తెలుగోడి సత్తా దేశభాషలందు తెలుగు లెస్స మహనీయులందరూ మన తెలుగు బిడ్డలే వజ్రం లాంటి మేధావులు ఉన్నారు తరగని చెరగని చరితలు పొందారు కోహినూర్ వజ్రం మన తెలుగువారి సత్తా శ్రీకృష్ణదేవరాయలు తెలుగోడి సత్తా దృష్టి పోతన నన్నయ తిక్కన శ్రీనాధులు సినారె శ్రీ శ్రీ గురజాడ చాటినారు తెలుగు వారి కీర్తి - యడ్ల శ్రీనివాసరావు
మహారాజు ఒక నాన్నగా ఒక అన్నగా ఒక భర్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తారు మగవారు తన కుటుబసభ్యుల కోసం నిరంతరం శ్రమించి వారి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మౌనంగా భరిస్తారు. తను నిర్మించుకున్న తన సామ్రాజ్యం కి తనే రాజుగా ఉండాలి అనుకుంటాడు తనని నమ్మిన వారికి వెనక ఉండి నడిపిస్తాడు తన రక్తానికి ప్రాణమైన ఇచ్చేస్తాడు తన మరణం కూడా నిశబ్దంగా భరిస్తాడు వచ్చిన అవకాశం ఉపయోగించి తనకంటూ కొన్ని పేజీలు చరిత్రలో రాసుకుంటాడు. -భరద్వాజ్