చెరువు -కల్పతరువు మా ఊరి చెరువు -తలతల మెరయు మా బ్రతుకు తెరువు -ఈ కల్పతరువు మా చెరువు. నిండితే... సాగు భూములకు -తాగు జీవులకు జలచరాలకు -జగతి ప్రాణులకు పాడి పంటలకు -పళ్ళతోటలకు మత్స్యకారులకు -మనశ్శాంతికి ఆటపాటలకు -ఆహ్లాదానికి విహారయాత్రకు -విందులందుటకు పొద్దు పొడుపులకు-పొద్దువిడుపులకు ప్రగతి రథాలకు -పరిశ్రమలకు పంచభూతముల-ప్రపంచ శాంతికి కష్ట జీవులకు -కళ్యాణాలకు లోకంవిడిచిన -సమస్తజీవికి మా ఊరి చెరువు -మా కల్పతరువు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా - కోట
కవితల కథ ఆది మానవులకు ఆకలి తీర్చగా అడవి చెట్ల ఫలములంది వచ్చె ఎండ.వాన.చలికి ఎట్లు జీవించిరో అట్టి కైతలు మన అనుభవాలు అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా - కోట
విశ్రాంతి ఎప్పుడంటే... 1) కన్న సంతు కొరకు కష్టించు తల్లికి నిమిషమైన కాలు నిలువదెచట భర్త సహకరించి పనికి తోడుగనుంటె భార్య హాయిగుండు భర్త వలన 2) ఎడ్డెమంటె తెడ్డె మేజంట యుండునో కొట్టుకొనుటకేమి కొదువరాదు సర్దుబాటు లేని సంసార నౌకను ముందుకెట్లు నడుపు మునుగకుండ 3) విభుడు సహకరిస్తె విశ్రాంతి దొరుకును లేనిచో దొరకున లేశమైన లేమ చేసుకున్న లేశ పుణ్యంబుకు అంతులేని సుఖము ననుభవించు - కోట