g jaya

అంతిమయాత్ర

అంతిమయాత్ర

అంతిమయాత్ర ఊరు దూరం కాటి దగ్గర అంటారు కదా మరి జనన మరణాల ఆత్మ డోలాయ మాన మార్గం ఆయుష్షు తీరి ఎవరి కోసం ఎదురుచూడని దారి అది విగత జీవికి మనం ఇచ్చే చివరి నీరాజనం సృష్టిలో జీవిత సమరం ముగిసి కనుమరుగు కు ప్రయాణం అది వొంటరిగా వచ్చి వొంటరిగా వెళ్ళే పాదయాత్ర నీ వాళ్ళు అనుకునే వారికి హృదయ ఘోష అది చేతనత్వాన్ని వదిలి పంచభూతాల సన్నిధికి చేరే అనంత లోకాల అంతిమయాత్ర అది.... -జి. జయ
Read More
నీ కోసం

నీ కోసం

నీ కోసం మనసు లోని అన్వేషణ నీ కోసం వేచి వున్న పరిచయాల భావన నీ కోసం మదినిందిన ఊహలు నీ కోసం కోటి ఆశల అంతరంగం నీ కోసం కోరికల మూటలైనవి నీ కోసం ప్రేమే సాక్షాత్కరించింది నీ కోసం ఎందరినో వదులుకున్న బంధం నీ కోసం వేచియున్న వేదికైనది నీ కోసం అనురాగాల ఆరగింపులు నీ కోసం ఆరాటాల ఈ పయనం నీ కోసం నమ్మకమే నడిచింది నీ కోసం మనసిచ్చిన నాడే మురిసింది నీ కోసం నీతో నడుస్తున్న ఈ జీవిత పయన మే నిజమని తెలుసుకున్న ఈ భావాన్ని అక్షర సుమాలుగా నీ కోసం నీ కోసం -జి.జయ
Read More
మహిళ

మహిళ

మహిళ మహిళా ఓ మహిళా బ్రహ్మ కైనా  అమ్మవి నీవే అమృతపు వాక్కునీవే ఆత్మీయత అనురాగం నీవే అన్నపూర్ణ వి నీవే ఆదిశక్తి వి నీవే ఓర్పు నీవే నేర్పు నీవే నవరసాల నాట్యము నీవే పరిమళించే పూవు నీవే ప్రతి ఇంటా మార్గం నీవే అవనిలోనూ అంతరిక్షం లోనూ అరుదైన పాత్ర నీవే ధీర వనిత వి నీవే వీర మాతవూ నీవే వుప్పోంగే కెరటం నీవే ఉలిక్కి పడే గాథ నీదే మారుతున్న కాలంలో కావాలి నువ్వొక మహాశక్తి మహిళా ఓ మహిళా నీ మనుగడే  మానవాళి అద్భుత శక్తి అదే నీలో వున్న దివ్యశక్తి మహిళా ఓ మహిళా  - జి.జయ
Read More
నిశీధి

నిశీధి

నిశీధి చిరు దీపం పేరు వింటే నిశీధి చీకట్లు తొలగవు అన్నం పేరు వెంటే ఆకలి తీరదు  కదా సాధన లేకుంటే జయం వుండదు నిశి రాతిరి వేళలో శశి కోసం చూడాలి ఎడారి లో ఎండమావి ఉండదా ఎదురుచూపు లక్ష్యం  లో ఎంతో కొంత వూరట విశాల వీక్షణంలో కనుచూపు లోని కాంతి కాదా భూ భ్రమణపు  లో కనబడినకాంతి కిరణం. - జి.జయ
Read More
తార

తార

తార పాలపుంత క్షేత్రంలో అది కాంతులు విరజిమ్మే  ఒక తార కనుచూపు మేరలో కబడని అందమైన వీక్షణమే తార అచ్చెరు వందే ఆకాశంలో అద్భుతం  ఒక తార నిశీధి ఆకాశంలో తలుక్కుమనే మెరుపు ఒక తార వెన్నలే చిలికే పున్నమిలో దాగిన దావలి ఒక తార అరుణారుణ  కాంతులతో అందని ఒక అందం ఒక తార అందరికీ ఆదర్శమైన తార ఒకటి  అరుంధతి తారలకు తార సితార. - జి.జయ
Read More
తొలిచూపు

తొలిచూపు

తొలిచూపు  మాటలు లేని మంత్రము  భాష లేని భావము తొలిచూపు  కళ్ళలోన కదలాడుతూనే  హృదయ వీణ రాగము తొలి చూపు  ఆలోచనలు ఆగిపోయి  ప్రేమ పదాల ఉత్తరం తొలి చూపు  అందానికి బందమై  వింత  అనుభవాల  గంధమై పరిచయానికి  తెరతీసి పరిధులు దాటి  ప్రణయమై   ప్రేమ పుస్తకంగా పయనం అయితే  తొలి చూపు అవుతుంది  మలి బంధమై  కానిచో  అది అవుతుంది జీవితంలో  ఏప్రిల్ ఫూల్.... - జి.జయ
Read More
మన్నింపు

మన్నింపు

మన్నింపు భావం బావుంటే భవిష్యత్తు బావుంటుంది మన్నించే గుణముంటే మంచే జరుగుతుంది అంటారు. మన్నించే మనసుసున్నవాడు దేవుడి కన్నా గొప్ప వాడట మనసు నొచ్చిన మాటను మన్నింపూ కడుతుంది జారిపోయిన కాలాన్ని కటినంగా శిక్షించకు మనసుకు నచ్చినది ఒప్పు ఎదురువచ్చింది తప్పు కాదు అని తెలుసుకో దయ జాలి కరుణ నవ్వు దేవుడిచ్చిన వరాలు. అహంకారము నీవు నేర్చిన అభ్యాసము అందుకే ఒక్కసారి మన్నించి చూడు నీకే తెలుస్తుంది ఆ శాంతత. అది ఒక కనువిప్పుగా మిగులుతుంది నిన్ను నమ్మిన  వారిలో. - జి.జయ
Read More
వాగ్దానం

వాగ్దానం

వాగ్దానం సంతోషంలో వాగ్దానం చేయొద్దు కోపంలో మాట మాట్లాడవద్దు అంటారు అతి తేలికైన విషయంగా కనిపించినా అది ఒక పెద్ద బూతద్దం లాంటిది కోరికతో చేసే పని అయినా వినడానికి బానేవున్నా  ఫలితానికి దూరంగా కనిపిస్తుంది నిజానికి ఎదుటి వారు చేసే వాగ్దానం బాణం లా వెలుతుందట ముందుచూపు లేని మాట ఆచరణ లేని అవకాశము ఒక్కటే కొన్నిసార్లు భ్రమ కల్పించే వాగ్దానాలు పశ్చాతాపం స్నేహ బంధాలు అనుబంధాలలో కూడా ప్రతిబంధకంగా నిలుస్తాయి వాగ్దానాలు ప్రమాణం లేని స్వప్నం కాకుండా ఫలితాన్ని ఇచ్చే ఆచరణలో ఉండాలి, కానిచో వర మిచ్చిన వాగ్ధానినికే శాపమవుతుంది. - జి. జయ
Read More
కౌగిలి

కౌగిలి

కౌగిలి మిద్దెలు మేడలు లేకున్నా  నీ నులి వెచ్చని కౌగిలి చాలు  అన్నది ఒక నెచ్చెలి  హృదయపు వాకిలిలో పరచుకున్న  పచ్చని పైరు లాంటి ఒక  అనుభూతి   హృదయ స్పందనల  అందమైన అల కౌగిలి  నీ బాధను ఓదార్చే ఇంకొక  హృదయమే ఓదార్పు కౌగిలి  నిన్నుచూసి పులకించే ఆ ఎదయే ఆత్మీయ కౌగిలి  నే ప్రయాణపు క్షేమం కోరేది  ఆశీస్సుల కౌగిలి   నువ్వే ప్రాణమని నమ్మేదిఅనుబందపు  కౌగిలి  నా కళ్ళని నేనే నమ్మలేని  సందర్భం ఆశర్యపు కౌగిలి  నీవే గొప్ప అని అన్నది ఒక మమత అభినందన కౌగిలి  నే కొరకై వేచి చూసి ఎదురైంది ఆహ్వనపు కౌగిలి  నిన్ను  నిన్నులా మైమరిపించే ఒకే ఒక్కటి  నీ హృదయపు కౌగిలి స్పందన . - జి.జయ
Read More
ప్రేమలేఖ

ప్రేమలేఖ

ప్రేమలేఖ అమ్మకి అంకితం. అమ్మప్రేమ అపురూప మైనది అనురాగపు విరుల గుత్తి. అష్టైశ్వర్యాలు కూడా సరిరాని అమ్మ ప్రేమ జీవిత ప్రయాణములో ప్రసవ వేదన నుండి మొదలై మధుర పాశంలా సాగుతుంది అమ్మ ప్రేమ. అనుభూతికి అక్షరంలా, స్నేహానికి చిరునామలా, శ్రుతి మించిన అభిమానంలా, నమ్మకమే నాణ్యతగా నిలిచిపోతుంది అమ్మ ప్రేమ... నిను కోరిన ఒకేఒక్క జీవి జగతిలో అమ్మ ప్రేమ నిను తాకిననాడే పొరలిన ఆనందం. మంచి మనసుకు మార్కు లాంటిది అమ్మ ప్రేమ చీకటి వెలుగుల సయ్యాటలో చిరు దీపమై వెలిగేది ఒకే ఒక్కటి అదే అమ్మ ప్రేమ ప్రేమే ప్రాణం ప్రాణమే ప్రేమ గా నిర్వచనం అమ్మ ప్రేమ అది పొందగలిగిన రోజులు అమృతమయం లేనిచో హృదయ గోష అమ్మ ప్రేమ కోసం తపించే ప్రతి జీవి అజరామరం - జి.జయ
Read More