kireeti putra ramakuri

సమాజంలో నేటి మహిళ

సమాజంలో నేటి మహిళ ఆదిపరాశక్తిగా పూజిస్తారు అమ్మ అంటూ ఆరాధిస్తారు అక్క చెల్లి అంటూ ప్రాణం ఇస్తారు ప్రియురాలు భార్య అంటూ ప్రేమిస్తారు. స్నేహితురాలు అంటూ చేయూతనిస్తారు.. కేవలం ఇవన్నీ మాటల్లోనే... అదే సమాజంలో అనుమానంతో శంకిస్తారు అభల అంటూ అవమానిస్తారు ఆడది అంటే అలుసైపోయింది కుమార్తె అంటే భారమైపోయింది భార్య అంటే బానిస అయిపోయింది ఇట్టి సమాజాన స్త్రీలకు అండ ఎవరు.. స్త్రీల రక్షణకు దిక్కెవరు స్త్రీలను కాపాడు వారెవరు.. సావిత్రిబాయి పూలేలు లేరా తారాబాయి షిండే లు రారా పండిత రమాబాయి లా కారా.. ఝాన్సీ లక్ష్మి లా దూకి దూకరా.. వాళ్లవన్నీ కథలేనా.. ఇక మనకు మిగిలేది వెతలేనా. ఇలా ఉంటే సమాజం మారేనా.. మహిళాలోకం బాధలు తీరేనా... ఎవరో ఏదో చేస్తారు అనేది మానేద్దాం.. ఇతరుల కోసం ఎదురు చూడటం ఆపేద్దాం.. మహిళాభివృద్ధికి అండగా నిలుద్దాం.. ఆదికి మూలం ఆడది ప్రేమానురాగాలకు పెన్నిధి భవ బంధాలకు…
Read More

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు మన ముందున్న ప్రత్యక్ష దైవాలు.. మన తలరాతను మార్చే నిజమైన బ్రహ్మలు.. సమస్త మానవాళి ఏర్పాటుకు వీరే మూలాలు.. ప్రేమానురాగాలకు ప్రత్యక్ష స్వరూపాలు.. స్వచ్ఛమైన త్యాగాలకు ప్రతిరూపాలు.. కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగు నిస్తున్న ఆత్మీయ దీపాలు.. ఏ ప్రతిఫలం ఆశించని ఆదర్శ జీవితాలు.. మరణమని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చే దేవతలు.. భారమని తెలిసినా బాధ్యతకు జీవితాన్ని పణం పెట్టిన దేవుళ్ళు.. కన్న బిడ్డల ప్రేమకై పరితపించు పసి హృదయాలు.. నిత్యం బిడ్డల క్షేమం తలంచు శ్రేయోభిలాషులు.. తల్లిదండ్రుల గొప్పతనం చెప్పడానికి... చూపించడానికి... అక్షరాలు సరిపోవు... మాటలు మిగలవు... రాతలు చెరగవు... భాష చాలదు... అట్టి మహనీయులకు మనం ఏమి ఇవ్వగలం... తిరిగి మనమే వారికి తల్లిదండ్రులమై కాపాడుకోవడమే.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

నిలకడ లేని మనిషి.. మనసు..

నిలకడ లేని మనిషి.. మనసు.. ఆలోచనల తీరు మారు మనసంతా తికమకల హోరు పొంత లేని మాటలతో చూపిస్తారు జోరు వీరికి వీరే పారా హుషారు ఓ పట్టాన వీరు మారరు వీరిని కలిగిన వారి గుండె బేజారు మనసుపై పట్టు కోల్పోయినట్లుంటుంది. ద్వంద్వ భావాలకు పునాది.. మంచి మాటలు విననంటుంది వితండవాదాలకు తెర లేపుతుంది.. వెరసి ఇట్టి వారి జీవితం కకా వికలమవుతుంది.. అన్ని జన్మలలోనూ మానవ జన్మ అదృష్టమైనది మరియు పవిత్రమైనది.. అట్టి మానవ జన్మలో నిలకడ కలిగిన మనిషిగా, మంచి ఆలోచనా భావాలతో తమ జన్మను పరిపూర్ణం చేసుకోవాలని అక్షరలిపి కోరుకుంటుంది... - కిరీటి పుత్ర రామకూరి
Read More

యువత.. కొక్కరకో…

యువత.. కొక్కరకో... యువతా మేలుకో... నీ దేశాన్ని కాపాడుకో.. నీ మార్గాన్ని మార్చుకో నీ తరాన్ని అర్ధంచేసుకో.. నీ స్త్వైర్యాని పెంచుకో.. దేశ వనరులను వాడుకో.. సొంత లాభం కొంత మానుకో.. వాటిని దేశ ప్రగతికి మలచుకో.. దేశభివృద్ధిలో నీ ప్రేమ ను చాటుకో.. ఓ శక్తి గా మారడం నేర్చుకో.. ఏ దేశమేగినా నీ దేశాన్ని గుర్తుంచుకో.. భరతమాత ముద్దుబిడ్డడు గా మసలుకో.. ఈ దేశం నీదేనన్న భావన అలవరచుకో.. దేశ ఔన్నత్యాన్ని పొగడుకో .. నిన్ను నువ్వు గెలిపించుకో.. చరిత్ర లో నీ పేరు లిఖించుకో.. మరణించిననూ బ్రతకడం తెలుసుకో... మంచి మనిషి గా మరణించాలని కోరుకో.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

విజయంపై పట్టు

విజయంపై పట్టు ఆరంభం అదిరింది ప్రత్యర్ధుల కల చెదిరింది పది వసంతాల తీరు మారింది కప్పు పై మాకు ఆశ పెరిగింది హ్యాంగింగ్ గార్డెన్ పేరు మార్మొగింది అంతిమ విజయం మీ ముందుంది. అద్భుతం మీ విజయం కొంతమందికి అది మాయని గాయం చూసిన వారందరికీ కమనీయం బహుశా ఇపుడక్కడ అంతా మీ నామస్మరణీయం. మీ గెలుపు నిజం కడవరకు ఆడటం మీ ఇజం ఆపై గెలుపోటములు సహజం ఇదే మీరు పాటిస్తున్న సహజ సూత్రం.. మరెన్నో విజయాలు మీరు సాధించాలని, వాటికి మేము సాక్షులుగా ఉండాలని మనసా వాచా కర్మేణా కోరుకుంటూ మరోసారి విజయోత్సవ శుభాకాంక్షలు. - కిరీటి పుత్ర రామకూరి
Read More

మగువ – అలక

మగువ - అలక అలక భూనిన అందమైన మహిళ.. అది ఆమె అందానికి అద్దిన కళ.. పెదవి విరుపులతో విరిసిన వేళ.. ముసి ముసి నవ్వులతో మురిసెను.. భళా.. మగని మోములో కంగారు.. ఓ పారి చవిచూచిన పడతుల మదిలో పారెను సిగ్గుల గోదారి.. ప్రియుని బిత్తర చూపులకు.. ప్రియురాలి విజయానందంకు.. అలకే అలంకారం ప్రతి అలకకు లేదు కారణం.. ఇది ప్రేమానురాగాల మధ్య జరిగే రణం.. అందుకై తమ హృదయాలు అర్పణం... అలకలతో ఆడవారికి అన్నీ సాధ్యం.. వారి మనసు లోతు తెలియుట అసాధ్యం.. కనుకనే అలకపై స్వారీ వద్దు.. అలక లో 'సారీ' నే ముద్దు.. స్త్రీ మనసు అలకకు పుట్టినిల్లు. అవి వారి స్వచ్ఛమైన మనసు వాకిళ్లు.. కొండంత ప్రేమ కు అలకలే ఆనవాళ్లు.. ప్రేమకై పరితపించు పసి హృదయపు లోగిళ్లు.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో మధుర స్మృతులు.. ఇంకెన్నో చేదు అనుభవాలు.. వెరసి ఓ సంవత్సరకాలం సమాప్తం.. కొత్త కోరికలు.. సరికొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలు.. నూతన తత్త్వం తో నూతనోత్సాహం.. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అదే కావాలి మన అభిమతం.. కొత్త సంవత్సరానికి ఇదే సాదర స్వాగతం.. తన మన పరివార సమేత సమూహానికి ఇవే మా శుభాకాంక్షలు.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

కల.. ఇక కలేనా???

కల.. ఇక కలేనా??? ఎవరో చెబితేనో వచ్చేది కాదు కల.. ఏదో చూస్తేనో వచ్చేది కాదు కల.. అందమైన కల ప్రతి మనసు కనాల్సిందే.. ప్రతి మనిషిని కదిలించాలి చేసిందే. జీవితం పై కల.. దాని సాధనకై శ్రమ కావాలి.. గమ్యం కై కల.. అది చేరడానికి పట్టుదల కావాలి.. ప్రేమ కై కల .. ‌స్పందించే హృదయాన్ని గెలవాలి.. కలలలో ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలు.. అందుకే అంటున్నా... కల... కలగా మిగలరాదు.. కలను గ్రహించు. దానిని జయించు.. కార్యసాధకునిగా జీవించు.. - కిరీటి పుత్ర రామకూరి  
Read More

కలియుగ దైవం

కలియుగ దైవం కొండల రాయుడి రూపం.. సదా మదిలో మెదిలే విశ్వరూపం అది శతకోటి కాంతుల స్వరూపం గోవిందాది కీర్తనల కారుణ్య రూపం కమనీయం..కడు రమణీయం.. సమ్మొహనమైన చిత్రం వర్ణణాతీతమైన చిత్రం తలచిన వెంటనే తారసపడు చిత్రం అడుగడుగునా నీ చిత్రం ఆద్యంతం నీ చిత్రం.. ఓ జగన్నాధా... నిన్నెరిగి నీలో కలువుటయే మాకు తెలియాల్సిన మంత్రం.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

అక్షర విలాప నగారా

అక్షర విలాప నగారా ఘట్టమనేని వంశాంకురా.. అలనాడు అల్లూరి గా అలరించిన వీరా.. 80 ఏళ్ళైనా తరగని అందాల రాకుమారా.. ఒకే సంవత్సరంలో 19 సినిమాలు చేసిన నటశేఖరా.. సున్నిత మనసు కలిగిన ధీరా.. ఆలకించండి నా అక్షర విలాప నగారా... సినీ జగత్తులో మీరో ధృవతార.. మీదో నవశకం. మీరు ఎదిగిన తీరు అద్భుతం.. మీరు గడించిన జీవితం ఆచరణీయం.. మీరు చూపిన మార్గం అనుసరణీయం.. మీ నటనా కౌశల్యం ఆనందనీయం.. నటన కై మీ సేవ అభినందనీయం.. నటనలో రమణీయుడవు. విలక్షణ పాత్రల ధారుడవు.. అలనాటి యువతుల మది రాకుమారుడవు. ఆజన్మాంత వివాద రహితుడవు. సినీ నిర్మాణ కార్మికుడు. మచ్చలేని మహనీయుడవు.. గౌరవ పద్మభూషణ బిరుదాంకితుడవు.. ఇలా పలు విధముల మమ్ములను మురిపించి, మైమరపించి, అలరించి దూరమైన సూపర్ స్టార్ కృష్ణుడవు - కిరీటి పుత్ర రామకూరి 
Read More