malli s chowdary

అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ

 అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం, అక్షరలిపి ఫౌండర్ శ్రీ శారదా దేవి గారి ఇంటర్వ్యూ మీకోసం అర్చన:- అమ్మ నమస్తే  మీరు పుట్టింది ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అమ్మ:- అమ్మా నమస్తే,  నేను పుట్టింది పెరిగింది ఒక మోస్తరు పట్టణంలో అయినా  మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే పల్లెలో పెరిగాను. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. నేనొక మామూలు మధ్య తరగతి సగటు ఇల్లాలిని. చదువుకున్నది తక్కువే, అయినా ఎంతో,కొంత తెలుసుకున్నాను. అనుభవం అన్ని నేర్పిస్తుంది అమ్మ. ఇప్పుడు నేను ఏమి చేయడం లేదు అంతా నా పిల్లలే చూస్తున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో నేను సలహాలు ఇస్తూ ఉంటాను, పిల్లలు కూడా నన్ను అన్ని అడుగుతూ ఉంటారు. అర్చన:- అసలు ఈ అక్షరలిపి అనేది మీరు ఏలా మొదలు పెట్టారు  ? అమ్మ:- దీని గురించి మీకు…
Read More

ఎవరే నువ్వు

ఎవరే నువ్వు మరు మల్లెల చాటున దాచిన అందమా మధు వనం లో పూసిన పరువమా.. పెదవంచున దాచిన ప్రణయమా.. నా కలం నుండి జాలువారిన కావ్యమా.. ఎవరే నువ్వు.. ఎవరే నువ్వు .. - మల్లి ఎస్ చౌదరి 
Read More

సగం కూలీనే..

సగం కూలీనే.. అరే మల్లిగా పనికి వేళ అయ్యింది రా.. తొందరగా రా పోదాము.. అందరూ పోయినారు మనదే లేట్... బయట రోడ్ మీద నుంచి అరుపు మా చిన్నాన్న (తిరుపతి బాబు) నాకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు.. ఇంతకీ ఎక్కడికి పోతున్నాము చెప్పనే లేదు కదా... సెలవుల కోసం ఇంటికి వచ్చిన నేను అమ్మ కి కాస్త సాయం గా ఉంటుంది.  నా టూషన్ కి డబ్బులు, పరీక్ష ఫీజు లు కట్టాలి అంటే కావాలి గదా.. అందుకే మా ఊరి అడవిలో సర్కారు వాళ్ళు వేసిన జామ ఆయిల్ చెట్లు కొట్టడానికి ఊరిలో అందరూ పోతూ ఉంటే నాకు పోవాలి అని అనిపించింది.. వాళ్ళతో పాటు నేను కూడా కత్తి చేత బట్టి నెత్తికి కండువా చుట్టి ఇంకో చేతిలో చద్ది అన్నం టిఫిన్ లో పెట్టుకొని వాళ్ల అడుగుల్లో అడుగులు వేయడం మొదలు పెట్టాను...  దాదాపు రెండు…
Read More

అమ్మ

అమ్మ పిల్లలకైనా.. పిల్లలను కన్న తల్లిదండ్రుల కైనా గుర్తొచ్చే పదం అమ్మ.. కష్టాలకు కావలి కాస్తూ, కన్నీళ్లకు వారధి వేస్తూ.. దుఃఖాన్ని దండిస్తూ.. బాధలను బంధీని చేస్తూ.. పేగు బంధాన్ని ప్రేమ బంధంతో ముడివేస్తూ.. తప్పటడుగులు సరిచేస్తూ ... జీవితానికి బాటలు వేస్తూ... ఆనందానికి అవధులు లేకుండా అడ్డుకట్ట వేస్తూ.. మకుటం లేని మహారాజుల వెలుగొందాలని... ఆశ పడని.. ఆరాట పడని తల్లి ఉందా... - మల్లి ఎస్ చౌదరి 
Read More

కోపం

కోపం కోపం వచ్చినప్పుడు ముందు...కోపంగా మాట్లాడతా... తర్వాత తీరిగ్గా బాధపడతా.... అలా మట్లాడినందుకు సిగ్గు పడతా... మళ్ళీ ఇలా మాట్లాడకూడదు అని గుర్తు పెడతా.. ఏంటో ఇలా ఉంది లైఫ్ అని అలోచనలో పడతా... కానీ మళ్ళీ కోపం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రావూ... మళ్ళీ కొప్పడతా. - మల్లి ఎస్ చౌదరి
Read More

మధుర క్షణాలు

మధుర క్షణాలు మధుర క్షణాలు మదిలో ఉండగా.. మమతల కోవెల తలుపులు మూసిన... మన్మధుడై ... మన్నించగా.. మదినిండిన తలపులలో.... - మల్లి ఎస్ చౌదరి
Read More

నిరీక్షణ

నిరీక్షణ ఎదురు చూస్తున్న మనసైన వాడికి మమతలు పండిస్తావని.. సిగ్గులొలుకు చెలి చెక్కిళ్ళ పై చిలిపి సంతకమేదో చేస్తావని ఏది నీ జాడ? ఎంత కాలం ఈ నిరీక్షణ.. నేపమేదో చెప్పక నేడే వచ్చేస్తావో.. కౌగిలింతల నడుమ బంధిస్తావో.. ఎంతకాలం ఈ నిరీక్షణ... - మల్లి ఎస్ చౌదరి 
Read More

సందడి

సందడి వేకువజామున కోవెలగంటను నేనై నీ గుండెగూటిలో సందడి చేయాలని ఆశ తొలిపొద్దు వేళ నులివెచ్చని రవికిరణం నేనై నీ చెక్కిలిపై శృతి చేయాలని ఆశ నిండు పున్నమి వేళ పండువెన్నెల నేనై ప్రణయరాగాలు పలికించాలని ఆశ ఆశ తీరేనా అవధులు లేని ఆనందం సొంతమయ్యేనా - మల్లి ఎస్ చౌదరి 
Read More