maathrubasha by kota

మాతృభాష

మాతృభాష

మాతృభాష మాతృభాష గొప్పతనం మనం తెలుసుకోవాలి మరోభాష నేర్చునపుడు మనకెంతో సాయపడు. //మాతృ// 1. పాఠాలను వినుట గొప్ప    కళగా భావించాలి    సంభాషించే టప్పుడు    చాతుర్యం చూపాలి    అర్థగోచరమ్మగుటకు    హావభావముండాలి    విరామ చిహ్నాలను    తప్పక పాటించాలి //మాతృ// 2) స్వరభేదము ననుసరించి    సంభాషణ ఉండాలి    శ్లేషార్థాలను వాడుతు    హాస్యము పుట్టించాలి    సంభాషణలోన పెక్కు    సామెతలను వాడాలి    నుడికారపు సమాసాల    చాటు సొగసులుండాలి //మాతృ// 3) పద్యాలను చదువుతుంటె    హృద్యంగా ఉండాలి    అర్థ భావ రాగాలను    అన్వయించి చదవాలి    హ్రస్వ.దీర్గ.ఒత్తు.సున్న    గీత.పొల్లు పోరాదు    అర్థము లేని చదువులు    వ్యర్థమని తెలియాలి //మాతృ// 4) విన్నపదము శబ్ధములో    గూఢార్థం తెలియాలి    పర్యాయ పదాలన్ని    పట్టుదలతొ నేర్వాలి    ముత్యాలను కూర్చినట్లు…
Read More