jaya

తెలుగు నా మాతృభాష

తెలుగు నా మాతృభాష దేశభాషలందు తెలుగు లెస్స అని ఆనాడే అన్నారు మాతృభాష మకరందం మరువలేని ఆనందం అమ్మఒడి లోనూ గురువు బడిలోను అంతే గొప్పది మన భాష ఆత్మీయ భాష అంటే తెలుగు అచ్చులతో కుదురుకున్న అలరించే మన భాష తెలుగు అర్థమైన హాస్యమైనా అనుకరిస్తూ సాటిలేనిది మన తెలుగు భాష సంస్కృతి అయినా సాంప్రదాయమైన చెప్పకనే చెబుతోంది అదే మన తెలుగు  భాష పలుకు పలుకున తీయని పరిమళం అదే మన అద్వితీయ తెలుగు భాష మన భావన తెలిపే సహ భావం కలిపే అమ్మ భాష అదే మన తెలుగు భాష సాటిలేని భాషను శ్వాసగా నిలుపుకో తెలుగు భాష గొప్పతనం జగమెల్లా  చాటుకో! - జి. జయ
Read More

ప్రేమలేఖ

ప్రేమలేఖ అమ్మకి అంకితం. అమ్మప్రేమ అపురూప మైనది అనురాగపు విరుల గుత్తి. అష్టైశ్వర్యాలు కూడా సరిరాని అమ్మ ప్రేమ జీవిత ప్రయాణములో ప్రసవ వేదన నుండి మొదలై మధుర పాశంలా సాగుతుంది అమ్మ ప్రేమ. అనుభూతికి అక్షరంలా, స్నేహానికి చిరునామలా, శ్రుతి మించిన అభిమానంలా, నమ్మకమే నాణ్యతగా నిలిచిపోతుంది అమ్మ ప్రేమ... నిను కోరిన ఒకేఒక్క జీవి జగతిలో అమ్మ ప్రేమ నిను తాకిననాడే పొరలిన ఆనందం. మంచి మనసుకు మార్కు లాంటిది అమ్మ ప్రేమ చీకటి వెలుగుల సయ్యాటలో చిరు దీపమై వెలిగేది ఒకే ఒక్కటి అదే అమ్మ ప్రేమ ప్రేమే ప్రాణం ప్రాణమే ప్రేమ గా నిర్వచనం అమ్మ ప్రేమ అది పొందగలిగిన రోజులు అమృతమయం లేనిచో హృదయ గోష అమ్మ ప్రేమ కోసం తపించే ప్రతి జీవి అజరామరం - జి.జయ
Read More

జాతర

జాతర వేష భాషలేవైనా  ప్రకృతిమాత వొడిలో సోయగాల ఊయలలో వుప్పొంగిన మనసుతో పశు పక్షాదుల పలకరింపులు  కొండా కోనల్లో సంబరమనిపించే సామాన్యుడి ఉత్సవం సాగిపోయే జనంతో నిండిన సంద్రంలో పరుగులే ప్రభంజనంగా జన సంద్రపు జాతర సాంప్రదాయ  సంఘంలో ఓ గులకరాయి జాతర బ్రతుకే పండుగా అందొక చిన్ననాటి చిరుజ్ఞాపకం. ఆ అనుభూతి అమోఘం ఆ ఆనందం అద్భుతం ఆ ప్రదేశం  మదిలో ఓ జ్ఞాపిక.  - జి.జయ
Read More

విచ్చుకున్న ఊహలు

విచ్చుకున్న ఊహలు ఊహల్లో మనమే మరో లోకాన్ని సృష్టించి వుంటే వ్యయ ప్రయాలతో పనిలేకుండా అమ్మ పెట్టే వెన్న అయినా అద్భుతమైన అందాలైన చెడి పోని స్నేహం అయినా వెన్నెల రాత్రులు అయినా విరితోటలో పువులైన శిల్పి చెక్కిన శిల్పం అయినా విహరించే విహాంగాలైన దేదీప్య కాంతులైన నక్షత్రాల నవ్వులైనా అందని ఆకాశం అయినా వూహించని వుప్పెన అయినా నడిసంద్రపు బాటలు అయినా విధి కి అందని వింతలైన పులకరించే సరిగమలైన పుడమి తల్లి రోదన అయినా నిన్ను వరించే అదృష్టమైన అన్నీ విరబూసిన తీయనైన ఊహా లోకమే. - జి.జయ
Read More

మంచితనము 

మంచితనము  మంచితనము కంటే మించిన సంపద లేదు అంటారు పెద్దలు  అమ్మే ఆస్తి కాదు కొనే వస్తువు కాదు నిష్కల్మషమైన మనసులొ  నుండి వస్తుంది  మంచితనము అర్దం  మారిపోయింది ఈ రోజుల్లో మసకబారిన మంచితనము తడబడుతున్న మానవత్వం పరిహాసాల పందేరంలో అబద్ధపు అంచుల్లో సమాజపు సరిహద్దులో  మంచితనాన్ని పరికిస్తే మానవత్వం కనులు  తెరుస్తుంది మనలో వుండే భావమే మంచితనంగా రూపుమారి  మనకు చూపిస్తుంది తీరు--- తెన్నూ... - జి.జయ
Read More