raheem pasha

తల్లడిల్లుతున్న దేశం

తల్లడిల్లుతున్న దేశం

తల్లడిల్లుతున్న దేశం ఆనాడు భరిస్తే బానిసత్వం ఎదిరిస్తే స్వాతంత్ర్యమని బానిస సంకెళ్లు తెంచి స్వేచ్ఛను తెచ్చి నల్లోని చేతిలో పెడితే.... నా దేశానికి గంతలు కట్టి అంగట్లో సరుకులా అమ్మేస్తూ..... సర్వం దోచు కుంటున్నారు అభివృద్ధి పేరిట ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ...... బడాబాబుల జేబులు నింపుతూ...... ఆకాశానికెత్తుతున్నారు ఒక వైపు డ్రగ్స్, మాదక ద్రవ్యాల మాఫియా.... మరోవైపు రియలెస్టేట్ మాఫియా....... డబ్బును ఎరజూపి, బెదిరించి రైతుల భూములు లాక్కుని పంటభూములనేవి లేకుండా చేసి..... వ్యవసాయం అంటే ఏంటి అనేట్లు చేస్తున్నారు ధరలు పెంచుతూ కార్పోరేట్ సంస్థలకు కాపుగాస్తూ...... ఆదానీ అంబానీలకు గులాం గిరీ చేస్తున్నారు డొక్కలెండి ఆకలి కేకలు వేసే పేదవాని రోదనలు..... అరణ్య రోదనలుగా మిగులు తున్నాయి యువత మాదక ద్రవ్యాలకు బానిసలై.... సంపాదించినది తగలేస్తూ..... ప్రేమించ లేదని అఘాయిత్యాలు చేస్తూ... బొక్కెడు కూడు పెట్టలేక కన్న వారిని వీధి పాలు చేస్తూ...... హత్యలూ, దోపిడీలు చేస్తూ.... జీవితాలను నాశనం…
Read More
స్వాతంత్ర్యమా నీవెక్కడ

స్వాతంత్ర్యమా నీవెక్కడ

స్వాతంత్ర్యమా నీవెక్కడ నాడు ఆంగ్లేయులతో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోరి ఎన్నో ఏళ్లు పోరాడి ప్రాణాలర్పించి బానిస సంకెళ్ళు తెంపుకుని స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాం కానీ.... ఏది... ఎక్కడుంది గాంధీ కలగన్న రాజ్యమేది..... కన్న కలలు, ఊహలు, ఆశలు... గాలికెగిరిపోయాయి ఆడదానికి అర్థ రాత్రి కాదు..... పగలే రక్షణ లేదు ఎక్కడ చూసినా. ఎటు చూసినా. కుల చిచ్చులు, మతపు మంటలతో శాంతి కపోతానికి గాయాలు....... ఒకవైపు రెక్కాడితేగాని డొక్కాడక ఆకలితో అలమటించే పేద వాని ఆకలి కడుపులు...... మరో వైపు నీచ రాజకీయాలు.... హత్యలు, మానభంగాలు, దోపిడీలు, కుంభకోణాలు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు నిరుద్యోగుల, రైతుల ఆత్మ హత్యలు..... ఎక్కడుందీ స్వాతంత్ర్యం నడిరోడ్డులో బేరమాడి ఓటును అమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే అవినీతి అందలాలెక్కి రాజ్యమేలుతుంటే అన్యాయాలను ప్రశ్నించక మౌనం పాటిస్తుంటే ఎక్కడుందీ స్వాతంత్ర్యం నేటి స్థితిలో స్వాతంత్ర్యం కనుమరుగై స్వేచ్ఛ మాయమై మళ్లీ స్వాతంత్ర్యమా నీవెక్కడ అని వెతక వలసి వస్తుంది…
Read More
నెత్తుటి సింధూరం

నెత్తుటి సింధూరం

నెత్తుటి సింధూరం ఆకాశం ఎరుపెక్కినా.... మేఘాలు కరుకెక్కినా.... ప్రకృతి కన్నెర్ర చేసినా... మూడవ ప్రపంచ యుద్ధమే వచ్చినా... కొండలు కూలినా.... బండలు పిండయినా.... భూమి కంపించినా..... తుఫాను చెలరేగినా.... రక్తం ఏరులై పారినా.... గుండెల్లో గుండ్లు దిగబడినా..... తనువులు బూట్ల కింద నలిగినా..... వెన్నుపై లాఠీలు విరిగినా...... కటకటాల పాలు చేసినా... కఠిన శిక్షలకు గురి చేసినా..... నరకాన్ని చూపించినా.... వేటాడి వేటాడి చంపినా.... ఉరికంబాలెక్కించినా.... ఎత్తిన పిడికిలి దించక నినాదాలు మరువక గుండెల్లో దేశ భక్తిని నింపుకుని భరత మాత రూపం కళ్ళల్లో నిలుపుకొని ఆశయాలు వదలక పోరుబాట విడువక ఎన్నో తెగింపులు ఎన్నెన్నో విప్లవాలు మరెన్నో త్యాగాలు చేసి..... తెల్లవాడు వేసిన సంకెళ్లు విడిపించుకుని సంపాదించాం స్వేచ్ఛను నవభారతాన్ని నిర్మించుకుని ఉషోదయాన్ని చవిచూసి సరికొత్త కాంతికి స్వాగతం పలికి భరత మాత నుదుటన వీరుల రక్త సింధూరం దిద్ది డెబ్బై అయిదు సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుమటున్నాం - రహీం…
Read More
అంతం

అంతం

అంతం తెలంగాణ పోరు గడ్డ సాక్షిగా తెలంగాణ ముక్తి కోసం అసువులు బాసిన అమరుల గవాయిగా .... అణచబడిన రక్తం వేడెక్కి..... ప్రజావేశం కట్టలు తెంచుకుని.. దొరతనంపై తిరగ బడి.. బాంచెన్ దొర నుంచి దొర ఏందిరో వాని పీకుడేందిరో అని గళమెత్తిన రోజు ప్రజల్లో చైతన్యం కలిగి.. ఒకే మాటపై నిలబడి.. నిజాంను ఎదిరించి... రజాకార్ల అకృత్యాల నుండి..... నిజాం కబంధ హస్తాల నుండి స్వేచ్ఛ పొంది సంద్రపు అలలు ఎగసి పడిన రోజు నిజాం వ్యూహాలు పన్నాగాలను చెల్లా చెదురు చేసి.... నిజాం నిరంకుశత్వానికి రాక్షసత్వానికి ..... మంగళం పాడిన రోజు అణుగు బాటు తిరుగుబాటై సాధించిన విజయం ఆకసాన ఉషా కిరణమై ఎగిరింది తరతరాల దురాగతాలను తరిమి కొట్టగ చేసిన సాయుధ పోరాటంలో ఎందరో వీరుల త్యాగఫలం ఈ దినం మట్టి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అసువులు బాసిన అమరులకు జోహార్లు (నేడు తెలంగాణా…
Read More
ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయుడు

ఉపాధ్యాయుడు నిశీధి కప్పేసిన జ్ఞానాన్ని అక్షర కాగడా వెలిగించి... వెలికి తీసిన పురావస్తు పరిశోధకుడు నాలో ముడి రాయిలా వున్న శక్తి సామర్థ్యాలను సాన పట్టి...... వజ్రంలా వెలికి తీసిన విశ్వకర్మ ఓం కారంతో మొదలు పెట్టి...... ఇంగితాన్ని, లోక జ్ఞానాన్ని, నీతి నిజాయితీ లతో పూర్తి చేసిన..... స్ఫూర్తి ప్రదాత బలపమనే ఆయుధాన్ని చ్చి.... పలకపై సమరం చేయిస్తూ...... విద్యను బోధించిన అక్షర యోధుడు బండ రాయి లాంటి వాడిని....... చక్కని శిల్పంగా మార్చిన శిల్పి కర్పూరంలా కరిగిపోతూ..... జ్ఞాన వెలుగులను ప్రసరింప జేసిన దివ్వె బ్రతుకు పోరులో అహరహం నా కోసం పరితపించిన...... ఉపాధ్యాయుడు (ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో) - రహీం పాషా
Read More
వందనం

వందనం

వందనం మాతృ భూమి విముక్తి కొరకు.... స్వేచ్ఛా వాయువుల కొరకు..... ఎందరో మహానుభావులు మరెందరో సమరయోధులు కుల మతాలకతీతంగా... ఆకలి దప్పులు మరచి... నిద్రాహారాలు మాని.... దేశ భక్తిని నింపుకుని అలుపెరుగని పోరాట ఫలితం... నా స్వాతంత్ర్యం ఎన్నో విషాదాలు... ఎన్నో కన్నీళ్ళు... సంకెళ్లు వేసి.... చెరసాలల్లో బంధించి... లాఠీ దెబ్బలతో.... బూట్ల పదఘట్టనలతో.. మేను రక్త సిక్తమైనా.. ఎత్తిన పిడికిలి దించని ధీరుల ఫలితం నా స్వాతంత్ర్యం ధన మాన ప్రాణాలకు వెరవక..... స్వాతంత్ర్యం నా జన్మ హక్కంటూ.... సింహాల్లా గర్జిస్తూ... నేలకొరిగిన అమరుల త్యాగం... నా స్వాతంత్ర్యం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలకులను గజ గజ వణికించిన ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం నా స్వాతంత్ర్యం నేడు నా దేశ ఔన్నత్యం నా దేశ ధీరత్వం నా దేశ శాంతి తత్వం ప్రపంచమంతా కనిపించేలా... వినిపించేలా.... విను వీధుల్లో త్రివర్ణ పతాకం రెప రెప లాడింపజేసి... చరితలో…
Read More