జీవిత ప్రయాణంలో…
జీవిత ప్రయాణంలో... డబ్బుల వెంట పరుగులు తీసే వారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి తీసి అలిసి పోయి చివరికి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయసు పైబడ్డ శరీరం దూరమైన బంధాలు దూరమైన ప్రేమ అనురాగాలు. జీవితానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు.. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది.. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం అది...!! అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!! అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ..! ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!! అని చెప్తుంది.. అంతే ఆ మనిషి తన…