kota aksharalipi

మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు

మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు 1. ఆ.వె.  కడుపు కోతబెట్టు కన్నకొడుకుయైన  ఉర్వి నుండి యేమి ఉద్ధరించు  ఆడపడుచునింత అవమాన పరచిన  బతికి యుండ తగడు భారతమున 2. ఆ.వె.  అమ్మ అక్క చెల్లి అందమౌ బంధాలు  మంటగలిపినట్టి మనిషి కిలను  కాలు చేయి విరిచి కానుక యివ్వాలి  ఆడవారి జోలి కరుగకుండ 3. ఆ.వె.   కంటికందమైన కన్నెపిల్లను జూసి  కల్లబొల్లి మాయ కథలు జెప్పు  మంచిమనసు వున్న మనిషిగా నటియించు  తాళికట్టి పిదప తన్ని తరుము 4. ఆ.వె.  అందమైన పిల్ల ననుభవించాలని  ఇష్టపడిన నంటు ఇంటి కొచ్చు  పెళ్ళి కొప్పుకుంటె ప్రేమగా జూచును  ఒప్పుకోకపోతె ముప్పుదెచ్చు 5. ఆ.వె  బస్సు ఎక్కునపుడు బలవంతపెట్టును  బస్సు కుదుపులోన పట్టుకొనును  పెళ్ళి కొప్పుకొనగ బెదిరించి తీరును  చంపివేతుననుచు జంకుబెట్టు 6. ఆ.వె.  ఆడపిల్ల జోలి కరిగిన వానిని  వదలరాదు యెంత వాడినైన  కనికరించకుండ కఠినశిక్షా గుర్తు  ముద్ర వేయ వలెను ముఖము…
Read More

మనుషులు

మనుషులు 1. ఆ.వె.  మనిషి తిరుగుచు గనె మహిలోన వింతలు  మనిషి మేథతోటి మార్పు జేసె  అవని వింతలు మార్చి ఆనందపడుచుండె  ముప్పు ఎరుగడాయె ముందు ముందు 2. ఆ.వె.  పంచభూతములను పట్టి ఆడించుచూ  మనిషికున్న గొప్ప మహిమ చాటె  జీవరాశియందు చిన్నదేహమువాడు  మేథయందు జగతి మేలుకొలుపు 3. ఆ.వె.  నాటిమనుషులంత సాటిమని‌షితోటి  ఐకమత్యముండి ఆదరించె  నేటిమను‌షులంత సాటివాన్నేదోచి  ఏమి ఎరుగనట్లు ఏడ్చుచుండె 4. ఆ.వె.  ముందు మాటవిన పసందుగా నుండును  వెనుకగోయి తీసి వెన్నుపొడుచు  బంధువులనువారు బద్ధశత్రువులాయె  ఎవరు మంచివారొ ఎరుగలేము - కోట
Read More

ప్రమాదాలు

ప్రమాదాలు 1. ఆ.వె.  వాహనముల తీరు వరుసగా కథనాలు  పేపరంత వార్త పేర్చు చుండ  ఇన్ని ఘోరములను "ఈ టీ వి"చూపినా  మనసు మార్చుకొనడు మానవుండు 2. ఆ.వె.  తండ్రి ఋణము దీర్చు తరుణమాసన్నమై  ఫలితమందు కొనగ పాకులాడు  కన్న కలలు అన్ని కల్లలాయెను గదా  తలకు రక్ష లేక తనువు బాసి 3. ఆ.వె.  పుచ్చకాయ రీతి పుర్రె పగిలి పోవు  ఎద్దు వంటి వాడు ముద్ద యగును  బండి ముక్కలగును బాడి రక్తమగును  కన్న వారలంత కలత జెందు 4. ఆ.వె.  ఏ ప్రయాణమైన హెల్మెటు ధరియించు  కన్న బిడ్డల గను కనుల ముందు  వేగమెప్పుడైన వేదన కలిగించు  ఆలి చెప్పు మాట నాలకించు - కోట
Read More

రైతు జీవితం

రైతు జీవితం 1. తే.గీ.  గూడు లేకున్న కానల కూటి కొరకు  పోడు గొట్టుచు ముళ్ళతో పోరు సలుపు  పాడి పంటలు పెంపొంద పాటు పడుచు  మాడు చుండెడి రైతు సామాన్యు డగునె 2. తే.గీ.  ఇష్టమున్నను లేకున్న యిలను దున్ని  కష్ట పడినను రైతుపై కరుణ లేదు  ముష్టి వాళ్ళను జేయుచు మురిసి పోవు  నాయకుల మాట లెవ్వరూ నమ్మరాదు 3. ఆ.వె.  ఆత్మహత్య పాపమందురే గాని మా  నిత్య జీవితమున నిజము గనరు  నమ్ముకొన్న పంట నానాట ధరలేక  రైతు బతుకు లిట్టి రాతలాయె 4. ఆ.వె.  రైతు జన్మభూమి రాణించె నేతీరు  కొరతలేక నీరు కోరినాము  ఊతమిత్తుమంటు ఊరించి పోయిరి  మాటలన్ని నీటి మూటలాయె 5. ఆ.వె.  ఎన్ని రంగములను ఎందరున్నను గాని  అన్నదాత కన్న అధికులెవరు?  అన్నదాత గుండె ఆరాట పడినచో  కన్నవారి మనసు కరుగకున్నె? - కోట
Read More

చదువు – సంస్కారం

చదువు - సంస్కారం 1. ఆ.వె. చదువు వల్ల కలుగు సంస్కార భాగ్యంబు చదువు వల్ల చట్ట సభలు నడుపు చదువు వల్ల నబ్బు జనహిత మార్గమ్ము చదువు ఎల్లవేళ శాంతి గూర్చు 2. ఆ.వె. విద్య నేర్చుకున్న వినయంబు పెరుగాలి ఒదిగి యుండు టెల్ల కొదువ గాదు గర్వ మెప్పుడైన కష్టాల పాల్జేయు అణకువ సుగుణాల కాటపట్టు 3. ఆ.వె. నేర్చుకున్న చదువు నీలోనె దాయకు నిరుపయోగమగును నీకు కూడ పంచుకున్న కొలది ఫలమధికమ్మగు తోట బావి జలము తోడినట్లు 4. ఆ.వె. శాస్త్రవేత్తవయ్యి శాషించు విశ్వాన్ని మానవతను చాటు మార్పు తెచ్చి అక్షరాస్యులైతె అన్నియూ సాధ్యము దేశమాత మురిసి తేజరిల్లు 5. ఆ.వె. అక్షరాస్యుడవయి అవనిని కాపాడు విజ్ఞతలను పంచు విశ్వమంత పంచ భూతములను పాలించు సమముగా విస్మరించ వలదు విశ్వ శాంతి - కోట
Read More

దురాశ

దురాశ కష్టపడకుండానే కలిమి చేతికందాలని పక్క వాని పనులు చూసి ముక్కున వేలేసుకుంటి అనుమతులు లేని సరుకు లెందరికో అమ్మినాడు గుట్టు రట్టు గాకుండా కోట్లు కూడబెట్టనాడు ఎన్ని పనులు చేసినా ఎవ్వరికీ దొరకడాయె అవే పనులు నేను చేసి ఎదగాలని అనుకున్నా తప్పు పనులు చేసి దొరికి చిప్ప కూడు తింటున్నా కూలినాలి జేసి కొంత డబ్బు కూడబెట్టుకుంటి ఉన్న డబ్బు వడ్డికిచ్చి అసలు రాక ఆరిపోతి కష్టపడకుండానే కలిమి చేతికందాలని కల్తిపాల వ్యాపారం కలిసి వచ్చుననుకుంటి కల్తిపాలు తాగినోడు డబ్బులన్ని ఎగగొట్టె పైసమీద ఆశతోటి ఉన్నది పోగొట్టుకుంటి కల్తీసరుకమ్మగా కానిస్టేబులు పట్టే నకిలీ నోట్ల దంద ఆదాయమనుకుంటి గంజాయి పండిస్తే గుంజీలు తీయించె నాటు సారా పెడితే డ్రమ్ములన్ని పగులగొట్టె కాని పనులు చేశానని కారాగారానబెట్టె ఎండామావుల్లో ఏరున్న దనుకుంటి కుండలోని నీళ్ళన్నీ ఒలుకబోసుకుంటినీ అన్యాయపు పనులు చేస్తెఇలాఆరిపోతానని కష్టపడ్డ సొమ్మే మనకడుపు నింపునని ఆలస్యంగా తెలుసు కుంటి…
Read More

కల్పవల్లి

కల్పవల్లి కనుల విందు జేయు కమనీయ శివగంగ ఉరుకు పరుగులిడుతు ఉర్విదిగెను అవని జనముకంత అన్న పానము లిడ కరుణ జూపె గంగ కల్పవల్లి - కోట
Read More

ఆకలి

ఆకలి ఆటవెలది పద్యము బక్క చిక్కి నట్టి బాలున్ని ఆకలి వెంటబడి తరుమగ వేదనాయె దీనవదనుడయ్యి దిక్కెవ్వరూలేక చేయి చాపి అడిగె చేతగాక - కోట
Read More

ఉప్పెన

ఉప్పెన 1) ఆ.వె.    మనిషి పాపములను మన్నించ లేనట్టి    అగ్గి పర్వతములు భగ్గుమనెను    ఊరువాడ యనక ఉప్పెన మాదిరి    అడవులన్ని కాలి అంతరించె - కోటా
Read More

జంట

జంట 1) ఆ.వె.    సంధ్యవేళ యందు సంద్రమందు పడవ    ఊసుపోక జంట ఊసులాడ    ఆకసమున తారలన్ని మెరిసిపోగ    ముద్దు లాడు జంట మురిసి పోయె - కోటా
Read More