jaya aksharalipi

చిలిపి

చిలిపి భావానికి భాష అడ్డమా అన్నంతగా చిలిపిదనం వర్ణాలు ఒదిగిన ఒక అనువైన అందం చిలిపితనం మనసును మరచిన చీకటి కోరిక ఒక చిలిపితనం నవ్వుల లేఖల నందనం ఊసులాడే ఊహల కథలు ఒక చిలిపితనం అక్షరాల సరిగమలు తమాషా మాటల తూటాలు ఒక చిలిపి తనం ముద్దు మురిపాల పలుకు సరదాల చిరునవ్వులు ఒక చిలితనం ఊరిస్తున్న చురుకుదనం కొంటె పనుల తుంటరి తనం ఒక చిలిపితనం భాష లేని కళ్ళ భావాల ముడులు తీపిగుర్తుల చిలిపి చేష్టలు పలికి చిలికిన చిలిపితనం ... - జి జయ
Read More

మధురం

మధురం జగత్తు లోని మహిమే మకరందపు మాధుర్యం రసాస్వాదన ఓ మధురం అమ్మ లాలిపాట మధురం మృధు భాషణం మధురం నయనానందకర దృశ్యం ఓ మధురం పవిత్ర ప్రేమను పంచే హృదయం ఓ మధురం ప్రతిస్పందించే స్పర్శ ఓ మధురం అలరించే ఆట పాట ఓ మధురం రమణీయ దృశ్యం కమనీయ కావ్యం ఓ మధురం పరవశించే ప్రకృతి పరుగులు తీసే జలపాతం ఓ మధురం శ్రేష్ఠ మైన క్షీరం చిన్న నాటి జ్ఞాపకాలు ఓ మధురం తీయని కలలు వూహించని స్వప్నం ఓ మధురం క్షమించే క్షణం వేచి చూచిన ఫలితం ఓ మధురం నీకు తెలియని నిజం నీ భావనే నిజమైన మధురాతి మధురం. - జి జయ
Read More

అమృత ధార

అమృత ధార అనంత విశ్వంలో అమృత ధార ఆధార భరితం అమ్మ రుదిరాన్నే అమృత ధార గా పంచుతుంది తల్లి అదరపు అమృత ధార సేవించి తేనే ఆరోగ్యానికి ఆయువు పట్టు అలనాటి రాక్షసులు హాలా హలాన్ని ఆరగిస్తే దేవతలు అమృతాన్ని అందుకునిమృత్యున్ జయులుగా వున్నారు అదే సృష్టి రహస్యం సాగర మథనం గరళం అమృతంగా అవిష్కరిస్తే రక్కసులకు గరలంగాను దేవతలకు అమృతం గాను అందుకే అపూర్వ భావనలతో ప్రేమ వాక్కుతో అంతరంగ శుద్ధితో వాత్సల్యాన్ని పంచినదే అమృతధార ప్రతి మనిషి ఓర్పుతో వొడిసి పట్టిన అమృతాన్నిఆధునిక యుగంలో వెదికి వెదికి అనుభవించాలి అందుకే ఆలస్యం అమృతం విషం . - జి జయ  
Read More

బంకర్ బ్రతుకు 

బంకర్ బ్రతుకు  బంకర్ అంటే బంగారుగని కాదు  బ్రతుకు జీవుడా అని బ్రతికే చోటు  మానవాళి మనుగడ ఒక  ప్రశ్నగా మిగిలేది  హింస ఆగేనా  బ్రతుకు నిలిచేనా వేచి చూస్తున్న బ్రతుకు పోరాటం  బాంబుల చప్పుళ్ళు  బరితెగించిన విన్యాసాలు  అదృశ్య శక్తుల అరాచకం  కుయుక్తులు పన్నాగాలు  విచక్షణ లేని  కుసంకల్పం  గతితప్పిన మాటలు  గాడి తప్పిన స్వేచ్ఛకు  శక్తి వంతపు హితవులైనా  ఎదురు చూసేసాయమైనా   ఏమిటీ సంక్షోభం ఎందుకీ  మారణ హోమం ఒక్కసారి చూడు బంకర్ బ్రతుకు గుండె చెరువై పోతుంది. - జి.జయ
Read More

మన్నింపు

మన్నింపు భావం బావుంటే భవిష్యత్తు బావుంటుంది మన్నించే గుణముంటే మంచే జరుగుతుంది అంటారు. మన్నించే మనసుసున్నవాడు దేవుడి కన్నా గొప్ప వాడట మనసు నొచ్చిన మాటను మన్నింపూ కడుతుంది జారిపోయిన కాలాన్ని కటినంగా శిక్షించకు మనసుకు నచ్చినది ఒప్పు ఎదురువచ్చింది తప్పు కాదు అని తెలుసుకో దయ జాలి కరుణ నవ్వు దేవుడిచ్చిన వరాలు. అహంకారము నీవు నేర్చిన అభ్యాసము అందుకే ఒక్కసారి మన్నించి చూడు నీకే తెలుస్తుంది ఆ శాంతత. అది ఒక కనువిప్పుగా మిగులుతుంది నిన్ను నమ్మిన  వారిలో. - జి.జయ
Read More

తొలి ముద్దు

తొలి ముద్దు తొలిముద్దు అంటే అది ప్రేమకు ఒక నజరానా అందం అనురాగమనేది ఊరించిన ఊహలలో చిగురించిన ఒక ఆశే తొలిముద్దు రెక్కలు విప్పిన కోరికలు వలపు పిలుపుల కవ్వింత నిరీక్షించిన కన్నులకు నిజమై తెలిసినదే తొలిముద్దు సిగ్గు లోలికే నెరజానకు ప్రణయ పారవశ్యం తొలి ముద్దు చెలిమి గుండెల్లో చేరుకున్న సరిహద్దులు దాటిన ప్రేమకు చిహ్నమే తొలి ముద్దు అదే అతి పెద్ద బహుమతి కావాలి జీవితంలో... - జి జయ
Read More

మనసు మైకం

మనసు మైకం మనసు మైకంలో మంచి చెడు తెలియదు అంటారు  మధుర గీతమా మనసు పాశమా అది ఒక ఆటయా మనసుకు పట్టిన ఉన్మాదమా పనికిరాని లోభమా ఉనికి లేని ఉత్తేజమా ఆలోచించని అనర్ధమా అర్ధం కాని శోధన మనసు వినని వేదన అంతు చిక్కని ప్రశ్నలు ఉపకారమా అపకారమా అని తెలియని మనసు మైకంలోని వైకల్యము. - జి.జయ
Read More