jaya

తోబుట్టువులు

తోబుట్టువులు

తోబుట్టువులు తోబుట్టువులు తొలతగా పంచిన రక్తసంబంధం మన నిర్ణయం లేకుండానే మనకు ప్రసాదించిన వరం ఆప్యాయత అనురాగాలకు నెలవు తోబుట్టువుల నెనరు తోబుట్టువులకు నిలయం అమ్మ గర్భపు ఆలయం స్వచ్ఛమైన ప్రేమకి శ్రేష్టమైన రుణబంధం బాధ్యతాయుత భావాలు వెలకట్టలేని త్యాగాలు ఆత్మీయతకు పెన్నిధి చెప్పలేనంత బలం రక్షణ కవచమై కాపాడుతూ పుట్టినింటి ఒదిగిన పొదరిల్లు సంపద ఎంతో తెలియదు కానీ తోబుట్టువులతో తెలియని ఎంతోబలం అపూర్వ అనుబంధాలై వెల్లివిరియాలి అందరిలో తీపి జ్ఞాపకాల మందిరంగా అదే తోబుట్టువులకు మేలు చేసే గొప్ప కానుక మరి ఈ లోకంలో...... _ జి జయ
Read More
మహిళా ఓటరు శక్తి

మహిళా ఓటరు శక్తి

మహిళా ఓటరు శక్తి   మన దేశపు మార్పుకు గుర్తు మహిళా ఓటర్ల ఓటు హక్కు ప్రభుత్వము పరిపాలన చేస్తే పరిపాలనకు హక్కు ఇచ్చేది ఓటు హక్కు రాజ్యాంగం నీకు ఇచ్చిన ఓటుహక్కు విల్లు అయితే సూటిగాఎక్కుపెట్టి కొట్టాలి అక్ష రాస్యత లేకుంటే అది చేస్తుంది చేటు మొత్తానికి సమానహక్కుకుసాటిరాదుఏది సమానత్వపు సూత్రం ఓటుహక్కులో చూపిస్తుంది ప్రభుత్వం వరాలజల్లులు కురిపించినా ఒరిగేది ఏమీ లేదన్నట్లు ఎన్నికల తంతులా మారింది మహిళా ఓటర్లు దేశచరిత్రను మార్చాలనుకుంటే గెలిచిన నాయకులు దేశం దిశను మారుస్తున్నారు ఓటు హక్కునువజ్రాయుధంలా ఉపయోగిస్తే విధానం మారి ప్రజాస్వామ్యం పట్టు బిగిస్తుంది చైతన్యం చేజిక్కించుకుని ప్రజాస్వామ్యం పరిపూర్ణత చేకూరాలంటే నోటు హక్కుతో కాకుండా ఓటు హక్కుతో ప్రయత్నించాలి అందరూ......   _ జి జయ
Read More
వలస కూలీల వదనం

వలస కూలీల వదనం

వలస కూలీల వదనం   వలసకూలీలవరం పట్టణం బ్రతుకుదెరువే అయితే భారం కాలగమనంలో పరిస్థితులు తారుమారు అయితే ఏ దారిలేక రహదారివెంటే సొంత ఊరు మార్గం వెతుక్కుంటూ గూడు లేక గోడు వినని పిల్లాపాపలతో పెట్టే బేడలతో బ్రతుకు జీవుడా అని భయమే భవిష్యత్తు అయి అడుగులు పడుతున్న వేళ కాలం పగబడితే గమనం మారుతూ పొట్టకూటికై పొర్లుదండాల పయనం ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ బ్రతుకు భారాన్ని మోస్తూ బ్రతుకు భరోసా ఎక్కడా అని విది గీసిన గీతలను దాటుతూ నుదుటి గీతలను వెక్కిరిస్తూ పొలిమేరలకు చేరుతున్నాయి చితికిన బతుకులు.   - జి జయ
Read More
ఈ రేయి ఎవరిదో

ఈ రేయి ఎవరిదో

ఈ రేయి ఎవరిదో నిదురరాని వారి రేయి జాగారం వలె ఈశ్వరునికి అంకితం! నిదురలోకి జారి హాయిగా నిదురించే వారి ఈ రేయి స్వర్గసీమ ! బోసినవ్వుల పాపాయి నిదుర పోకుంటే ఈ రేయి అమ్మకి కలత నిద్రే ! పరువపు ప్రాయంలో వున్న వాళ్లకు కంటిమీద కునుకు ఉండనే ఉండదు ఈరేయి ! వలపు తలపుల ఊహల పల్లకిలో ఊగే వారికి రేయి పగలు నిరీక్షణే! మనసువిప్పి మాటాడే మనుషులకు తీయని స్వప్నం ఈ రేయి! ప్రేమ పరిచయాల ఆస్వాదనకు ఊసులాడే చెలిమికి చెదరని నేస్తం ఈ రేయి! ఊహకందని ఆశలతో సడి చప్పుడు కాకుండా గడచిన రేయిమధురభావనే ఈ రేయి! అలసిన కనులకు సేదతీర్చే ఆగని ఆలాపనల పల్లవులు ఈ రేయి! మత్తులో గమ్మత్తుగా విహరించే విందు చిందుల విన్యాసాల ఆగడంకొందరికి ఈ రేయి ! గడచినకాలంలో జ్ఞానపకాలlనీడలోఇంకా తెలవారదేమి ఈ రేయి ! మనసుకుప్రశాంతతనుఇచ్చే ఈ రేయి…
Read More
పిడుగు

పిడుగు

పిడుగు ఉరుములు మెరుపులు వచ్చి పిడుగులు పడుతున్నాయా అంటే అర్జునా పాల్గునా అనమంటారు పెద్దలు అది మహాభారతంలోని కథ కావచ్చు కాని ఇప్పటి కాలంలో ఏమన్నా ఏ ది ఆగేటట్టు లేదు సుమా మారుతున్న కలికాలంలో ప్రతిరోజూ సామాన్యుడి మీద పిడుగులు పడుతూనే వుంటాయి అనేక రకాలుగా ప్రపంచంలో ఏదో ఒక రకమైన వైపరీత్యాల రూపంలో భాదేస్తూనే వున్నాయి కదా ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి పిడుగు దేశాల మీద బాంబుల పిడుగు నేల మీదకు మెరుపులా వచ్చి చప్పుళ్ళతో అనార్డాల పిడుగు మనిషి బ్రతుకు పోరాటం లో అనుకొలేని ధరల పిడుగు అందుకోలేని అవకాశాలు ప్రాణాలకు పరిహారము లేని సంఘర్షణల పిడుగు వున్నది వున్నట్టుగా కాక వూహకందని వార్తల పిడుగు ఆకాశం నీలిమేఘాల లో వాయు కాలుష్యపు పిడుగు అన్నీ కలిపి బతుకు బండిపై ప్రమాదపు పిడుగులు పడుతూనే వుంటున్నవి దారిలేక దాచుకునే ప్రయత్నించినా అందని ఆకాశాన్ని పట్టుకున్నట్టే .... -…
Read More
అలలు

అలలు

అలలు కడలి కెరటాల తరంగాలు అలలై తీరం చేరాలని ఎగసి పడుతుంటాయి పున్నమి వెన్నెల రాత్రుల్లో ఓలలాడు వొడిగిపోయి సంద్రంలో అమావాస్య అలజడిని గాలి గర్షణలా బెదురు చూపుతుంది సుడిగాలి సుడిగుండాలు కనుచూపుమేర గర్జించి నా ఎదురుచూసిన తీరాలు ఎక్కడ అని చేరుకుంటాయి జాలరికి జీవనాధారమై జలం జలచరాల లో సముద్రం అందిస్తుంటే అలలలో తేలియాడే నావతో నిత్యం సహజీవనం ఆటుపోట్ల అంతుని చూసి భయం లేక వేట సాగును అదే మనిషి ధైర్యం మరి సముద్రపు అలల తాకిడి వచ్చి నీ పాదాలు తాకితే అల శోభించును మనసు ఉప్పొంగును ఒడ్డు చేరిన అల కుదుపు ఆపి మళ్ళీ మొదలు పెడుతుంది మరి ఆలస్యం కాకుండా.......... - జి జయ
Read More
అమృత ధార

అమృత ధార

అమృత ధార అనంత విశ్వంలో అమృత ధార ఆధార భరితం అమ్మ రుదిరాన్నే అమృత ధార గా పంచుతుంది తల్లి అదరపు అమృత ధార సేవించి తేనే ఆరోగ్యానికి ఆయువు పట్టు అలనాటి రాక్షసులు హాలా హలాన్ని ఆరగిస్తే దేవతలు అమృతాన్ని అందుకునిమృత్యున్ జయులుగా వున్నారు అదే సృష్టి రహస్యం సాగర మథనం గరళం అమృతంగా అవిష్కరిస్తే రక్కసులకు గరలంగాను దేవతలకు అమృతం గాను అందుకే అపూర్వ భావనలతో ప్రేమ వాక్కుతో అంతరంగ శుద్ధితో వాత్సల్యాన్ని పంచినదే అమృతధార ప్రతి మనిషి ఓర్పుతో వొడిసి పట్టిన అమృతాన్నిఆధునిక యుగంలో వెదికి వెదికి అనుభవించాలి అందుకే ఆలస్యం అమృతం విషం . - జి జయ  
Read More
మాయ

మాయ

మాయ జగమంతా మాయ జనులెల్లా మాయ జరుగుతూ వున్నది మాయ  జరగబోయేది మాయ అంటారు కళ్ళు మాయ చేస్తే మోసపోతారు మనసు మాయ చేస్తే దారి దొరకడం కష్టం ఆశలు ఎక్కువైతే నమ్మకం మాయ అవుతుంది మాటలు మాయచేస్తే చేదు నిజాలవుతాయి డబ్బు మాయలో పడితే లోభి అవుతారు బుద్ధిని మాయ చేస్తే యుక్తి చేజారుతుంది ప్రేమలో పడితే పేరు పెట్టలేని మాయ భక్తి ఎక్కువైతే భగవంతుడి మాయలో పడతారు మాయాజాలపు కాలాన్ని మాయచేసి  కనుమరుగు కాకుండా నిన్ను నీవు మాయలో పడితే శూన్యం అందుకే ప్రతీ రోజు నేదైన రీతిలో జీవించు  ప్రతిక్షణం  నీ కోసమే వున్నది.  - జి.జయ
Read More
బంకర్ బ్రతుకు 

బంకర్ బ్రతుకు 

బంకర్ బ్రతుకు  బంకర్ అంటే బంగారుగని కాదు  బ్రతుకు జీవుడా అని బ్రతికే చోటు  మానవాళి మనుగడ ఒక  ప్రశ్నగా మిగిలేది  హింస ఆగేనా  బ్రతుకు నిలిచేనా వేచి చూస్తున్న బ్రతుకు పోరాటం  బాంబుల చప్పుళ్ళు  బరితెగించిన విన్యాసాలు  అదృశ్య శక్తుల అరాచకం  కుయుక్తులు పన్నాగాలు  విచక్షణ లేని  కుసంకల్పం  గతితప్పిన మాటలు  గాడి తప్పిన స్వేచ్ఛకు  శక్తి వంతపు హితవులైనా  ఎదురు చూసేసాయమైనా   ఏమిటీ సంక్షోభం ఎందుకీ  మారణ హోమం ఒక్కసారి చూడు బంకర్ బ్రతుకు గుండె చెరువై పోతుంది. - జి.జయ
Read More
తొలిచూపు

తొలిచూపు

తొలిచూపు  మాటలు లేని మంత్రము  భాష లేని భావము తొలిచూపు  కళ్ళలోన కదలాడుతూనే  హృదయ వీణ రాగము తొలి చూపు  ఆలోచనలు ఆగిపోయి  ప్రేమ పదాల ఉత్తరం తొలి చూపు  అందానికి బందమై  వింత  అనుభవాల  గంధమై పరిచయానికి  తెరతీసి పరిధులు దాటి  ప్రణయమై   ప్రేమ పుస్తకంగా పయనం అయితే  తొలి చూపు అవుతుంది  మలి బంధమై  కానిచో  అది అవుతుంది జీవితంలో  ఏప్రిల్ ఫూల్.... - జి.జయ
Read More