oka cheekati raatri

ఒక చీకటి రాత్రి పార్ట్ 6

ఒక చీకటి రాత్రి పార్ట్ 6 అనుకున్నట్టుగానే తెల్లారి బాలయ్య అతని భార్య లక్ష్మి బావమరిది వెంకటేశంతో కలిసి అమరేంద్ర తల్లిదండ్రులు కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అయితే అనుకున్నట్టుగా అమరేంద్ర తల్లిదండ్రులు వాళ్లని ఆహ్వానించలేదు. అమరేంద్ర ఇంటికి వెళ్లి తలుపు తట్టారు ముగ్గురు. తలుపు తీసిన అమరేంద్ర తండ్రి చలపతి ఎవరు మీరు అని ప్రశ్నార్ధకంగా అడిగాడు. అయ్యా నా పేరు బాలయ్య ఈ ఊర్లో కిరాణాకొట్టు నడుపుతున్నాను. ఊర్లో అతిపెద్ద కొట్టు మాదే. మీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అంటూ అడిగాడు. కిరాణా కొట్టు వాడికి మాతో ఏం పని ఎందుకు మమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నావు అన్నాడు గంభీరంగా చలపతి. మీతో కొంచం మాట్లాడాలి అందుకే కలవాలని అనుకుంటున్నాను అన్నాడు బాలయ్య. నాతో మీకేం పని అని అడిగాడు చలపతి. అతని మాటలు బాలయ్యకు అంతగా నచ్చలేదు. అయినా కూతురు కోరుకుంది కాబట్టి మాట్లాడక తప్పదు అనుకుంటూ.…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 5

ఒక చీకటి రాత్రి పార్ట్ 5 అమ్మ నాన్న నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అంది అప్పుడే కాలేజి నుంచి వచ్చిన కిరణ్మయి. ఏంటమ్మా ఏంటి విషయం అంటూ అడిగాడు తండ్రి బాలయ్య. ఏంటి ఆ విషయం తొందరగా చెప్పు అంది తల్లి లక్ష్మి. అబ్బా అమ్మ ముందు చెప్పేది వినండి అంటూ నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను చాలా మంచివాడు అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మీరు కాదనరు అనే నమ్మకంతో మీకు చెప్తున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. అయితే అతనికి డబ్బు లేదు కానీ గుణం సంస్కారం మాత్రం ఉంది. చాలా మంచివాడు అభివృద్ధిలోకి వచ్చేవాడు. అతనితో నా జీవితం చాలా బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను అందుకే అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు ఒప్పుకోకపోయినా నేను వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటాను. కాబట్టి…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 4

ఒక చీకటి రాత్రి పార్ట్ 4 చేతన్ బిటెక్ చదివే అబ్బాయి. చదువుకోడానికి స్నేహితుల రూమ్ లోకి వెళ్ళిన అతనికి ఒక ఆత్మ కనిపిస్తుంది. దాంతో అతను చాలా భయపడతాడు కానీ స్నేహితులు మాత్రం ఆత్మ ఏమీ చేయదు చాలా మంచిది అని చెప్తారు. స్నేహితుల ద్వారా ఆత్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకొని అతను ఆత్మ తో మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఇంతలోనే అతని స్నేహితులు ఆ గదిని ఖాళీ చేస్తారు. ఆ విషయం తెలియని చేతన్ ఆ గది దగ్గరికి వస్తాడు వాళ్లు ఖాళీ చేశారు అని తెలుస్తోంది. చేతన్ బాధపడుతున్న సమయంలో అక్కడికి ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. తన కథ మొత్తం అతనికి చెప్తుంది ఆ తర్వాత ఆత్మ కోరిక ప్రకారం గా చేతన్ పుస్తకాలను వేస్తాడు అప్పుడు ఆత్మ చాలా సంతోషిస్తుంది. అయితే చేతన్ ఇంకా తన గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు అప్పుడు ఆత్మ తన…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ ౩

కానీ ఇంతలో దుప్పటి లాగసాగింది ఆకారం. ఇంకా గట్టిగా బిగించాడు. అయినా గట్టిగా లాగుతుంది ఏదో శబ్దం చేస్తోంది. ఇంకా గట్టిగా బిగించాడు. లే.... లే... లే... అంటున్న శబ్దం వినిపించింది చేతనకి. వామ్మో ఇది, ఇది నన్ను లేవమని అంటుంది ఏంటి అని భయపడ్డాడు చేతన్. లే..... లే..... లే.... అన్న శబ్దం ఇంకా గట్టిగా వినిపించ సాగింది. వామ్మో ఇది నన్ను ఏదో చేసేలా ఉంది ఎలా భగవంతుడా... వద్దు నేను లేవను, నేను లేవను. అంటూ ఇంకా దుప్పటి ముసుగు పెట్టాడు చేతన్. ఓరి నీ యబ్బ లేరా అంటే ఏంట్రా ఇంకా పడుకున్నావ్...? ఏంట్రా పరీక్షకు టైం అవుతుంది సిగ్గు లేదు? ఇంకా ఎంతసేపు పడుకుంటావు అంటూ ఇద్దరు స్నేహితులు కలిసి దుప్పటిని లాగేశారు. గబుక్కున కళ్ళు తెరిచి చూసిన చేతన్ కి ఎదురుగా ఇద్దరు స్నేహితులు కనిపించేసరికి సంతోషంగా అనిపించింది. చుట్టూ చూస్తూ, దయ్యం…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 1

ఒక చీకటి రాత్రి పార్ట్ 1 అరేయ్ చిన్న ఎక్కడున్నావురా? ఇదిగో కర్రీ చేశాను, నువ్వు తినాలి అనుకున్నప్పుడు రైస్ పెట్టుకో అంది కిచెన్ లోంచి పద్మ. హా సరే అమ్మా నేను చూసుకుంటాలే మీరు బయలుదేరండి ముందు మళ్ళీ నాన్న తిడతారు అన్నాడు చిన్న అని ముద్దుగా పిలుచుకునే చేతన్. హా అవునవును అమ్మా నేహా అయ్యిందా అంది పద్మ. నేను రెడీ అమ్మా పదా, అంది నేహా బ్యా గ్ బుజాన వేసుకుంటూ. ఈ పరీక్షలు లేకుంటే హాయిగా నువ్వు కూడా వచ్చేవడివు కదా రా అంది పద్మ చేతన్ జుట్టు నిమురుతూ... అవును మమ్మీ పరీక్షలు లేకపోతే నేను కూడా వచ్చేవాడిని హాయిగా ఎంజాయ్ చేసే వాడిని అన్నాడు చేతన్ కాస్త విసుగ్గా.. సరేలే ఈ సారికి ఎలాగో రాసి మళ్లీ ఇంకెవరికైనా పెళ్లి జరిగితే నేనొక్కడినే పంపిస్తాలే అంది పద్మ. హా అయితే మరి నేను నేను…
Read More