prakruthi aksharalipi

ప్రకృతి

ప్రకృతి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తే సంబరాలు గాయపరిస్తే ప్రమాదాలు భూమికి పెట్టని ఆభరణాలు జీవజాతికి మూలాలు కొలవని దైవాలు మురిపించే అందాలు నడిపించే ఇంధనాలు వింతైన విశ్వంలో అరుదైన చిత్రాలు ఖరీదైన గనులు అమూల్యమైన వనరులు క్రియాశీల చర్యలు క్రమానుగత కక్షలు మొలకెత్తి పెద్దదై నేలకొరిగి గనులై మానవాళి అవసరాలకై అంకితమైనవి... భావితరాలకు అవసరం మనతరానికి ఆసరాగా వెనుకటికి ఆరాధించేదిగా ప్రకృతి. - హనుమంత
Read More

ప్రకృతి

ప్రకృతి రైలు ప్రయాణంలో ప్రకృతి అందాలను చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది... అందమైన సూర్యోదయం పక్షుల కిలకిల రావాలు కొండలు, కోనలు, అందమైన వనాలు, కోయిలలు కూతలు, పూలతోటలు ఆకాశంలో ఎగిరే పావురాలు సంధ్య సమయంలో ఆకాశంలో కుంకుమ ఆరబోసినట్లుగా ఉంటుంది... రాత్రి పూట మబ్బుల చాటున దాక్కుని చందమామ... గాలికి చెట్టు కొమ్మలు రెపరెపలాతుంది... కోకిలలు కుహూ కుహూ అంటూ కూస్తాయి... ప్రకృతి జీవకోటికి దేవుడిచ్చిన వరం లాంటిది.. ప్రకృతి అందాలను మరింత పెరిగే అవకాశం మాకు ఉంది... ⁠- మాధవి కాళ్ల
Read More

ప్రకృతి

ప్రకృతి   ప్రకృతి ముచ్చటపడి చిత్రించిన అద్భుతం పచ్చటి చీరతో పరువాలను దాచుకున్న తరువుల సింగారం చూసిన కనులేమో ఆనందాన్ని నింపుకుంటే...మనసేమో మూగదై ..ఆమె(ప్రకృతి)లో లీనమైంది - బీ ఆర్ నాయక్
Read More