madhavi kalla

ఆనందమైన జీవితంలో అపశృతి

ఆనందమైన జీవితంలో అపశృతి నేను నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న రోజులే ఎక్కువ. ఒక శుభవార్త తరువాత మరొకటి విన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ఎలా నా సంతోషాన్ని ముందుగా ఎవరితో పంచుకోవాలో నాకే అర్దం కావడం లేదు. ఆలోచిస్తుండగా మదిలో నా స్నేహితురాలు మెదిలింది. నా ఆనందాన్ని తనతో చెప్పుకొని ప్రయోజనం కలుగుతుంది. నాకు కొన్ని విషయాలలో స్ఫూర్తిగా తీసుకొని నాకు తోడుగా ఉండేది. అందరూ ఒక చోటు కలిసి ఆనందంగా ఉన్న సమయంలో నా జీవితంలో ఒక అపశృతి చోటుచేసుకుంది. అందులో ఉండి నేను బయటకు రావడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా అసలు బయటకు రాలేకపోయాను. ఎప్పుడు నేను నా ఆనందమైన జీవితంలో ఒక అపశృతి జరగడం వల్ల నేను కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అందరిలో కలవడానికి చాలా టైం పట్టింది. నన్ను నేను గతంలో ఉండనికి చాలా ప్రయత్నం చేస్తాను. కాలం…
Read More

నీ చెలిమి

నీ చెలిమి నీ స్నేహం కుదిరి క్షణం నుంచి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పటికి వమ్ము చేయకుండా నీ చెలిమిగా ఉండాలని ప్రతిజన్మ కోరుకుంటాను... నీ పెళ్లి సంబరంలో నేను నీ పక్కనే ఉండి నీ ప్రతి సంతోషాన్ని పంచుకోవాలని నేను ఎన్నో సార్లు అనుకున్నా... నా పరిస్థితిని నువ్వు అర్దం చేసుకొని నేను నీకు ఏం చేశాను అని నువ్వు నాకు అడిగిన ప్రతిసారి చిన్న చిరునవ్వు సమాధానం ఇచ్చేదాన్ని... నాకు నీ చెలిమినే కావాలి అని చెప్పాను.. ⁠- మాధవి కాళ్ల
Read More

అబద్ధపు జీవితం

అబద్ధపు జీవితం నేను గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పాను. రోజులు గడిచే కొద్దీ నా జీవితంలో గతంలో నేను చేసిన తప్పులకు ఇప్పుడు నేను నా పేరు మార్చుకొని ఒక అబద్ధపు జీవితం గడుపుతున్నాను. ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలాంటి జీవితం గడుపుతున్నానని. ఈ అబద్ధపు జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త సమస్యలు, కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నా. నేను గతంలో చేసిన తప్పులను సరిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తప్పులు నా మీద పగతో వేరు వాళ్ళు చేసి నింద నా మీద వేశారు. నేను అందరి దృష్టిలో దోషిగా మిగిలిపోయాను. ఈ అబద్ధపు జీవితంలో నా మీద చేసిన కుట్రలను నేను తెలుసుకున్నాను. వాళ్లకి వాళ్ల దారిలోనే బుద్ది చెప్పాను. ఒక మనిషి ఒక స్థాయికి ఎదగడం ఇష్టంలేక అసూయ, పగ పెంచుకొని తప్పు చేసి నా మీద నింద వేశారు. మన పక్కనే ఉంటూ మనకి వెన్ను పోటు…
Read More

నేను అనే వెలుగు

నేను అనే వెలుగు కళ్ళు మూస్తే చీకటి కనిపిస్తోంది... చీకట్లో ఎక్కువసేపు ఉండటమే చాలా కష్టం... కానీ కొన్ని సందర్భాల్లో చీకట్లోనే బతకాల్సి వస్తుంది.... కానీ ఆ చీకట్లోనే మనం బాధపడకుండా ధైర్యంగా ఆ చీకటితో స్నేహం చేసి వెలుగు అనే నిచ్చెన ఎక్కాలి.. మన గమ్యం ఏంటో మర్చిపోకుండా ప్రతిసారి గుర్తు చేస్తూ బాటలు వేయడానికి సహాయపడుతుంది. చీకట్లో ఒక రోజంతా ఉండడం చాలా కష్టమే కానీ ఆ చీకట్లోనే నేను బతుకుతూ ఉండి నా గమ్యం ఏమిటో తెలుసుకొని కొత్త కొత్త విషయాలు గురించి తెలుసుకొని ఆ చీకట్లోనే వెలుగు అనే నిచ్చెన ఎక్కుతూ నేను ఆ చీకటిలో కోయిల ఉంటున్నాను.. చీకటి లో నేను ఒదిన నా మనసు... నా అనే ప్రపంచంలో నేను అనే వెలుగుతో ఉన్నాను. ⁠- మాధవి కాళ్ల
Read More

జై జవాన్

జై జవాన్ చుట్టూ మూగి ఉన్న సైనికులు మధ్య నా ప్రాణాలకు రక్షణగా నిలిచిన భారత్ జావాన్లు అనుకోకుండా అందమైన ప్రదేశాలను చూడనికి నేను వెళ్ళిన నాకే తెలియని ఒక ప్రమాదంలో చిక్కుకొని ఉండిపోయాను.... నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు కానీ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం వెండి పూల తోటలో ఉన్నట్టు అనిపిస్తుంది. జవాన్లు కారణంగా నేను ప్రాణాలతో బయట పడ్డాను.. వాళ్ళు నాకు ఇచ్చిన పూర్మ జన్మలాంటిది.. ఈ ప్రమాదంలో ఒక జవాన్ మరణించారు.. ఈ సంఘటన నేను ఎప్పటికి మర్చిపోలేనిది.. ⁠- మాధవి కాళ్ల
Read More

స్వేచ్ఛ

స్వేచ్ఛ భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబర్ 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం మన దేశ పాలనకు దిక్సూచిగా రూపొందించబడిన భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడుతోంది. ఆనాడు డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్‌ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, అనేక చర్చలు, మేధోమధనం జరిపి రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే వివిధ పార్టీలు అభిప్రాయాలు చెప్పే సందర్భంలో ఆనాటి కొత్తగా రాజ్యాంగ రచన అవసరం లేదనీ, మనుధర్మాన్నే మన రాజ్యాంగంగా ప్రకటించాలని... చెప్పిన విషయాన్ని…
Read More

సోషల్ మీడియా పరిచయాలు

సోషల్ మీడియా పరిచయాలు ఒకరోజు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లాను. చాలా కాలం తర్వాత కలిసాం అని ఎంతో ఆనందపడ్డాము. తను చూస్తే చాలా బాధగా అనిపించింది. "ఏంటే అలా ఉన్నావు? కొంచెం నీరసంగా కనిపిస్తున్నావ్ ఏమైంది?" అని అడిగాను. "తను మాత్రం ఏం కాలేదే మొన్నటి వరకు ఒంట్లో బాలేదు అందుకని నీరసంగా ఉన్నా అంతే" అని కవర్ చేసింది. "సరే ఇక నేను వెళతాను" అని కోపంతో చెప్పాను. అంతే తను కన్నీళ్లు పెట్టుకుంది. "ఏంటే ఏం అయింది" అని నేను కంగారుగా అడిగాను. "నాకు సోషల్ మీడియాలో ఒకతను పరిచయం అయ్యాడు. మొదట్లో ఫ్రెండ్స్ గా ఉన్న తరువాత మా మధ్య ప్రేమ ఏర్పడింది. ఆరునెలలు గడిచిపోయాయి. కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. ఒక రోజు మా ఇంటి పక్కన అబ్బాయి కలిస్తే మాట్లాడుతున్నాను అది చూసి నన్ను అనుమానించడం ప్రారంభించాడు. అతను నాకు…
Read More

రైతు గొప్పదనం

రైతు గొప్పదనం "నా దగ్గర ఈ డబ్బే ఉంది మిగతాది నా పంట పండిన తర్వాత కడతాను" అని రిక్వెస్ట్ గా అడుగుతాడు బ్యాంక్ మేనేజర్ ని రైతు. "లోన్ తీసుకున్నప్పుడు లేని బాధ బ్యాంక్ కి ఎందుకు తక్కువ సమయంలో కట్టకపోతున్నారు" అని కోపంగా అడుగుతాడు. "ఈ ఏడాది పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే టైంకి డబ్బులు కట్టలేకపోయను" అని చెప్పాడు రైతు. "ఎందుకు ఋణం తీసుకొని పంట పండిస్తున్నారు. ప్రపంచం మారుతుంది. మీరు ఎప్పుడు మారతారు" అని చులకన భావంతో మాట్లాడతాడు. "మీ వల్లే దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని ఇంకా ఎన్నో మాటలు మాట్లాడాడు." అప్పుడే మేనేజర్ పై ఆఫీసర్ వచ్చి "మీరు చేస్తుంది ఏమైనా న్యాయంగా ఉందా?" అని అడిగారు మేడం. కొంచం కంగారుగా తడపడుతూ "అది మేడం పంట పండించడం కోసం మా బ్యాంక్ లో ఋణం తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఒకసారైనా…
Read More

భారతదేశ గొప్పదనం

భారతదేశ గొప్పదనం కులాలు మతాలు వేరైనా,,, మనుషులు మాత్రం ఒకటే... భాషలు, ప్రాంతాలు వేరైనా అందరూ ఒకటే అందరూ ఒకేలా కలిసి మెలగాలి... అందరినీ భారత మాత ఒకేలా చూస్తుంది కన్న తల్లి ఎలా అయితే చూస్తుందో అచ్చం అలాగే... భారతదేశంలో అనేక దేశాలు రకరకాలైన రాజకీయాలు చేస్తున్నారు... ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ మన ప్రాణాలను అడ్డుగా ఉన్న జావాన్లుకు మనం ఎప్పుడూ తోడుగా ఉండాలి... భిన్నత్వంలో ఏకత్వంగల దేశం మనది.. భారతదేశంలో అనేక భౌతిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తారతమ్యాలున్నాయి... భారతదేశంలో ఆనాది నుంచి అనేక మతాలు, జాతులు ఉన్నాయి... భారతదేశం ఎప్పుడు గొప్పదే.. ఇలాంటి దేశంలో మనం పుట్టడం ఎంతో గర్వకారణంగా ఉంటుంది... భారతదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే... భరత మాతకి జై జైలు.. ⁠- మాధవి కాళ్ల
Read More

ప్రకృతి

ప్రకృతి రైలు ప్రయాణంలో ప్రకృతి అందాలను చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది... అందమైన సూర్యోదయం పక్షుల కిలకిల రావాలు కొండలు, కోనలు, అందమైన వనాలు, కోయిలలు కూతలు, పూలతోటలు ఆకాశంలో ఎగిరే పావురాలు సంధ్య సమయంలో ఆకాశంలో కుంకుమ ఆరబోసినట్లుగా ఉంటుంది... రాత్రి పూట మబ్బుల చాటున దాక్కుని చందమామ... గాలికి చెట్టు కొమ్మలు రెపరెపలాతుంది... కోకిలలు కుహూ కుహూ అంటూ కూస్తాయి... ప్రకృతి జీవకోటికి దేవుడిచ్చిన వరం లాంటిది.. ప్రకృతి అందాలను మరింత పెరిగే అవకాశం మాకు ఉంది... ⁠- మాధవి కాళ్ల
Read More