మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు
మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు 1. ఆ.వె. కడుపు కోతబెట్టు కన్నకొడుకుయైన ఉర్వి నుండి యేమి ఉద్ధరించు ఆడపడుచునింత అవమాన పరచిన బతికి యుండ తగడు భారతమున 2. ఆ.వె. అమ్మ అక్క చెల్లి అందమౌ బంధాలు మంటగలిపినట్టి మనిషి కిలను కాలు చేయి విరిచి కానుక యివ్వాలి ఆడవారి జోలి కరుగకుండ 3. ఆ.వె. కంటికందమైన కన్నెపిల్లను జూసి కల్లబొల్లి మాయ కథలు జెప్పు మంచిమనసు వున్న మనిషిగా నటియించు తాళికట్టి పిదప తన్ని తరుము 4. ఆ.వె. అందమైన పిల్ల ననుభవించాలని ఇష్టపడిన నంటు ఇంటి కొచ్చు పెళ్ళి కొప్పుకుంటె ప్రేమగా జూచును ఒప్పుకోకపోతె ముప్పుదెచ్చు 5. ఆ.వె బస్సు ఎక్కునపుడు బలవంతపెట్టును బస్సు కుదుపులోన పట్టుకొనును పెళ్ళి కొప్పుకొనగ బెదిరించి తీరును చంపివేతుననుచు జంకుబెట్టు 6. ఆ.వె. ఆడపిల్ల జోలి కరిగిన వానిని వదలరాదు యెంత వాడినైన కనికరించకుండ కఠినశిక్షా గుర్తు ముద్ర వేయ వలెను ముఖము…