mallikarjun gunda

ఓ ఆడపిల్ల

ఓ ఆడపిల్ల ఏన్ని డిగ్రీలు చదివినా..... ఎంత గొప్పగా బ్రతికినా.... ఎం పని చేసినా.... ఏన్ని పూజలు చేసినా....... ఎంత సంపాదించినా... చివరికి అమ్మ అనే పిలుపుకు ఇవన్నీ సరితుగవు..... అమ్మ అయితేనే అమ్మాయి జీవితం పరిపూర్ణం ఔతుంది.... అమ్మ కడుపునే మన పుట్టుక మొదలవుతుంది.... అమ్మ దూరం నుండి చూస్తూ ఏదో అనుకుంటాం.... కానీ ఎంత డబ్బున్నాం లేకపోయినా... సమాజంలో ఆడది అమ్మగా మారాకా శారీరికంగా చాలా బాధలు భరించాలి, కొన్ని కన్న వాళ్ళకోసం ఇంకొన్ని కడుపున పుట్టిన వాళ్ళకోసం.... నిజంగా జరిగిన ఓ అమ్మాయి కథ.... - మల్లికార్జున్ గుండా
Read More

మేలుకో ఓ స్త్రీ

మేలుకో ఓ స్త్రీ అలసిన గొంతుక అరిచిన అలుపెరుగని కేకలు అల్లరి పెడుతూ చుట్టూ ఆకతాయి మూకలు.. అగ్నికణికై ఎదురు తిరిగితె తిరిగి యాసిడ్ దాడులు... అబల అన్న పిలుపుకు తెగుతున్న జీవనాడులు.. అనుక్షణం అడుగడుగున అణిచివేత సంకెళ్లు... పట్టుజారిపోతున్న ఎత్తిన స్త్రీ పిడికిళ్లు. పనిచేయని ప్రభుత్వాలూ పనికిరాని పథకాలూ... ఎందరో నిర్భయలే దీనికి ప్రత్యక్ష సాక్షులు చాలిక ఆగాలిక - ఈ బానిసత్వ బ్రతుకులు, కాలం చెయ్యలిక ఈ కీచక పర్వాలు. ఉవ్వెత్తున ఎగిసిపడు పడిలేచిన కెరటంలా...!? దహించివెయ్ కామాంధుల సనంత అగ్ని కీలలా... అడుగువెయ్ మున్ముందుకు అన్ని రంగాలలో ఎగురవెయ్ నీ పతాక అన్ని లోకాలలో నిప్పురవ్వుకు ప్రతిరూపమా.... ఓ మహిళా లోకమా.. లేదు నీకు అపజయం కలగాలి నీకు విజయం- తప్పదు ఏ నీచుడికే ఈ పుడమిపై పరాజయం.. - మల్లికార్జున్ గుండా
Read More

భిన్నంగా ఆలోచించు

భిన్నంగా ఆలోచించు "అహంకారానికి, ఆత్మన్యూనత భావానికి తేడా లేదు!" "అహంకారం" అంటే "నేను ఇతరుల కంటే ఎక్కువ" అని బయటకు చెప్పకపోయినా లోలోపల అనుకుంటూ దానికి తగిన విధంగా తెలియకుండానే జీవించడం, మాట్లాడడం. "ఆత్మన్యూనతా భావం" అంటే "నేను ఇతరుల కంటే తక్కువగా ఉన్నాను, అందరూ నాకంటే గొప్పగా ఉన్నారు" అని, బయటకు చెప్పకపోయినా లోలోపల మదన పడుతూ ఉండడం. అంటే ఇక్కడ అహంకారం కలిగిన వారు ఆత్మన్యూనతా భావం కలిగిన వారు ఇద్దరు, ఇతరులతో పోల్చుకొని ఎక్కువ లేదా తక్కువ అనుకునేవారే. ఎక్కువ అయితే ఆనందపడటం, తక్కువ అయితే బాధపడటం. ఎక్కువ కాలేక తక్కువ అయితే ఆత్మన్యూనతా భావం. అంటే ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఆత్మన్యూనత భావం కలిగిన వాడు నాకు అహం లేదు అనవచ్చు గాక కానీ లోపల ఉన్న ఆత్మ న్యూనత భావం ఏర్పడుతుంది. అహం సంతృప్తి చెందలేదు కాబట్టి ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది.…
Read More

చిన్నారి పెళ్లి కూతురు

చిన్నారి పెళ్లి కూతురు అందంగా ముస్తాబు అయి కూసుంది లిల్లీ పెళ్లి వారి కంటే ముందే వెలిసింది జాజిమల్లి.. అందరూ తోరణాలు అల్లుతుంటే... జడకి పూలు అల్లుతుంది మల్లి. కుదురుగా ఉంటూ కలలను ముందుకు నెడుతూ కూసింది పీటల మీద తన మీద పడేది తాళి అని భావించింది కానీ ఎగతాళి అని మాత్రం కాదు.. బాధ్యతలు తెలియని పసితనం, కష్టాలు అలవాటు కానీ ఉన్నత కుటుంబం మరి.. అయినా కానీ తనకి ఎదో ఆత్మవిశ్వాసం.. భరించింది అన్నింటినీ.. - మల్లికార్జున్ గుండా
Read More

అబద్ధం, నిజం

అబద్ధం, నిజం ఒకరికొకరు బాగా పరిచయం. ఈ బావిలో నీళ్ళు చాలా బాగున్నాయి కలిసి స్నానం చేద్దామా అని అడిగింది అబద్ధం, నిజంతో అలా ఇద్దరూ కలిసి బావిలో దిగారు, స్నానం చేశారు. అకస్మాత్తుగా హడావుడిగా స్నానం ముగించుకొని అబద్ధం బావి నుంచి బయటపడి పరుగు తీసింది నిజం బట్టలేసుకుని ! నిజానికి బాగా కోపం వచ్చేసింది. మెట్లెక్కి బావి బయటకు వచ్చేసింది. నిజానికి తన బట్టలు కనిపించలేదు. అలాగే నిజం వీధుల్లోకి వచ్చింది. నిజాన్ని అలా చూసిన ప్రపంచానికి కోపమొచ్చింది. అసహ్యమేసింది, దాన్ని చూడలేక మొహం తిప్పేసుకుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేని నిజం, నిస్సహాయంగా మళ్ళీ బావిలోకి దిగిపోయి శాశ్వతంగా కనపడకుండా అదృశ్యమైంది. ఇది జరిగినప్పటినుంచి, అబద్ధం, నిజం యొక్క బట్టలేసుకుని, తన్నుతాను సింగారించుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. దాన్ని చూసి సమాజం కూడా మహా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రపంచానికి సత్యాన్ని తెలుసుకోవడంపై ఎలాగు ఆసక్తి లేదు కాబట్టి.. -…
Read More

నీ స్నేహం

నీ స్నేహం మన ఆట పాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహ బంధం. స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు, మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాని చెప్పటం. కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. గాయపడిన మనసుని సరిచేసేందుకు, స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి, కలవలేక పోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ. నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ, నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం నీకున్నాం…
Read More