సద్గతి దేవుని కోర్కె: మానవసేయే మాధవసేవ. మానవులకు సేవ చేస్తే నాకు చేసినట్లే. కాబట్టి తోటి మానవులపై దయతో ఉండండి. సేవ చేసి సద్గతి పొందండి. మానవుని కోర్కె: ఎవరి దయతోనూ సేవ చేయించుకొనే కర్మ పట్టకుండా సద్గతి పొందే వరం ఇయ్యండి స్వామి. - రమణ బొమ్మకంటి
యాక్సిడెంట్ జడ్జి : బస్సు యాక్సిడెంట్ అవటానికి నీ నిర్లక్ష్యమే కారణం. డ్రైవర్ : కాదు బస్సు స్కిడ్ అయింది. ఎవరో అరటి పండు తిని తొక్క రోడ్డు మీద వేశారు. వాళ్లే కారణం. - రమణ బొమ్మకంటి
మన వన భోజనం కార్తీకమాసం మనందరి కోసం ఇందిర పార్కు కలిపె మనందరినొక చోట వనమందు భోజనం మన విందు ఎంచక్క కను విందు చేయ పచ్చదనమందు మనమందు వికాసం ముఖమందు వికసించె చిందులు వేసె అందరు ఆనందము తోడ స్టెప్పులన్న అందరికి ఎంతొ మక్కువ వేసె పెద్దలు కూడ ఎంతొ ఎక్కువ ఏమాటకామాట చెప్పుకోవాలంట ఇంట చేసిన వంట వంట పట్టునంట బాగ నవ్వులు పువ్వులు పూసె ఆ పచ్చదనము లోన జంటల నృత్యము చూడ అబ్బురబోయి చూచు చుండె నెమళ్ళు పొరపొచ్చాలు లేని ఇలా వనభోజనాలుంటే అవద ప్రతి మాసం ఒక కార్తీక మాసం - రమణ బొమ్మకంటి
Platinum jublee Platinum jublee Congratulations to all. We know our India got Independence on 15tAug.1947. We are now celebrating platinum jublee Independance day on completion of 75 years. The tricolor flag now unfurled, designed by late. Sri.Pingali venkayya signifies, Saffron for courage & sacrifice. White for purity & truth. Green for faith & fertility and Asok chakra for cotinual progress of country. We hope that our India will prosper like anything in all fields of development and stands as no. 1 among developed countries & let us become a part of it. వందే మాతరం. ఏ అంతరాలు లేకుండా కలిసి మెలిసి…
లలాట లిఖితం సృష్టిచేసి, బ్రహ్మ, జీవరాసి, వ్రాయునట, నుదుట ఈ జన్మలో ఎట్లుండ వలెనో, ముందు జన్మ లెక్కలుచిత్ర గుప్తుని వద్ద సేకరించి. విధాత రాసిన వ్రాత మార్చ ఎవరి తరమూ కాదట. వాటి మంచిచెడుల చూడ సిద్ధముగ నుండు నట విష్ణువు. ఈ జన్మలో చేసిన పాపపుణ్యముల పట్టిక చేయు చిత్ర గుప్తుడు. రెండు జన్మల లెక్కలు విడి విడిగ,నాలుగు పట్టిక లుగా చేసి సమర్పించు నట యమునికి. 1) పాపములు ఎక్కువ ,పుణ్యములు తక్కువ చేసిన జీవులు. 2) పుణ్యములు ఎక్కువ,పాపములు తక్కువ చేసినజీవులు. 3) పాపములు మాత్రమే చేసిన జీవులు 4) పుణ్యములు మాత్రమే చేసిన జీవులు యముడు రెండవ శ్రేణి వాటిని స్వయముగ తీసుకోని పోవ మొదటి మూడవ శ్రేణులవాటిని తన బటులచే తెప్పించునట. (కొంత విన్నది కొంత ఊహించినది) నాలుగవ శ్రేణి వాటిని లయకారుడు సతీ సమేతంగా తరలి వచ్చునట, ప్రశాంతంగా తనలోకమునకు తీసుకోనిపోవ(సేకరణ…
మృత్యు ఒడి తన ఒడిలో రాబోయే బిడ్డ ప్రాణం కోసం మృత్యువు ఒడిలోకి పోవటానికి సిద్ధమౌతుంది ఆమె. తన ప్రాణం కన్నా తనకు పుట్టబోయే బిడ్డ ప్రాణమే ముఖ్యమని మృత్యుదేవతని ఆహ్వానిస్తుంది. ఒక ప్రక్క తన ఒడి మరొక ప్రక్క మృతువు ఒడి ఈ రెండిటిని సమాతూకం వెయ్యడంలో సతమతమౌతూ, ఆ సమయంలో అత్యంత ఆవేదనకు గురౌతుంది ఆమె. తన బిడ్డచే తను అమ్మా అని పిలిపించు కోవటం కోసం తాను తన అమ్మని అమ్మా!అమ్మా! అని ఆవేదనతో పిలుస్తుంది. - రమణ బొమ్మకంటి