నిర్ణయం
నిర్ణయం ఏ బట్టలు కొనాలా? ఏ రిసార్ట్ కి వెళ్ళాలా? ఏ బ్రాండ్ మందు ఆర్డర్ చేయాలా? ఎలాంటి ఫుడ్డు తినాలా? ఎక్కడైతే బాగుంటుంది? గంజాయి కొట్టాలా? పబ్బుకి వెళ్లాలా లేదా ఇంట్లోనే బిర్యానీలు వండుకొని మందు ముందు పెట్టుకుని తాగుతూ పాటలు పెట్టుకుని డాన్స్ చేయాలా? అని ఆలోచిస్తూ రోడ్లమీద తిరుగుతూ కొత్త సంవత్సరం కోసం రకరకాల బట్టలు, మందు కొంటూ కొత్త సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేయాలని పాత సంవత్సరానికి వీడుకోలు పలకాలనే ఉద్దేశంతో రోడ్లన్నీ కిటకిట లాడుతూ ఉన్నాయి. బట్టల దుకాణాలు బంగారం దుకాణాలు హోటల్లు, రిసార్ట్స్, పబ్బులు అన్నీ ముందే రిజర్వ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు జనాలు. ఎంతమంది జనాలు వస్తే అంత లాభం అనుకుంటూ షాపుల వాళ్ళు రండి రండి అంటూ ఆఫర్స్ మీద ఆఫర్స్ పెడుతూ ఉన్నారు. అసలు ఇప్పటికే తాగే వాళ్ళు తాగుతున్నారు ఊగే వాళ్ళు ఊగుతున్నారు తినేవాళ్లు తింటూ ఉన్నారు…