jaya writings

కౌగిలి

కౌగిలి

కౌగిలి మిద్దెలు మేడలు లేకున్నా  నీ నులి వెచ్చని కౌగిలి చాలు  అన్నది ఒక నెచ్చెలి  హృదయపు వాకిలిలో పరచుకున్న  పచ్చని పైరు లాంటి ఒక  అనుభూతి   హృదయ స్పందనల  అందమైన అల కౌగిలి  నీ బాధను ఓదార్చే ఇంకొక  హృదయమే ఓదార్పు కౌగిలి  నిన్నుచూసి పులకించే ఆ ఎదయే ఆత్మీయ కౌగిలి  నే ప్రయాణపు క్షేమం కోరేది  ఆశీస్సుల కౌగిలి   నువ్వే ప్రాణమని నమ్మేదిఅనుబందపు  కౌగిలి  నా కళ్ళని నేనే నమ్మలేని  సందర్భం ఆశర్యపు కౌగిలి  నీవే గొప్ప అని అన్నది ఒక మమత అభినందన కౌగిలి  నే కొరకై వేచి చూసి ఎదురైంది ఆహ్వనపు కౌగిలి  నిన్ను  నిన్నులా మైమరిపించే ఒకే ఒక్కటి  నీ హృదయపు కౌగిలి స్పందన . - జి.జయ
Read More
తెలుగు నా మాతృభాష

తెలుగు నా మాతృభాష

తెలుగు నా మాతృభాష దేశభాషలందు తెలుగు లెస్స అని ఆనాడే అన్నారు మాతృభాష మకరందం మరువలేని ఆనందం అమ్మఒడి లోనూ గురువు బడిలోను అంతే గొప్పది మన భాష ఆత్మీయ భాష అంటే తెలుగు అచ్చులతో కుదురుకున్న అలరించే మన భాష తెలుగు అర్థమైన హాస్యమైనా అనుకరిస్తూ సాటిలేనిది మన తెలుగు భాష సంస్కృతి అయినా సాంప్రదాయమైన చెప్పకనే చెబుతోంది అదే మన తెలుగు  భాష పలుకు పలుకున తీయని పరిమళం అదే మన అద్వితీయ తెలుగు భాష మన భావన తెలిపే సహ భావం కలిపే అమ్మ భాష అదే మన తెలుగు భాష సాటిలేని భాషను శ్వాసగా నిలుపుకో తెలుగు భాష గొప్పతనం జగమెల్లా  చాటుకో! - జి. జయ
Read More
ఆకలి

ఆకలి

ఆకలి ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం ఎరుగదు అంటారు పెద్దలు ఆకలి తీర్చేది అన్నం అది పెట్టే వాడు రైతు ఇప్పటి రోజుల్లో అన్నం పెట్టే రైతే ఆకలి అంటున్నాడు ఆకలి భాద తెలిసిన వాడు జీవితంలో పాఠాలు నేర్చుకుంటాడు ఆకలికి మందు లేదు ఇప్పటికీ అది వుంటే జగమంతా శూన్యం ఆఆకలి తీరని ఆ క్షణం రగులుతోంది మనసు బాధతో ఆకలి చావులు లేని దేశమే సుసంపన్నం అప్పుడే ప్రారంభం అవుతుంది నవ శకం మన అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాతకు వందనం పాదాభివందనం. - జి.జయ
Read More