గతం గతమే గతిని నిర్దేశించేది. జ్ఞాపకంలా గుర్తుండిపోయేది. అనుభవాల సారమిది. అనుభూతులు మిగిల్చేది. వర్తమానానికి దిక్సూచిది. భవిష్యత్తుకు నిఘంటువిది. గతమనేది జీవిత కాలపు గుర్తు. గతమే లేని జీవితం లేదు. గతంలోనే జీవనం సాగిస్తే, వర్తమానానికి జీవం వుండదు. భవిష్యత్తు జీవితం వుండదు. -బి రాధిక
గతం మనం చెప్పుకుంటే ఊరట పొందుతాం కాని అనుభవించింది మాత్రం మనమే... గతం ఎప్పటికి మరుపురాని మరచిపోని సంఘటనలు గాథ. గతం గతాన్ని గుర్తుంచుకోవాలి కానీ మాటి మాటికి గుర్తు తెచ్చుకోకూడదు.. గతం గతం తాలూకూ జ్ఞాపకాలు మధురమైనవి కొన్ని అయితే, అవి గుర్తొచ్చినప్పుడు బాధ పెంచేవి కొన్ని... గతం ఆ గతంలో గడిచిపోయిన గతరోజులు గాథ. - మళ్ళిఖార్జున్
గతం గతమంతా ఒక పిడ కలగా గడిచిన రోజులు ఒక అనుభవంగా గడిపిన గడ్డు కాలం ఒక గుణ పాఠంగా గడిచిన జ్ఞ్యాపకాలు విషాదాలుగా గతం ఒక మారుతున్న కాలానికి గుర్తుగా అనుభవాల పాఠాలుగా బాధల మయంగా బ్రతుకుతున్నప్పుడు గుర్తుకు తెచ్చుకోలేని గురుతులుగా మారి భవిష్యత్తును భయపెడుతున్నప్పుడు రాబోయే కాలంలో అయినా ... గతం పడగ నీడ పడకూడదు అని గత పీడ కలలన్నీ మర్చిపోయి మారుతున్న కాలంతో పాటు కాస్తయినా సంతోషాన్ని వెతుక్కోవాలి అని ఉరుకులు పరుగులు పెడుతూ, ఉవ్విళ్లూరుతున్న కోరికలతో...... కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని కోరుకోని దేవ్వరు. భవిష్యత్తు అయినా బంగారు మయం అవ్వాలని అన్ని బాధలు పోయి, పీడ కలలన్నీ కలలే అని కొత్త కలలతో కొత్త జీవితాన్ని కోరుకుందాం... కొత్తగా ఉందాం.... - భవ్యచారు