happy ugadi

కుటుంబ విలువలు

కుటుంబ విలువలు

కుటుంబ విలువలు ఒక పల్లెటూరు అ ఊరిలో పెద్ద లోగిళ్ళలో వున్న ఒక ఇంట్లో ఆరోజు ఉగాది పండుగ అవ్వటంతో ఒకటే హడావిడి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తలస్నానాలు చేయటం, కుర్రాళ్లు నిద్రలేచే ప్రయత్నం చేయటం, ఆడపిల్లలు నిద్ర లేచి కాఫీ, టీ ల కోసం తల్లులని కంగారు పెట్టటం. ఇలా ఇల్లు హడావిడి హడావిడిగా వుంది... నలుగురు అన్నదమ్ములు అయిన ఆ ఇంటి పెద్ద లోగిలిలో కూర్చొని అందరి విశేషాలు తెలుసుకొంటూ వారు చెప్తున్నారు... అ ఇంటి పెద్ద కొడుకు విజయ్ చదువు ముగించుకొని సిటీలో ఉద్యోగానికి ప్రయాణం అయ్యే రోజు కూడా ఉగాది రోజే.. ఇంట్లో ఉగాది పచ్చడికి కావాల్సిన సామాగ్రి తీసుకురావటానికి విజయ్ మిగిలిన కుర్రాళ్లు, ఆడపిల్లలు అందరూ కలిసి బయటకి వచ్చారు. అన్నీ ఇంటికి తీసుకువెళ్లారు. విజయ్ వాళ్ళ అమ్మ ఉగాది పచ్చడి చేసి అందరికి పెడుతుంది.. విజయ్ వాళ్ళ నాన్న తో కూర్చొని బాబాయిలు చెప్తున్నది…
Read More
మన పండగ

మన పండగ

మన పండగ మన ఉగాది తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి చెబుతోంది మనకు జీవితమంటే, కష్టం, సుఖం, భయం ధైర్యం, బాధ, సంతోషం, కన్నీళ్లు, ఆనందభాష్పాల మిశ్రమమని సకారాత్మకతతో మన జీవితంలోని కష్టసుఖాల్ని అంగీకరించి పయనం ముందుకు సాగించాలని సందేశమిస్తుంది మన పండగ ఉగాది పండగ - భరద్వాజ్
Read More
వసంతాలమై దారి చూపుదాం

వసంతాలమై దారి చూపుదాం

వసంతాలమై దారి చూపుదాం శుభకృత్ నామ సంవత్సర శుభ ఉదయాలు కావాలి..... విరాబూసిన హృదయాలు చిరుగాలి సవ్వడి మలి వెచ్చని కిరణాలు లేత ఆకు పచ్చని తోరణాలు కోకిల కుహ కుహ లు చిన్ని పిచ్చుకల కిచ కిచ లు వేప పూల వెన్నెల లు చిలిపి మామిడి పులుపు చెంత నే ఉన్న చింత అన్నా..... ఎలా చింతా.... చేరువులో నే చెరుకు తీపి ఉన్నా... అన్నా.... పదాల విరుపులు పసి పాప పెదాల చిరు నవ్వుల పెన్నిధి అనంత విశ్వ నాధుని సన్నిధి లో మానవత్వమే పరమావధిగా ముందు తరాలకు వెలుగు బాటల వసంతాల మై దారి చూపే దివిటి ల మై దారి చూపుదాం... ప్రకృతి లో లీన మై జీవిద్దాం సొగసు గా దేర్యం గా.... అందుకే మనమందరం...... సదా అనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..... పూజ్యులు, పెద్దలు,మిత్రులు,పిన్నలు మరియు ప్రియమైన ప్రతి ఒక్కరికి శుభకృత్…
Read More
ఉగాది ఊసులు

ఉగాది ఊసులు

ఉగాది ఊసులు 1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు   చేదు.వగరు.పులుపు చేయు మేలు   ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును   మితము ఎప్పుడైన హితము గూర్చు 2 తే.గీ. కలిమి లేములు సంతోష కష్టసుఖము    లన్ని అడ్డంకుల మనిషి అధిగమించి    నీరస పడిపోకుండ యెదురు నిలువ వలెను    పారిపోకుండ నిలబడు ఫలితమిచ్చు 3 తే.గీ. పుట్టి నప్పటి నుండియు గిట్టువరకు    నరుని జీవిత మంతయు నాటకమ్ము    కష్ట సుఖములే గాకయు కలిమి లేము    లన్ని కలబోసి వచ్చును అందరకును - కోట
Read More