నిరీక్షణ
నిరీక్షణ బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో 1982లో విడుదలైన ఆల్ టైం క్లాసిక్ మూవీ "నిరీక్షణ" అంటే నాకు చాలా ఇష్టం. భానుచందర్ అర్చన గారు మెయిన్ రూల్స్ లో నటించారు. నటించారు అనడం కంటే జీవించారు అనడం సమంజసమేమో అంత బాగా సహజంగా ఉంది వారి నటన. నిరీక్షణ కథ విభిన్నమైనది. ఫారెస్ట్ ఆఫీసర్ అయినా గిరిజన అమ్మాయి అయినా తులసి అంటే అర్చన ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో పోలీసులు భానుచందర్నీ నక్సలైట్ గా పొరపాటు పడి అరెస్టు చేస్తారు. తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా అతిహేయంగా అవమానిస్తారు భానుచందర్ని. సహనం కోల్పోయిన భానుచందర్ కోపోద్రిక్తుడై తిరగబడడంతో ఆ పెనుగులాటలో అనుకోకుండా ఒక పోలీసు మరణానికి కారణం అవుతాడు. దీంతో పోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తుంది. శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలైన భానుచందర్ బస్సులో ప్రయాణిస్తూ ఆ ప్రయాణికులు అడిగిన…