palukuri aksharalipi

రాకుమారా

రాకుమారా వెతుకుతున్న నిన్నే వెతుకుతున్నా... ఎదలో వెలితిగా ఉంది నిన్ను చూడాలని పరితపిస్తున్నా.. కలవరపడుతున్నా.. కానరావా నా కన్నులముందు నా రాకుమారా... రావా నన్ను చేరరావా... నా ఎదలోని బాధను తొలగించవా... నాలో రగిలే ఆవేదన గుర్తించవా... నా కనులు నిన్నే వెతుకుతున్నవి... ముంగిట వాలి నా మదిని పరవశింపవా.. - పలుకూరి
Read More

ఉదయిస్తాం

ఉదయిస్తాం కుర్రకారులం ఈ కారు పిల్లలం.. కలలు బంగారు కలలు కనే కుర్రకారులం... భలే హుషారు పిల్లలం... వేట మొదలయ్యింది.. బ్రతుకు వేట మొదలయ్యింది... పట్టాలున్నాయని బ్రతుకు పట్టాలెక్కాలని అభిలాషతో ఉన్నాం.. తలపట్టుకు తిరుగుతున్నాం... తలపెట్టిన పనులు సిద్ధించాలని... కానీ నిరాశ నిస్పృహ ఒకపక్క నీడలా వెంటాడుతున్నాయి... తల్లిదండ్రులు నెల నెల వారి ఖర్చుకు డబ్బులు పంపిస్తున్న... వాళ్ల కలలు నెరవేరేనా... ప్రయత్నమే సాగిస్తున్న ఫలించిందా కష్టం ఇకపైన... నిరాశ చుట్టుముట్టిన అభిలాష ఒక మూల ఉందిలే... అది తీరే రోజు దగ్గరుoదిలే ... మా శక్తి ఆసక్తి మాకు ఉందిలే... లక్ష్యం నెరవేరే రోజు దగ్గర ఉందిలే... అలసట ఎందుకు అలిసిన గుండెకు ప్రయత్నం అనే ఆశను నింపి లక్ష్యం వైపు పయనిద్దాం... కలలే ఫలించి మనమే ఉదయిస్తాం.... - పలుకూరి
Read More

పండు వెన్నెల

పండు వెన్నెల అందరి జీవితాలు నిండు వెన్నెల జాబిల్లి వెలుగుల విరబూయాలి.. జీవితమే ఒక రథచక్రం మనోవాంఛలు తీరాలంటే కృషితో స్వయంకృషితో పని చేయాలి.. పట్టు సలపకుండా పట్టుదల విడవకుండా పోరాడాలి.. ఆటంకాలు ఎదురైనా అడుగడుగున ముళ్ళ బాటలు మన కళ్ళ ముందున్న వెరవక ముందడుగు వేయాలి.. మంచిగా మలచుకోవాలి.. కుటుంబాలను పోషించుకోవాలి.. నిండు వెన్నెల పండు వెన్నెల వెలుగులు తేవాలి.. అందరి బ్రతుకులు పండాలి..   - పలుకూరి
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం అజ్ఞాతంలో వెళ్లేది అవకాశాల కోసమే చిన్న విరామం మాత్రమే... అజ్ఞాతమనే అంధకార చీకట్ల ముసురు బ్రతుకుల నుండి పాఠాలు నేర్చుకోవడం.. అజ్ఞాతం అనేది మౌనానికి ఒక ప్రతీక అది ఒక గంభీరం.. అజ్ఞాత వాసం చేసిన పాండవులు సహితం సంక్లిష్టమైన అది మహాభారత యుద్ధ విజయానికి అది ఒక ఉపకరణం.. అజ్ఞాతంలోకి పోవడమనేది మనశ్శాంతి.. అది మళ్లీ కొత్త శక్తిని క్రోడీకరించి బాహ్య ప్రపంచంలోకి కొత్త వెలుగులు ప్రసరింప చేయడానికి... అజ్ఞాతం అనేది పిరికితనం కాదు.. పిడికిలిబిగించినడానికి.. కొంత సమయం తీసుకోవడమే దాని ముఖ్య ఉద్దేశం.. - పలుకూరి
Read More