మనసు
మనసు ఓ మనసా ఎందుకే అంత తొందర పడతావు? నీ మనసు నీ మనసులో లేదా? ఎందుకు గాలిలాగా ఎగిరెగిరి పడుతున్నావు? నీ తొందరపాటే నీకు ముందరకాళ్ళ బంధం గా అవుతుందేమో? ఓ మనసా అడుగు మాటాడు మనసుతో మనసును అడుగు నీ మనసును అడిగి అడుగు ముందుకు వెయ్యి తెలుసుకో మనసా నీ మనసులో నీ మనసును ఏం చెబుతుంది నీ గుండె కొట్టుకుంటుందా లేదా చెబుతున్నాయా ఏమైనా చిన్న చిన్న చిలిపి చిలిపి ఊహలు చిలిపి ఊసులు చెబుతున్నాయా? అడగవే ఓ మనసా నీ మనసుని ఎందుకే బంగారు బాటని ముళ్ళకంచెలా చేసుకుంటావే మనసా? ముందు వెనక ఆలోచించి నీ మనసులోని మాటని చెప్పవే మనసా కవ్వింపులకు లొంగగా మనసులోని మాటని మనసారా అడిగి నీ మనసును మరి అడిగి చెప్పవే మనసా అంత తొందరెందుకే మనసా? అంత తొందరపాటు నీకు తగదే మనసా తొందరపడి అడుగు ముందుకు…