Happy new year
Happy new year కొత్త ఆశల వేదికలుగా సరికొత్త సన్నాహాల సమీరంగా మార్పుకు ఆహ్వానం పలుకుతూ మదిలో సంతోషాలు నింపుకొని కొత్త ఉత్సాహంతో సరికొత్త నిర్ణయాలతో సాగమటోంది కొత్త సంవత్సరం నిన్నటి రోజు అనుభవాలతో మది తొలిచే సందేహాలతో ఆశయాల అడుగులలో విజయాల బాటలో ఆరోగ్యం చెదరనీయక చిట్టి కోరికల చిట్టాలతో కొత్త వెలుగుల కోణాల్లో కొత్తదనాల ప్రపంచంలో ఆశల రెక్కలు విప్పుకొని లక్ష్యాల లాంఛనాలు పూర్తి చేసుకోవాలి శాంతి సౌఖ్యాలతో వెలుగొందాలి కొత్త సంవత్సరం ప్రారంభతో ప్రపంచమంతా....? - జి జయ