్యి కానీ లేదా కాచిన నూనె కానీ వేసి, కలిపి ముద్దలుగా ఒక్కొక్కరికి పెట్టేది. మేము అమ్మ పెట్టే ముద్దలను గబుక్కున మింగేసి, మళ్లీ చేతులు చాపే వాళ్ళం. ఆవకాయ అన్నం ఎంత తిన్నా తృప్తి ఉండేది కాదు. పైగా తినే కొద్ది తినాలనిపించేది. అందుకే అంటారేమో అమ్మ, ఆవకాయ ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఎంత తిన్నా తనివి తీరదు అని 😜 ఆ తర్వాత ఏదైనా కూర కానీ లేదా పప్పు చారు కానీ కలిపి పెట్టేది. అమ్మ పెడుతూనే ఉండేది. మేము తింటూనే ఉండేవాళ్ళం. పిల్లలం కాబట్టి మాకు మా కడుపు…
Read More

ఈరోజు అంశం:- వెన్నెల

ఈరోజు అంశం:- వెన్నెల వెన్నెల ఈ పదం వినగానే ఆకాశంలో విరగకాసే వెన్నెల, చుట్టూ చుక్కల నడుమ రేరాజులా వెలిగిపోతూ, చల్లని వెన్నెల ప్రసరించే నెలరాజు చూపులు తట్టుకోలేక కొంగు జార్చే పడతులు ఎందరో... వెన్నెలను చూపుతూ గోరు ముద్దలు తినిపించే తల్లులు, వెన్నెల్లో గోదావరి అందాలు, ఆ ఇసుకు తిన్నెల పై ఆడుకునే ఆటలు, చుక్కలను లెక్క బెడుతూ ఆరుబయట నులక మంచం పైన ఉన్న పిల్లలకు వెన్నెల గురించి కథలు చెప్పే తండ్రులు, అదే వెన్నెల్లో కూర్చుని పాత విషయాలను గుర్తు చేసుకునే అవ్వ తాతలు, ప్రియుడి రాక కోసం ఎదురు చూస్తూన్న ప్రేయసి విరహతాపాలు.... అబ్బో ఎన్నని చెప్పగలము, ఏమని వర్ణించగలము. వెన్నెలతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు. అలాంటి వెన్నెల గురించి మీ అందమైన అనుభవాన్ని కవిత గానీ, కథ గా గానీ రాసి పంపండి. వెన్నెలతో నా అనుభవాలు అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం…
Read More