kukka bathuku

కుక్క బతుకు పార్ట్ 3

కుక్క బతుకు పార్ట్ 3

కుక్క బతుకు పార్ట్ 3 తూ నా బతుకు, ఎన్నాళ్ళు ఇలా బతకాలి నాకు చావు అయినా రాదే, అది వచ్చినా బాగుండు , అందరిలో అయ్యో అనే జాలి అయినా ఉండేది. నాలుగు రోజులు నా గురించి మాట్లాడుకునే వారు. ఆ విధంగా అయినా అందరి నోట్లో నానే దాన్ని. ఎంత సేపూ యీ మురికి గుంటల మధ్య బతుకు ఈడుస్తూ, ఈ కంపులో ఉంటూ ఇక్కడ దొరికే నాలుగు మెతుకులు తింటూ అర్ధాకలి తో బతికే ఈ బతుకు ఒక బతుకెనా, నా ఖర్మ కొద్ది ఇక్కడ పుట్టాను. కనీసం మంచి స్థితిలో ఉన్న వారింట్లో పుట్టినా బాగుండేది. అక్కడ ఎంతో కొంత మంచి తిండి అయినా దొరికేది. ఇలా అర్ధాకలితో ఉండే స్థితి రాక పోయేది. హా అమ్మా, అబ్బా ఆకలి చంపుతుంది. అదిగో మటన్ ముక్క అబ్బా ఇది అయినా దొరికింది. నాకు ఈ మాత్రం…
Read More
కుక్క బతుకు

కుక్క బతుకు

కుక్క బతుకు అబ్బా ఎంత బాగుందో, ఇంత అందమైన దాన్ని చూసి ఎన్ని రోజులు అయ్యింది. ఇలాంటి వాళ్ళు మనకు ఎందుకు తారస పడరో, ఇలాంటి అందగత్తెలు అవారా గాళ్ళకే పడతారు కాబోలు, అబ్బబ్బా ఎన్నెన్ని అందాలు, ఎంతో శ్రద్ధగా పెంచినట్టు, ఎంతో ముద్దుగా పెంచినట్టు ఉన్నాయి. ఇంత శ్రద్ద తీసుకొని పెంచిన అందాలను ఎవడికి ఇస్తారో కానీ ఎంత ముద్దుగా ఉన్నారో, అరే ఇదొక్కటే అనుకుంటే అదేంటి ఎన్నో సీతాకోక చిలుకలు గుంపులుగా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నాయో, ఎక్కడ ఉన్నాయో అహ నా జన్మ ధన్యం అయ్యింది. ఇన్నాళ్లు ఆ మిడిల్ క్లాస్ కాలనీ లో అంతా కప్పుకుని ఉన్న అందాలను ఆ కప్పుకున్న చాటు యెత్తులెంత ఉన్నాయో ఊహిస్తూ బ్రతికేసాను. కానీ ఇప్పుడు ఇలా సగం సగం బట్టల్లో కనిపిస్తున్న ఇన్ని అందాలను చూస్తుంటే తట్టుకోలేక పోతున్నాను. ఇన్ని అందాలు అహ నా రెండు కళ్ళూ ఎంత…
Read More