రైతు గొప్పతనం
రైతు గొప్పతనం తనకంటూ ఏమి మిగల్చకుండా ఉన్నదంతా భూమి తల్లిని నమ్ముకుని భూ తల్లే తనని కాపాడుతుందని నమ్ముకుని పంట వేస్తాడు రైతు, ఎండనక, వానానక ఆ భూమి లో ఉన్న పంటను కంటికి రెప్పలా కాపడుకుంటాడు. ఎన్నో మందులు వేస్తూ, కలుపు తీస్తూ, కన్నబిడ్డలా చూసుకుంటాడు అదే సమయంలో వాన దేవుడికి కోపం వచ్చి పొట్టకొన్నచ్చిన పంటను పాడు చేసినా ఆదరక, బెదరక ఉన్నదాన్ని కాపాడుతూ తాను ధైర్యంగా ఉంటూ నలుగురికి ధైర్యం చెప్తూ, ఆ కాస్త పంటను మిల్లుకు తీసుకుని వెళ్తాడు. అక్కడ తన వంతు వచ్చేవరకు చలిలో మగ్గుతూ, ఓ పూట తిని, ఓ పూట తినక , ఒప్పిగ్గా ఎదురుచూస్తారు. తనవంతు రాగానే పంటను మిల్లులో సగం రేటు కైనా అమ్మేసి తిరుగు ప్రయాణం అవుతాడు. ఆ మిగిలిన డబ్బుతో పస్తులు ఉన్నా చేసిన అప్పు తీర్చేసి, మళ్లీ ఆశగా భూ మాతను నమ్ముకుని మళ్లీ…