radhika

‘నీ’ దే గుర్తింపు

'నీ' దే గుర్తింపు నీ కట్టుబాట్లు చూస్తే, నీ మాతృభూమి గుర్తుకురావాలి. నీ మాట వినిపిస్తే, నీ మాతృభాష తెలుసుకోవాలి. నీ పలకరింపుతో, నీ తల్లిదండ్రుల సంస్కారం గుర్తించాలి. నీ తెలివి తేటలు చూసి, నీ గురువులను పొగడాలి. నీ అలవాట్లు, లక్షణాలలో  నీ వ్యక్తిత్వం కనిపించాలి. - రాధికా.బడేటి
Read More

తొలి ముద్దు అంటే

తొలి ముద్దు అంటే తొలి ముద్దు అంటే ఒకరు మనకి ప్రేమగా తొలిసారి పెట్టిన ముద్దు మాత్రమే కాదు, ఒకరికి మనం ప్రేమగా పెట్టిన తొలిముద్దు అని మాత్రమే కాదు, రెండు మనసులు ఇష్టపడిన క్షణంలో పెదవులతో పలకరించుకుని, మనసులలో ఆస్వాదించే భావన తొలిముద్దు. ఆ ముద్దు అనుభవం, అనుభూతి చివర శ్వాస వరకు ఊపిరి పోస్తుంది. ఎన్నిసార్లు ఆస్వాదించినా తొలిసారి అనుభవాన్ని ప్రతిసారీ రుచి చూపిస్తుంది. - బి.రాధిక
Read More

మాతృభాష

మాతృభాష మాతృభాష, అమ్మ అనే పిలుపును , అందులో ఆత్మీయతను నింపుకున్న భాష. మాతృభాష ఎవరికోసమో నేర్చుకునేది కాదు. పెరిగి పెద్దయ్యాక నేర్పేది కాదు. మాతృభూమికి  మనం ఇచ్చే భావ సంపద. మాతృమూర్తికి అందించే అమూల్యమైన బహుమతి. భాషలు ఎన్నో వున్నాయి. భాషలు ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ, మాతృభాషను మాత్రం చివరివరకు గుర్తుపెట్టుకోవాలి. అమ్మను వదిలేసినా , మాతృభాషను మర్చిపోయినా మనిషి అనాథ బత్రుకు బతుకుతునట్టు. - రాధికా.బడేటి
Read More

ఆత్మ

ఆత్మ ఆత్మ మనిషికి వున్నప్పుడే జీవం వున్నట్టు. ఆత్మ సాక్షిగా బతికినప్పుడే మనిషి జీవిస్తున్నట్టు. మనిషికే మరణం.  ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛంగా బతకమని సూచిస్తుంది. ఆత్మ బోధ విస్మరించి మనిషి చేసే క్రియలకు  మనిషి ఎన్నో రకాల బాధలు పొందుతాడు.  ఆత్మకు ఈ బాధ తాలూకా ఇబ్బంది వుండదు. ఆత్మ పలికేది  సత్యం. ఆత్మతో సాగే నిత్య జీవనం పొందును ఆనందం, శాశ్వతం. - రాధిక.బడేటి
Read More

బంగారం

బంగారం ప్రేమను చూపించటం తెలిసిన నాకు, నీకోసం ప్రేమను, లేఖలో చూపించాలనివుంది. లేఖంతా ప్రేమనే రాయాలని వుంది. ఎంత రాసినా, ఎన్ని రాసినా, నాప్రేమను అణువంత రాయగలను. నిన్ను చూసిన ప్రతిసారీ " హాయ్" అనే పలకరింపుతో మొదలై, అదే మొత్తం సంభాషణగా మారి, ఆ ఒక్కపదంతో ముగించినా, ఎంతో అనుభూతిని పంచిన, నీ పలకరింపు చేసిన అలజడి గురించి ఎంతని చెప్పను? పెదవులు మౌనంలో, కళ్ళు ఊసులు చెప్తుంటే, నా మనసు విన్న నీ మౌనభాషలోని భావాలు ఎలా చెప్పను? ఎన్నో మాటలు పంచుకోవాలని, నా మనసు చేస్తున్న అల్లరిని ఎలా ఆపగలుగుతున్నానో! నాకే తెలియట్లేదు. అయినా, నిన్ను చూస్తూ, నీ పలకరింపు కోసం ఎదురుచూస్తూ, నీ తలపులతో నా మనసు నింపుతూ నా శ్వాస, ధ్యాస నీవేనని , నువ్వు తెలుసుకోవాలని రాస్తున్నా. నువ్వు ఒప్పుకున్నా,లేకున్నా! ఈ జన్మకు నా ప్రేమను నీకు తప్ప ఎవ్వరికీ పంచలేను. నీ జవాబు కోసం…
Read More

ఆలోచన

ఆలోచన ఒకరికోసం సర్దుకుందామనుకునే కన్నా, అర్థం చేసుకుందామనుకుంటే! ఒకరు సర్దుకోవాలనుకునే కన్నా! అర్థం చేసుకోవాలనుకుంటే! బంధాలు బలపడతాయి. ఆలోచన మారితే, అంతా మారుతుంది. - రాధికా.బడేటి
Read More

పుష్కలంగా పుష్కరం

పుష్కలంగా పుష్కరం అవి 2003 గోదావరి పుష్కరాలు జరుగుతున్న రోజులు. మేము హైదరాబాదు నుంచి రాజమండ్రి పుష్కర స్నానాలు చేయాలని బయల్దేరాము. హైదరాబాదు నుంచి మా కుటుంబం, అన్నయ్య, స్నేహితులు ఇద్దరు మాతోపాటు బయల్దేరారు. మధ్యలో గుంటూరులో మరి కొందరు స్నేహితులు కూడా మాతో పాటు పుష్కర స్నానానికి రావాలనుకున్నారు. వారికోసం హైదరాబాదు నుంచి గుంటూరుకు ఉదయం రైలు ఎక్కాము. గుంటూరు చేరేసరికి మధ్యహ్నం అయ్యింది, తెలిసిన వాళ్ళ ఇంటిలో భోజనాలు చేశాం. సాయంత్రం నాలుగు, అయిదు గంటలకు వచ్చే వాళ్ళు అందరూ గుంటూరు బస్టాండ్ లో కలుద్దామని ముందే అనుకున్నాం. నా డిగ్రీ అక్కడే పూర్తి చెయ్యటం, స్నేహితులు అందరూ గుంటూరు వారే అవ్వడం, నేను వాళ్ళని కలిసి నేరుగా బస్టాండ్ కి వస్తానని నన్ను కలవటానికి వచ్చిన ఇద్దరి స్నేహితురాళ్ళతో వెళ్తానని అమ్మకు చెప్పి బయటపడ్డాం. గుంటూరులో ఉన్న ఇంకో ముగ్గురిని కలిసి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయ్యింది. బస్టాండ్…
Read More

ఊహాలు

ఊహాలు ఊహాలు విచ్చుకున్న వేళ మదిలో మెదిలిన ఒక ఊహ. ఊహా, ఊహేకాని, నిజం అనిపిస్తుంది. ఊహలో చూడటానికి ఏమిలేదు. ఎవరూలేరు. ఊహా చాలా బాగుంది. ఊహని తలిస్తే, మనసంతా ఆనందం. కళ్ళలో కోటిదీపాల కాంతి. ముసిముసి నవ్వులతో ఆధారాలు. విశాలమైన ఊహాలోకంలో, అనంతమైన అమూల్యమైన భావన, కంటికి కనిపించకుండా, శూన్యమంతా పరుచుకుంది. స్వచ్చమైన, స్వేచ్ఛ కలిగిన, ఆ భావనకు ఆకారం, అలంకారం, అశ అవసరం లేదని, ఒక ఊహలో చెప్పలేనంత అనుభూతి కలుగుతుందని అందమైన ఊహా, హృదయానికి చూపిస్తుంది. నా ఊహానందాన్ని మరిన్ని ముచ్చట్లతో పంచుకోవాలని వున్నా, మాటలు కరువయ్యాయి. - రాధికా.బడేటి
Read More

నిరీక్షణ

నిరీక్షణ నా మనసుకు పరిచయమేలేని భావన, "నిరీక్షణ".  నీవు పరిచయమైన క్షణంలో నువ్వు పరిచయం చేసిన భావన. ఆనందం, ఆందోళన కలిసిన ఈ భావన నీకోసమేనని తెలుపుతుంది. కనుల ముందు నిలిచిన క్షణం నిరీక్షణకు తెరపడుతుంది.  వీడ్కోలు చెప్పిన క్షణం నుంచి మొదలవుతుంది. ఎక్కడవున్నా, యదలో తలచుకున్నా, నా నిరీక్షణ సాగుతూనే వుంటుంది. నీ లోనే వున్నాను, వుంటున్నాను అనుకున్న క్షణంలో నిరీక్షణ ఫలిస్తుంది. లేననుకున్న క్షణం నా జీవనానికి నిరీక్షణ ముగుస్తుంది. - బి రాధిక
Read More

బంధం

బంధం మనిషి ,మనిషికి మధ్య వుండేది కాదు. మనసు మనసుతో కలుపునేది. మనసు, మనసును కలిపేది, సహజమైన మనసుకు, సహజంగా ముడిపడేది. నా అనే ఆలోచన నుంచి, మన అనే భావన కలిగించేది. "బంధం" - బి రాధిక
Read More