poems

ఆటవెలది!!💐🪷

ఆటవెలది!!💐🪷

ఆటవెలది!!💐🪷 బ్రతికి యున్న నాడు పట్టుబట్టలు పెట్టిజీవి విడువగానె చించివేయుపనికిరాని పట్టు బట్టలు నాకేలచెప్పవయ్య కృష్ణ చివరి మాట!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
అనాధ

అనాధ

అనాధ అమ్మ లేని వాల్లంతా అనాధలేఅమ్మ ఉన్న వాల్లంతా అధృష్టవంతులుపసితనంలోనే అమ్మను కోల్పేతేవాల్లకు నరకమే కనపడుతుందిదేవుడు ఈ బంధాలు, అనుబంధాలుఎందుకు పెడతాడో కానీ ఈ సృష్టి లోప్రతి జీవికీ కావలసింది అమ్మనే!అమ్మ ఉంటే ఆకలి తెలియదు అమ్మఉంటే బిడ్డకు ప్రపంచమే గెలిచినఅనుభూతి! అమ్మ తోడుగా ఉంటేలోకాన్నే జయించవచ్చనే ధీమా!గర్వం కూడా!అమ్మ ఒక అధ్బుతం! అమ్మ ఒక అమృతం!అమ్మ ఒక అమెాఘం!కావాలి అందరికీఅమ్మ అనే వరం! ఉన్న వాల్లకు తెలియడంలేదు! లేని వాల్లకు దొరకడం లేదు అమ్మ ప్రేమ!దయచేసి అమ్మ ఉన్నవాల్లు అమ్మలను అనాధలను చేయకండి! ఉన్నప్పుడే వాల్లను సంతోషపెట్టండి! ఉమాదేవి ఎర్రం
Read More
రైలెక్కి చూడవోయ్ మొనగా,,,,!!

రైలెక్కి చూడవోయ్ మొనగా,,,,!!

రైలెక్కి చూడవోయ్ మొనగా,,,,!! కారుచీకట్లు కమ్ముకొస్తున్న వేళచుక్ చుక్ మంటూ రైలుబండి వెళుతున్నదీపంటచేల గుండా మైదానాల గుండాఅడవుల గుండా నదులపై బ్రిడ్జీల పైనుండీకొండల సొరంగాల గుండా సుడిగాలిలాకూతమీద కూతలేసుకుంటూదూసుకెళ్తోంది అదిగదిగో రైలుబండి........ హై క్లాస్ పెద్దమనుషుల నుండిమధ్యతరగతి, నిరుపేదలు, అభాగ్యులుచౌక నుండి అత్యంత రేటు వరకు టిక్కెట్ చార్జీలునిరుపేదలను కదిలిస్తే ఒక్కొక్కరిదీ ఒక్కోగోస.......మధ్యతరగతి జనాన్ని కదిలిస్తే కన్నీటి చరిత్ర........గొప్పగొప్ప పెద్దవాళ్ళ గుండెలుడమడమ కొట్టుకుంటూ పరిగెత్తే పట్టాలపై రైలుబండి.......వేళ్ళమీద లెక్కబెట్టేంత మందే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు,,,,,,,,రైలు నిండా లొడలొడ వాగుళ్ళ ఒంటరిగాళ్ళు రైలుబండి కష్టపడి చమటోడ్చి పట్టాలు వేసిన కార్మికులురైలు ఇంజిన్లు, రైలు డబ్బాలు తయారీ కార్మికుల చమటే,,,,,రైలుబండి పరుగులకువేల మంది కార్మికుల నిరంతర శ్రమఅందుకే రైలుది ఒంటరి బ్రతుకేకష్టాల మోతలో,,,,, సుఖదుఃఖాల ప్రయాణికులుమనిషి కోసం మనిషి తయారు చేసిన మానవతా యంత్రం,,,,!! అపరాజిత్
Read More
బిడ్డ రోదన

బిడ్డ రోదన

బిడ్డ రోదన అమ్మలేని ఇల్లు చీకటి సామ్రాజ్యంఆకలి వేస్తే అన్నం పెట్టే అమృతం లేదుదెబ్బ తగిలితే అమ్మ అని ఏడిస్తేబుజ్జగించే తల్లి రూపం లేదుకన్నీళ్లు తుడ్చే కన్నతల్లి లేక కన్నీటి జలపాతాల్లో తేలుతున్నాడు ఈ పిల్లవాడుజోలపాట పాడి నిద్రపూచే అమ్మ లేకరాత్రంతా ఏడుస్తున్నాడు చిన్నారి బాబుఅమ్మ పడిపోతే ఏమి చేయలేకఏడుస్తూ అమ్మ మీద పడే నువ్వు లేని లోకంలో అమ్మనేను ఉండలేను నేను వస్తాను అని ఏడ్చేఏడుస్తుంటే ఓదార్చే వారు ఎవరు లేరునువ్వు లేని ఈ ఒంటరితనాన్ని భరించలేనునీవు ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ నీ ఒడిలో తల పెట్టి పడుకోవాలని ఉందినాకు అన్నీ నీవే అమ్మఒక్కసారి కళ్ళు తెరువు అమ్మనీ కౌగిలిలో నన్ను దాచుకో అమ్మనువ్వు లేని ఈ లోకం నాకు వద్దని గుండె పగిలి ఏడ్చే... డా. సరికొండ రమాదేవి
Read More
ఉత్పలమాల!!🪷💐

ఉత్పలమాల!!🪷💐

ఉత్పలమాల!!🪷💐 అంబను గొల్వ భక్తులిల నంబలినిం గొనిపోవుచుండగన్అంబరమంటు సంబరము నంతట హోమము చేయగోరి పీతాంబర ధారులై వడిగధార్మిక పూజలు చేయ చుండగన్చెంబుకు జిల్లువడ్డదట చిత్రముగా నొక్కచుక్క గారదే!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
తల్లి కోసం ఆరాటం

తల్లి కోసం ఆరాటం

తల్లి కోసం ఆరాటం ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే నగరం చాలా రద్దీగా ఉంది? లక్ష్మి అనే ఒక పేద మహిళ, తన రెండేళ్ల బాబు కన్నయ్యని తీసుకుని ఆసుపత్రికి వెళ్లి వస్తోంది. పసివాడికి జ్వరం తగ్గడంతో... ఆమె ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది. బస్టాండ్ చేరుకోవడానికి ఇద్దరూ రోడ్డు దాటుతున్నారు. అంతలో ఎక్కడి నుంచో అతివేగంగా, అజాగ్రత్తగా దూసుకువచ్చిన ఒక కారు రెప్పపాటులో వాళ్ళను బలంగా ఢీ కొట్టింది?లక్ష్మి తన బిడ్డకు ఏ అపాయం జరగకుండా తన ప్రాణాలను అడ్డువేసి, వాడిని పక్కకు నెట్టింది?కానీ , ఆ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడి రోడ్డుపై కుప్పకూలిపోయింది. క్షణాల్లో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.అప్పుడే అక్కడ అత్యంత హృదయ విదారకమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వెనుక వాహనాలు ఏమీ పట్టనట్లుగా వెళుతున్నాయి.చలనం లేకుండా రోడ్డుపై పడి ఉన్న తన తల్లి పక్కన ఆ పసివాడు కూర్చుని ఉన్నాడు. వాడికి మరణం అంటే ఏంటో…
Read More
వినపడేవన్నీ ఆక్రందనలు కావు నీకు ప్రబోధాలు,,,,,,,!!

వినపడేవన్నీ ఆక్రందనలు కావు నీకు ప్రబోధాలు,,,,,,,!!

వినపడేవన్నీ ఆక్రందనలు కావు నీకు ప్రబోధాలు,,,,,,,!! ఏ తల్లికని చెత్తకుప్ప పాలుజేసినమనోవైకల్య తండ్రి కామతృష్ణకు పుట్టినగుబాట్లలో జనసందోహం మధ్యదూషించే విషపుకోరలు తెరుచుకున్నదయ్యాలను అంబా,,, అంబా,,,, ఆకలి,,,, ఆకలి అంటూవేడుకునే భువి కౌగిలిలో బంధీవైఎవరో దయామయుడు చూడలేక పెట్టినగిన్నెనిండా అన్నం తినలేక తింటూపేగుళ్ళోకి వెళుతూ గుర్రుమంటూ సొమ్మసిల్లి పోయావా నాన్నా,,,,,!ఎవరో ఎప్పుడో ఇచ్చిన బట్టలు చిరిగి మట్టికొట్టుకుపోయికళ్ళ నుండి ఎన్నడూ కన్నీటి చుక్కలు రాలనినీవెవరో నీపేరేమిటో తెలియని విగతజీవివైఏ ఆశ్రయంలేక గుండెల్లో గుబులు గుబులుగానిప్పుల కుంపటిలోంచి చెలరేగే ఆలోచనల మంటలుమనస్సు పొరల్లో రసాయనాల కలయికలునిన్ను నేరస్తున్ని కమ్మని హెచ్చరిస్తూవంటిపై బట్టలు లేక ఆకలి తీరే మార్గం లేకనీలాంటి అభాగ్యులతో అంగట్లో దోపిడీ చేస్తూ పట్టుబడిఒళ్ళంతా చితకబాదిన జనం నిప్పుల కళ్ళల్లోఅయ్యో బ్రతుకు అగ్నిసముద్రమాయెననిఅప్పుడు వచ్చాయి మొట్టమొదటి కన్నీళ్ళు జలజలమంటూనిన్ను నీవు తెలుసుకున్న నిజందగా కుట్ర మోసకారి జనం జీవితాలునీకంటే ఘోరమని ఓ చిప్ప, చెంబుతోమానవత్వమనే మట్టికొట్టుకుపోయిన బట్టలతోఒక కర్ర చేతబూని నడుస్తున్నన్యాయం ధర్మం…
Read More
అనాథ ఎవరు

అనాథ ఎవరు

అనాథ ఎవరు మనస్సాక్షి నిలదీస్తుందానిగ్గ దీస్తుందిప్రశ్నలు వేస్తుందా ను వ్వే అనాథవంటందీనీ ఊపిరిని నీ ఉచ్ఛాసనుగేటు దాటించిన రోజు కళ్లు మూసుకునిఅహంకారపు పొరలుతెరలు నిన్ను ఆవహించినపుడుఅనిపించలేదు రానువ్వు అనాథవనీ అందరు వున్నా అనాథలాఅమ్మపడివుందీ ముఖపరిచయం లేనివ్వక్తీతో చిటికిన వేలుపట్టీ పరాయింట అడుగుపెట్టీ ఉందిబాథ్యతల బంది కానాలోతలవంచి తనువు పంచీనవ్వులు నీకు పంచిఒక బాథల దుఃఖాన్నితనుమోసింది అనాథ ఎవరు ఎవరు చెప్పుతల్లిని తన్నీ తగలేసిన వీడు ఖచ్చితం గా అనాథఆశ్రమాలు వర్థిల్లుతున్నాయి శుక్లాలు నిండీన మసకకళ్ల కన్నీళ్లతో దిక్కుతోచని నాన్నలతో చెప్పాలి గుండె మీద చెయ్ వేసుకునిఎవరు అనాథగుండె గూటిలోనీ ప్రేమ వాకిటిలో ప్రేమాను రాగాలపుష్పం వేసీ వుంటేఈలోకం లో అనాథఅమ్మలే వుండరుదిక్కు తోచని నాన్నలూవుండరు వజ్రాల ఇందిర
Read More
అమ్మ మనసు

అమ్మ మనసు

అమ్మ మనసు డబ్బు ఉంటే అందరూ వస్తారు....అమ్మ ఉంటేనే అందరూ ఉన్నట్టు... అమ్మలేని ఇల్లు ఎంత పెద్ద భవంతి అయినా అది ఖాళీ గోడలే...ఆ గోడలకు ఫోటోలు ఉంటాయి కానీ ప్రాణం ఉండదు...అమ్మ లేని ఇల్లు దీపం లేని గుడిలాంటిది... పిల్లవాడు ఎంత పెద్దవాడైనా,ఎంత పెద్ద ఉద్యోగం చేసినా....బయట అందరి ముందు సింహంలా ఉన్నా....ఇంటికొచ్చి అమ్మా అని పిలిచేటప్పుడు మాత్రంవాడు మళ్ళీ ఐదేళ్ల పిల్లవాడే....ఆ పిలుపుకు సమాధానం రాని రోజు నుండే వాడు అనాధే.... అనాధ అంటే తల్లిదండ్రులు లేని వాడు అనుకుంటారు....తల్లి ఉండి కూడా ఆమె విలువ తెలుసుకోలేని వాడు అనాధ కంటే దరిద్రుడు... తల్లి లేక జ్ఞాపకాలతోనే బతికేవాడ అసలైన అనాధ...అమ్మను మించిన దైవం,మాటను మించిన వేదం లేదు...ఆమె విలువ తెలుసుకోలేని వాడు అనాధ కంటే దరిద్రుడు... అమ్మ ప్రేమకు రుణం తీర్చలేం,అమ్మ లేని లోటును మాత్రం జీవితాంతం మోయాల్సి వస్తుంది... ఆకలి అంటే ఏంటో తెలియదు ముందే…
Read More
వాన నీళ్ళ కోసం కన్నీళ్ల వర్షం

వాన నీళ్ళ కోసం కన్నీళ్ల వర్షం

వాన నీళ్ళ కోసం కన్నీళ్ల వర్షం ప్రకృతి అందాలను ద్విగుణీకృతం చేస్తూమబ్బుల మాటు నుండికాంతులు చిమ్ముతున్న సూరీడా !ఈ అనంత ప్రశాంత సాగరంశోభాయమానంగా తళుకులీనుతూ.......పొద్దు పొద్దున్నే మబ్బులు కప్పేసిన భాస్కరుడాఇంకా తెలవారదేమి అనుకుంటూపెనునిద్ర నుండి మేల్కొనంటున్న సంద్రం,,,,,! భువి పుత్రులు రైతన్నలుకారుమేఘాలలో నిండుగా వర్షం కోసంఎదురుతెన్నుల గుండెకోత కర్షకులదిఆకలి దప్పికలు మరిచి దుక్కి దున్ని సమంచేసివాన చినుకు లేక వేసిన పంటలుమొలకలు ఎండలకు మాడిపోతూరైతు గుండెలు అరిగోస తీస్తున్నవినైరుతి గాని అల్పపీడనాలు గానీ కరుణించ లేదుతుఫానులు గాలిదుమారాలతో సరిపెట్టుకున్నవిఇది ఎల్నినో ప్రభావంమనమేం చేయలేముచేతులు దులుపుకుంటున్న సర్కార్లు ! అన్నమో రామచంద్ర అంటున్న రైతులుమనస్సంతా కలికలియై రోధిస్తున్న రైతుసూర్య తాపంతోసాగర గర్భం అతలాకుతలం అయ్యిపురిటి నొప్పులు అనుభవించిసాగర పుత్రికలు కన్నీటి నీలి మేఘాలైకురిసే వర్షాల కోసంపగలు రేయి కునుకు లేకఅర్ధకలితో అలమటిస్తూపంటలు బాగా పండాలనిఎరువులు గుప్పి ,రక్తం రంగరించి పోసిశోకిస్తూ ఆకలి చావులులేదంటే పురుగుల మందు తాగిఆత్మహత్య చేసుకుంటున్నరైతులు, రైతుకూలీలు ప్రభుత్వాలు పెనునిద్ర…
Read More