g jaya aksharalipi

తనువు

తనువు తనువుకు చాలని తన్మయత్వం గుప్పెడంత గుండెకు ఆకారం స్పందనలన్నీ తనువే చేయాలి పులకించినా జలదరించినా మనసు భాషల ఊసులు తనువు తరచి చెబుతుంది శ్వాస ధ్యాసల రూపమే విడదీయని బంధమే తనువు పెనవేసిన తనువు మనువుల సమ్మిలతమే ప్రతిసృష్టికి మూలమే కదా ఈ జగతి ....? - జి జయ
Read More

నీ నవ్వు

నీ నవ్వు నీ నవ్వు నామదిని ఉత్సాహంగాఉండేలా చేస్తుంది నీనవ్వు నీఉనికినితెలియచేస్తుంది నీ నవ్వు ఉప్పెననుకూడాతుడిపేస్తుంది నీ నవ్వు కనులకు హాయినిస్తుంది నీ నవ్వు మనసుకు తృప్తి నిస్తుంది నీ నవ్వు ఆకాశమంతఆనందాన్నిస్తుంది నీ నవ్వు నా ముఖచిత్రమైవెలుగుతుంది నీ నవ్వు ప్రతిబింబమై చేరుతుంది నీ నవ్వు విప్పనిభావానికిసంకేతమవుతుంది నీ నవ్వు పలకబోయే మాటకు మంత్ర మవుతుంది నీ నవ్వు కనుల సంతకమై ముద్రిస్తుంది నీ నవ్వు ఏదైనా అదృష్టపు అంచులకు చేరవేస్తుంది కదూ! - జి జయ
Read More

కఠోరశ్రమ

కఠోరశ్రమ సాధించే విజయాల వెనుక సంగతులు ఎన్నో ఉంటాయి జీవితాలు మారడానికి సోపానం కఠోర శ్రమ స్ఫూర్తి పొందుతారు కలల సాకారం కోసం గడిచేకాలంలోశ్రమకుమించి ప్రతిభ తోడుగా ఆరాటం ఆలోచనల రహస్యాలను చేధిస్తూ నిర్ణయాల పరిధిలో సాధించాలనే తపన ఆశయాల సాధనకుపునాది మనోబలంమందగించకుండా వుండాలి సంకల్పదీక్ష లో ఆ శ్రమ బాధ్యత లోనూ భవితలోను, వృత్తిలోను మనసుకు నచ్చినదో మరి గెలిచి తీరాలనే లక్ష్యం తృప్తినిచ్చే పనులు కనిపించే శ్రమ వెనుక దాగిన సంతోషాలసమయం విజయానికి మెట్టులా స్వయంకృషికి అద్దంలా ఏకలవ్యుని బాణంలా కఠోర శ్రమ ఫలితం కోసం వేచిచూడాలి కదా! - జి జయ
Read More

పచ్చని కాపురం

పచ్చని కాపురం ఒక చిన్న ఊరిలో రంగయ్య అనే అతను వుండేవాడు. వారిది మంచి కుటుంబం కాని రంగయ్య వాళ్ళ నాన్న తెలివైన వాడే అయినా మెతకతనం వల్ల ఆయన సొంత ఊరిలో పొలం అది వున్నా వ్యాపార నిమిత్తం దగ్గరలో వున్న పట్టణానికి వెళ్లి వ్యాపారం సాగించసాగాడు. అన్ని కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ  నలుగురి లో మంచి పేరు సంపాదించుకున్నాడు. కాని కొంత కాలానికి రంగయ్యకు అత్యాశ కలిగింది ఏమిటా అంటే ఇన్నేళ్ల సంసారంలో దాచుకున్న డబ్బును పెంపు చేసుకునే మార్గం ఆలోచించాడు. అప్పుడు సుందరం అనే వ్యక్తి పరిచయమ్యాడు. అతని సలహాలు పాటిస్తూ షేర్ మార్కెట్లో పెట్టుబడులు వెచ్చిస్తూ నమ్మకంగా సాగిపోతున్న రోజుల్లో ఒక్క కుదుపు లాంటి సందర్భం వచ్చింది. రంగయ్య కాసింత అనుమానానికి గురయ్యాడు దాంతో అనుమానపు రంగయ్యగా మారిపోయి ఎవ్వరు ఏమి మాట్లాడినా అంతరంగo మాత్రం సుందరం మాటలు రంగయ్య అర్దం కావటం లేదు.…
Read More

మౌనానికి మాటవస్తే

మౌనానికి మాటవస్తే మౌనానికి మాట వస్తే అది చాలా ఘాటుగా ఇంకా శక్తి తో కలిసి వస్తుంది. ఆ మాట భరించే శక్తి ఎదుటివారికి కూడా వుండాలి. అప్పుడు ఆ సమయంలో మౌనం విలువ ఎంతటిదో అర్థమవుతుంది. మౌనం వెనక బాధ వుండచ్చు అది వెంటాడుతూనే వస్తుంది శక్తిని కూడగట్టుకొని నిజమైన అస్త్రంగా చేస్తుంది. ఎందరో మహనీయులు మౌనాన్ని సాధన చేసి వారు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది "శాస్త్రవేత్తలు" మనందరం ఈ రోజు ఇంత సౌకర్యంగా ఆధునికంగా గడుపుతున్నాము అంటే వారి అద్భుత ప్రయోగాలే. వారు మౌనాన్ని పనిగా తీసుకుని శ్రమిస్తారు. ఫలితం మాట రూపంలో అందరికి అందిస్తారు. అబ్దుల్ కలాం గారు నిదర్శనం. ఆయన రాకెట్ ప్రయోగ అనంతరం ఒక  మాట చెప్పారు. మౌనం అనేది బలహీనత కాదు అది ఒక శక్తివంతమైన జవాబు అని . అన్ని ఇంద్రియాలను అధీనంలో పెట్టుకుంటే…
Read More

అనుభవాలు

అనుభవాలు కొందరికి అనుభవాలు నిర్ణయాలు జ్ఞాపకాలు లక్ష్యాలు వృత్తి పరమైనవి వ్యక్తిగతమైన వి సాధించే వి స్వస్థలాలు కుటుంబం ప్రకృతిలో చూడదగ్గవి మనుషులతో పంచుకునేవి అంకితం చేసే పనులు ఎందరో మహానుభావులు కూడా తీరని కోరికలతో వెళ్లి పోతున్నారు. కలలాగా మిగలకుండా విసుగు లేకుండా ప్రయత్నం మదిలో తీరని కోరికలు గా వున్నా తీరే కోరికలు కోరడం మిన్న అవే అపురూపంగా మార్చుకొని మనసారా జీవించాలి అందరు. - జి జయ
Read More

ప్రయాణం

ప్రయాణం ప్రతిరోజూ పయనమే మరి జీవిత కాలం లో నిర్దేశాల ప్రకృతి నియమాలతో మనకు పంచే లక్ష్యాలతో మనసు వూగినా ఆగినా గమ్యం వైపే నీ ఆశ సూర్యుడు అస్తమించాడు అని సేదతీరినా మళ్లీ ఉదయాన్నే నీ ముందు ప్రత్యక్షమవుతాడు అలుపు సొలుపు లేకుండా అందరికంటే ముందుగా ఆలోచించడం నీ వంతు పరుగెత్తే నీ శక్తికి నీ అడుగుకు తోడు దొరుకుతుందో చూడు సాధ్యమైతే అందుకోవడానికి ప్రయాణం ఆపకు అంటోంది మది నిండుగా......? - జి జయ
Read More

ధరిత్రీ

ధరిత్రీ ధరణి వొడిలోనిపసిపాప లు పంచభూతాల అంశాలే జీవకోటి సమస్తం. సిరిసంపదల నిధులు అక్షయ పాత్రలా ఆహారం పుడమితల్లి సొంతం పచ్చని అడవుల ప్రాకారాలు జంతుజాతుల సమూహాలు అరణ్యాల సరిహద్దులు కొండా కోనల విన్యాసాలు ప్రకృతిమాత అనుగ్రహం పుత్తడిగనులు విరిసిన పూతోటలు సముద్రపు జలచరాలు పక్షుల కిలకిలా రావాలు వన్య ప్రాణుల క్షేత్రంభూదేవి స్వధర్మం. ప్రకృతి సహచర్యాన్ని వదిలి ప్రయోగ వేదిక అవుతుంది అవని లోని అద్భుతాల అన్వేషణ కోసం. అదేమానవాళి మనుగడ కు పొంచి వున్న ముప్పు ప్రగతి రథాలు పరుగిడినా సాధించిన విజయాలు మానవుడి మాయాజాలంతో మట్టి విలువ మాత్రం మరచి పోతున్నారు . అదే శాపమై కరోనా గుణ పాఠం తో మొదలు పెట్టిందివిశ్వానికిహెచ్చరిక లా ప్రమాదపు గంట విపిస్తున్నా ప్రకృతి ప్రళయాలు చూపినా భాద్యత నాది కాదని చూస్తున్నాం మనుషులందరూ భూతాపం పెరిగి మంచుల కొండలు కరిగి ఊహించని ఉత్పాతాలు కలిగి విచక్షణ లేని ప్లాస్టిక్…
Read More

చరిత్ర

చరిత్ర కాల గర్భంలో గతించిన సమాజపు విషయాలు అన్నీ చరిత్రకే అంకితం కోతి రూపం లోనుండి మానవుడు రూపాంతరం మానవ చరిత్ర కృత, త్రేతా, ద్వాపర , కలి యుగాల కదలిక కాల చరిత్ర వ్యవస్థ ల మార్పు చేర్పులు కాలాను గుణంగా వచ్చిన స్వతంత్రదేశాల చరిత్ర కాలక్రమేణా కరిగిపోయిన విలువల వటవృక్షం ఆదునిక చరిత్ర శాసనాల శపధాలు ప్రజల మధ్యన పడి వున్న పరిచయాలు నాయకుల చరిత్ర మేల్కొలిపే మార్గాలు అణచి వేసిన ముద్రలు స్వాతంత్ర్య సమరాలు ఉద్యమ చరిత్ర నిరంతరం నిస్వార్డంతో మనుగడకోసం నిలిచిన మహానుభావుల చరిత్ర అన్వేషణ ఆగకుండా అందరికోసం ఆరాటం వైజ్ఞాలికుల చరిత్ర స్ఫూర్తి నే అక్షరాల పదాలు అందించే సామర్థ్యం తత్వవేత్త ల తార్కిక చరిత్ర తనకు తానుగా రచించిన అనుభవాలఅనుసంధానం వ్యక్తి చరిత్ర తరతరాల తీరని కోరిక మనిషికి కూడు గుడ్డ గూడు ఇవి తీర్చడానికి ఇంత పెద్ద చరిత్రా.......? - జి…
Read More

డైరీ

డైరీ వెళ్లిపోయిన క్షణాలను వెతికి పట్టి తెల్లని కాగితం పై గులక రాళ్ళ లాంటి అనుభవాల అక్షరాల అంతరంగ భావాల పట్టికనే డైరీ . సంవత్సరానికి సరిపడా పేజీలతో నేస్తమై వేచి చూసి నీవు చేసిన తప్పులను తరచుకుం టూ నిఘంటువు గా నీ దగ్గరే ఉండి జ్ఞాపకాల గమ్మత్తులైనా కన్నీటి కష్టాలైనా గడచిపోయింది రోజులైనా గాయపరిచిన మనిషులైనా భావాల భంగిమ లైనా మనసుపడే మూగ బాధైనా ఒత్తిడి లో వూగిన సమయమైనా భారమనిపించే గుండె బరువైనా సందేహాల సంగతులైనా చడీచప్పుడూ కానీ స్వార్థమైనా బంధాల బరువులైనా బదులివ్వని మాటలైనా విషా దపు ఛాయలై నా విజయాల విన్నపం అయినా నిజాన్ని నిశబ్దంగా నీకు తెలిపే నిధి ఉందని తెలుసుకునే అవకాశం ప్రాపంచిక విషయా లైనా సిరా చుక్కల రూపంలో సాక్షిగా ప్రతిబింబించే నీకు నువ్వుగా రాసుకున్న నిదర్శన గ్రంధం డైరీ ..... - జి జయ
Read More