kota aksharalipi

ఉప్పెన

ఉప్పెన

ఉప్పెన 1) ఆ.వె.    మనిషి పాపములను మన్నించ లేనట్టి    అగ్గి పర్వతములు భగ్గుమనెను    ఊరువాడ యనక ఉప్పెన మాదిరి    అడవులన్ని కాలి అంతరించె - కోటా
Read More
జంట

జంట

జంట 1) ఆ.వె.    సంధ్యవేళ యందు సంద్రమందు పడవ    ఊసుపోక జంట ఊసులాడ    ఆకసమున తారలన్ని మెరిసిపోగ    ముద్దు లాడు జంట మురిసి పోయె - కోటా
Read More
సీతాకోకచిలుక

సీతాకోకచిలుక

సీతాకోకచిలుక 1) ఆ.వె.    సీతాకోకచిలుక సింగారమంతయు    తీయతేనియలను తీసుకొనుట    రంగు రంగు పూల సుగంధముల జాడ    వెదకి వెళ్ళి తాగు వేగిరమున - కోటా
Read More
చదువు

చదువు

చదువు ఆ.వె. రాత్రి పూట చదువు, రాతపనులు వద్దు కళ్ళు దెబ్బ తినును కష్టమగును ఆట పాట చదువు ఆరోగ్యమిచ్చును నిద్రమత్తు చదువు నిండు సున్న - కోటా
Read More
వృద్ధుని కష్టాలు

వృద్ధుని కష్టాలు

వృద్ధుని కష్టాలు 1 తే.గీ.   చేవ లేనట్టి కాళ్ళకు చేవ కర్ర (చేతి కర్ర)   నడవ లేనట్టి వృద్ధున్ని నడవజేసె   బాధ్యతెంతైన మోయును భారమనక  పొట్ట కూటికి ప్రతిజీవి పోరు సలుపు 2 ఆ.వె.   కన్నసంతులేని కడుబీద ముసలయ్య   బడలికైన నడిచి బరువు మోసె   పొట్ట కూటి కొరకు పోరాట బాటలో   చీపురులు తనకిపు డూపిరాయె - కోట
Read More
వరద బాధలు

వరద బాధలు

వరద బాధలు 1) వదలకుండ వాన వరదలై పొంగెను    వాహనములు తేలె వరదలోన    బురదచేరి సరుకు పనికి రాకుండాయె    ధైర్యమిచ్చువారు దరికిరారు 2) ఇంటనీరుచేరి ఇక్కట్లు మొదలాయె    ఉప్పు పప్పు తడిసి ఊటలూరె    ధాన్యమున్నయింట తడిసి మొక్కలు వచ్చె    బిక్కచచ్చిరైతు బిచ్చమెత్తె 3) మురికి వాడలన్ని మూసినదాయెను    హైద్రబాదు జనులు ఆగమయిరి    చెరువులయ్యె యింటి సెల్లారులన్నియు    కార్లు బురదవల్ల కదలవాయె 4) చెరువులు దెగిపోయె చేలన్నిమునిగెను    బాటలన్నికరిగి బాధ కలిగె    వాహనములు పోయె వాటితో మనుషులు    మురికి కాల్వలందు మునిగి చచ్చె 5) లంకలాయె కొంపలన్ని నీటమునిగి    అడుగు బయట పెట్ట నలవిగాదు    కూడువండరాదు కుడువ వీలుగాదు    కారుచీకటి కెటు కదలరాదు 6) పల్లె పట్నమంటు పట్టింపు లేకుండ    ఊరువాడలన్ని ఒక్కటాయె    దారులన్నిజలతారు రోడ్లాయెను    ఎత్తు…
Read More
ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే 1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు    విశ్వ మంత నిండి విశదపరచు    గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు    మానవాళి పొందుమహితసుఖము 2) వృత్తి ధర్మ మొకటి.భుక్తిధర్మమొకటి    ఇరుగుపొరుగు వారు యిష్టపడగ    అన్ని ధర్మ ములను అలవోకపాటించు    మనసు నెరిగిమసలు మంచి గురువు 3) ప్రశ్న వేయు నేర్పు పసివార్కినేర్పాలి    ప్రశ్న వల్ల మంచిఫలితముండు    ఎందుకెప్పుడెట్లు ఏమిటీ దేనికీ?    గురువు వల్ల ప్ర శ్నగుట్టుదెలియు 4) పిన్నవారినైనప్రేమతోపిలుచుచూ    శుద్ధమాటచెప్పిబుద్ధిమార్చు    గగనమంతకీర్తి.గర్వమేలేకుండు    నట్టి తల్లి సమము ఆదిగురువు 5) బాధ్యతెరుగకుండ బడి యందు గురువులు    గంట కొట్టు వరకు గడుపువారు    తనకు చెప్పరాక తప్పించుకోజూచు    బాధ గురువు వల్ల బోధకల్ల - కోట
Read More
రైతు

రైతు

రైతు 1) తే.గీ    గూడు లేకున్న కానల కూటి కొరకు    పోడు గొట్టుచు ముళ్ళతో పోరుసలుపు    పాడి పంటలు పెంపొంద పాటుబడుచు    మాడుచుండెడి రైతు సామాన్యుడగునె! 2) తే.గీ    ఇష్టమున్నను లేకున్న ఇలను దున్ని    కష్టపడినను రైతుపై కరుణలేదు    ముష్టి వాళ్ళను జేయుచు మురిసిపోవు    నాయకుల మాట లెవ్వరు నమ్మరాదు 3) ఆ.వె    ఆత్మ హత్య పాపమందురే గానిమా    నిత్యజీవితమున నిజము గనరు    నమ్ముకున్న పంట నానాట ధరలేక    రైతు బతుకు లిట్లు రాతలాయె 4) ఆ.వె    రైతు జన్మభూమి రాణించె నేతీరు?    కొరతలేక నీరు కోరినాము    ఊతమిత్తుమంటు ఊరించిపోయిరి    మాటలన్ని నీటి మూటలాయె 5) ఆ.వె    ఎన్ని రంగములను నెందరున్నను గాని    అన్నదాత కన్న అధికులెవరు?    అన్ని దేశములకు ఆదర్శమూర్తియై    ఆంధ్ర…
Read More
లంచగొండితనం (అవినీతి)

లంచగొండితనం (అవినీతి)

లంచగొండితనం (అవినీతి) 1) లంచమిచ్చుకుంటె లక్షణంబుగ పోస్టు    వచ్చి తీరుతుంది నచ్చినట్లు    ప్రతిభ గలిగి యున్న పనికి రాడు బీద    నెహ్రూ కలలుగన్న నేలయందు 2) బడుగు జీవులెన్ని బలియైన సర్కారు    సొమ్ముకమ్ముడయ్యి కొమ్ముకాయు    లంచమిచ్చుకుంటె మంచియౌ దోషాలు    కేసువీగిపోవు కాసువలన 3) వంద మార్కులొచ్చి వాజమ్మగా నిలిచె    సగము మార్కులొచ్చిచవట గెలిచె    ప్రతిభ ఉన్నవాన్ని పట్టిచంపుచునుండె    లంచమివ్వకుంటె వంచనాయె 4) అర్థమందు ఆశ అన్నివిధాలుగా    నరుని పాతరేసి నష్టపరచు    లంచగొండితనము లాంచనమయ్యేను    కవుల గోసగాదు కంఠశోష 5) ఏ ప్రభుత్వమైన నెంతకాలముండు    అంతమగు నధర్మ మధికమైన    ప్రజలు ఎదురుతిరిగి పట్టుబట్టిననాడు    ఘడియలోన రాజు గద్దెదిగును - కోట
Read More
మారిన (మారుతున్న) విలువలు

మారిన (మారుతున్న) విలువలు

మారిన (మారుతున్న) విలువలు 1) పదవి లేనినాడు పస్తులున్న చరిత    కొద్దికాల పదవి.కోటి ఆస్తి    ఆక్రమించి భూమి హత్యలు.దాడులు    విలువ మారుచుండె విశ్వమందు 2) పదవి దక్కుకొరకు పార్టీల వారిగా    ఉచిత మాటలెన్నొ ఉగ్గడించు    కలరు టీవి.రైసు.కరెంటు ఉచితమే    విలువ మారిపోయె విశదముగను 3) మామగార్లవంటి మంత్రి వర్యులయండ    టెండరేసి.పనులనెండజేసి    కోట్లకొలది ధనము కొల్లగొట్టుటె నీతి    విలువ మారిపోయె విశదముగను 4) పెద్ద నేరగాళ్ళు పేదోళ్ళ నిరికించి    నీతిమంతులమని నిక్కి తిరుగు    చట్టమందు లొసుగు.చుట్టాలు వారికి    విలువ మారిపోయె విశదముగను 5) రాజకీయమందు రాణించ బంధువు    నీతి.నియమములను నీటగలుపు    టోలుగేటడిగితె తోలు తీసిరిగదా     రాజకీయమెంత రాక్షసంబు? 6) ఆస్తిపన్ను కట్టు.ఆదాయమింతని    చిన్న బతుకులందు చిచ్చుపెట్టు    పెద్ద నేరగాళ్ళ పేరైన చెప్పరు    రాజకీయమెంత రాక్షసంబు? -…
Read More