కవితా దినోత్సవం రవిగాంచని చోట కవిగాంచును అన్నారు మహానుభావులు అక్షరాలను అమర్చి భావాలను మలచి బంధాలను తరచి సమాజాన్ని చూసి నిజాలను కణిక చేసి అనుభూతులను ఆహ్వానించి ఆలోచనలను విస్తరించి అంశాలను అర్థవంతం చేసి సంస్కృతులను విస్తరించి చరిత్రను ఇనుమడించి కొత్త దనాలను ఆవిష్కరించి మాధుర్యాలను రంగరించి అభిరుచులకు అద్దం పట్టి హృదయాలను ద్రవింప చేసి అభ్యుదయాలకు ఆజ్యం పోసి భాషనే సాధనం చేసి భావాలను వ్యక్తీకరించి ఊహలకు ఊపందించి మానవీయతను మనముందుంచి స్ఫూర్తినే సంధించి పదాల పదనిసలు పలికించి కవితా సౌరభాలు వెలిగించే కవనసేద్యం చేసే వారందరూ కదిలే కవితా మూర్తులే మరి వారందరికీ కవితా దినోత్సవ శుభాకాంక్షలు. - జి జయ
ఉగాది తెలుగు సంవత్సరాది శోభకృత్ కి స్వాగతం చైత్రమాస ప్రారంభం శుభాలకు సంకేతం కావాలని తొలి మాసం నుండే శుభ ఫలితాలు కలగాలని కొత్త ఆశలు చిగురు కొమ్మల వలె వికసించాలని ఉత్సాహానికి ఊపిరిలా వసంతం పలకరించాలని అవకాశాల అంచులు చేరాలని తీపి కబుర్లు చేరవేయాలని అనుభూతుల వగరు చేదు కలగలుపులే ఉంటాయని కష్టసుఖాల కాలం ఎలా ఉన్నా కర్తవ్యం ఎప్పుడు బోధిస్తూనే ప్రకృతి వర్ణాల వలె జీవన రాగంలో ఆనందాలు పలకాలని షడ్రుచుల సమ్మేళనం వలె పాడిపంటలు వృద్ధి చెందాలని సమస్త లోకానికి శాంతి సౌఖ్యాలు కలగాలని అద్భుత యోగం అందుకుని శోభకృత్ సకలశుభాలను పంచుతూ నిత్య నూతనంగా సాగిపోవాలి ...... - జి జయ
సమయం సమయం ఎవరి కోసమూ ఆగని కాలప్రవాహం గడిచిన సమయం జారినమాట తిరిగి తేలేనిది సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్లే గొప్పవాళ్లు విలువైన సమయాన్ని విలక్షణ రీతిలో వాడితే గొప్ప ఫలితాలు వస్తాయి కదిలే సమయాన్ని ఆపలేము కానీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు సమయాన్ని ప్రణాళిక వేస్తే భవిష్యత్తు బహు ప్రయోజన కారిగా మారుతుంది ఒక్క క్షణంలో కూడా ఊహించని మార్పులు జరగవచ్చు మనం చూసే మహానుభావులందరూ సమయపాలన రహస్యమే వారి విజయాల బాటలు సమయం ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతుంది శక్తిని నింపుతుంది కొన్ని సమయాల్లో సమయమే ఊరట కొన్ని సమయాల్లో సమయమే పరిష్కారం సమయమే విశ్వాసం ఏది ఏమైనా సమయాన్ని సద్వినియోగ పరచిన వాళ్లకే సమస్యలు తక్కువ అంటారు జీవితాన్నిసమయానుకూలంగా సరితూచుకొని తీర్చిదిద్దుకోవడమే మన ముందున్న లక్ష్యం మరి.... - జి జయ
నిర్లక్ష్యం యొక్క ప్రభావం నిర్లక్ష్యం నిలువునా దహించేస్తుంది చెప్పలేనంత చేటు చేసి ఆదమరిస్తే నిర్లక్ష్యం కరిగే కాలంలో కాటేసి నమ్మకం నశించి నష్టాల మూల మంత్రంమై పరాజయాలు పక్కనే చేరి చైతన్యానికి చెదలు పడితే చెల్లించలేని మూల్యమే అవకాశాలు చేజారి అందనంత దూరంలో ప్రేమానుబంధాలు పెళుసై సమస్యలను సరిగా తూచలేక సంతోషాలు దూరమై కష్టం విలువ కాపాడలేక అడ్డంకులే కారణాలుగా ఆవశ్యకతలను గుర్తించలేక బాధ్యతలను బందీ చేస్తే సతమతమే తెలియకచేసినా తెలిసి చేసినా నిర్లక్ష్యం మాత్రం నిలువునా ముంచేస్తుంది నిండు ప్రాణాలను సైతం నిర్లక్ష్యం బలి చేస్తుంది నిర్లక్ష్యమే శత్రువై శపిస్తుంది..... - జి జయ
మూగజీవాల ఆవేదన మూగజీవాలు నోరులేనివి మాత్రమే కానీ ఈ భూమ్మీద జీవించే హక్కు అన్నింటికీ ఉంది. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి జీవించే హక్కు సృష్టించబడింది. ప్రతి జీవి పుట్టుక నుండి చావు వరకు హింసించబడకూడదు అనేది ఈ సుందరవిశ్వంలో అన్ని అందాల అమరికలే అని తెలుసుకోవాలి. మానవ హక్కులకు చట్టాలు ఉన్నట్లే మూగజీవాలకు కూడా జంతు సంరక్షణ చట్టాలు ఉన్నాయి కానీ వాటిని తుంగలో తొక్కి పవిత్రమైన గోమాతను సైతం వధించి భుజిస్తున్నారు. మూగ జీవాలు కూడా పర్యావరణసమతుల్యంలో భాగమే అది గుర్తించని జనాలు వాటిని ప్రేమించడం మానేసి వధించడం చేస్తున్నారు. మూగజీవాల నాశనానికి కారణమవుతున్నారు. పచ్చని చెట్లు నరికివేసి జీవావరణంలో వాటి చోటును కూడా లాక్కుంటున్నాడు మనిషి. మానవ తప్పిదాల వలన వాటి ప్రాణాలను బలికుంటున్నారు. అడవులు కాలిపోయినప్పుడు కరువుకాటకాలు సంభవించినప్పుడు ప్రకృతి విలయాలలో మూగజీవాల ఆవేదన అరణ్యరోధనే మానవ ఆవాసాలు ఎలాగో మూగజీవాలు కూడామనిషి మనుగడకు అవసరమే అని అవగాహన…
సర్దుబాటు సర్దుబాటు ఎన్నో సమస్యలకు పరిష్కారం పరిష్కారానికి మొదటి మార్గం సర్దుబాటు సర్దుబాటు అలవాటు చేసుకుంటే అద్భుతం లేకుంటే నరకప్రాయం ఆశ పెరిగి ఆందోళన కలిగి ఆనందాన్ని పక్కకు నెట్టుతుంది అత్యాశల అనర్థాలు సంతోషాలను చంపేస్తుంది అర్థం చేసుకుంటే ఉన్నంతలో గొప్పగా జీవించడం సాధ్యమే సర్దుబాటు తత్వం అలవాటుగా కాకుండా అవసరానికి జోడించాలి అవగాహన పెంచుకుని అపార్థాలు తుంచుకుంటే సర్దుబాటే సహవాసమే జీవన గమనాలను మలుపు తిప్పినా సర్దుబాటుతో స్వీకరించాలి ఎల్లప్పుడూ అందరికీ అన్ని అందవు సర్దుబాటు సవరణే ముఖ్యం సమయాన్నిసర్దుబాటుతో సరిదిద్దుకుంటే సంతోషాలు దూరం కాకుండా తృప్తిగా జీవించొచ్చు ........ - జి జయ
ఆహారపు అలవాట్లు ఆహారమే ఔషధం అంటారు. రాజులా తినాలి బంటులా కష్టపడాలి అంటారు. ఆహారపు అలవాట్లతో పాటు శారీరక వ్యాయామం అతిముఖ్యం. సమతుల ఆహారం అనేది శరీర క్రియలను సమతుల్య పరుస్తుంది. మంచి ఆహారపు అలవాట్లు జీవనశైలిపై ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో అయితే రసాయనాలు లేని పంట చేసే పనిలోనే వ్యాయామం ఉండేది. నేటి యాంత్రిక జీవనంలో పోషకాహార లోపం వలన అనేక రకాలైన జబ్బులు రావడానికి కారణం అన్ని రకాల ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యవంతంగా ఉండటానికి తోడ్పడతాయి. ఆరోగ్యానికి మంచి ఆహారపలవాట్లు ఆరోగ్యం అంటే శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం మానసిక వికాసానికి తోడ్పడతాయి. ప్రస్తుత ఆహారపు అలవాట్లు శరీరంపై దుష్ప్రభావం చూపుతున్నాయి ఆహారం శరీర పోషణకు మాత్రమే కానీ రుచికరమైన ఆహారం వ్యసరంగా మారిపోయింది. శరీరానికి తక్కువ శ్రమ, మనసుకు ఎక్కువ శ్రమ అనే విధంగా మారిపోయియి…
ఇంగిత జ్ఞానం ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధితో నడుచుకోవడమే ఇంకిత జ్ఞానం సాటి మనిషిని సంస్కారవంతంగా ప్రేమించడం ఇంగిత జ్ఞానం అదే జ్ఞానం లోపిస్తే:- అంతరాత్మను అనుసరించ లేకపోతారు గందరగోళాల సృష్టిస్తారు ఆలోచనలుపదును పెట్టలేరు సమయాన్ని సద్వినియోగపరచలేరు మానవత్వం మరిచిపోతారు తప్పులను ఒప్పుకోరు సహనాన్ని కోల్పోతారు విమర్శనాస్త్రాలు సంధిస్తారు అహంనీ అదుపులో ఉంచుకోలేరు వివేకం విస్మరిస్తారు సమయస్ఫూర్తి సవ్యంగా ఉపయోగించరు ఫిర్యాదుల పరంపరలు సాగిస్తారు దయా కరుణ మరిచిపోతారు పెద్దలను గౌరవించరు కనీస మర్యాదల కరువు అవుతాయి సామాజిక పరిస్థితులు అంచనావేయలేరు అవగాహన లోపిస్తుంది విచక్షణ రహితంగా వ్యవహరిస్తారు సరియైన మానసిక వికాసంతో ఉండలేరు జ్ఞానపరిపక్వత రానివ్వలేరు క్రమశిక్షణారహిత్యం పెరుగుతుంది తెలివితేటల తేడాలున్నా కూడా ఇంగిత జ్ఞానం మనిషి వరంగా మారాలి మనిషిలోని అరిషడ్వర్గాలు అదుపులో లేని వారికి ఇంగిత జ్ఞానంతక్కువే నాగరిక సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి ఇంగితజ్ఞానంతో జీవించడానికి ప్రయత్నించాలి విద్యావంతులు సైతం గ్రంథార్జన జ్ఞానార్జనలే కాకుండా సమాజంలో…