saicharithamu by c s rambabu

సాయిచరితము

సాయిచరితము పల్లవి నిను చూడాలని నిను చేరాలని తపియించేము సాయీదేవా కరుణించవయా సాయీదేవా చరణం దైవ స్వరూపమై భువి చేరితివని నమ్మితిమయ్యా రక్షించవయా కాల పరీక్షకు నిలువము మేము మన్నించవయా సాయిదేవా మా దోషములను పరిహరించినచో పురివిప్పునుగా మాతనువంతా చరణం శత్రువు మిత్రుడు అందరు ఒకటే అని భావించి ఆదరించెదవు నిన్నే తలచి నిను ధ్యానించిన చిత్తముకెంతో శాంతి కదయ్యా చివరకు మిగిలేదేమీలేదని తెలిసిన మాకు నీ కరుణొకటే చాలు కదయ్యా భవసాగరముల బాధే పెరిగెను అయినా మేము బాధేపడక నీ లీలలు మే చదివితిమయ్యా చరణం నీ కృపతోటే ఎందరెందరో ధన్యులుకాగా అది తెలుసుకుని నిను ప్రార్థించి వేడిన మాకు అభయమునొసగి దారే చూపిన భక్త వరదుడవు నీవేకాదా నీ నీడందున ఉండిన చాలు వేరేదేమి కోరము మేము కాపాడేందుకు గురువుండునని నమ్మితిమయ్యా సాయీదేవా ఈ సత్యమునే మరువక మేము సాగెదమయ్యా.. సాయీదేవా - సి.యస్.రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి అలసిన మనసుకు ఆశవు నీవే సాయి వెలిసిన బతుకుకు శ్వాసవు నీవే సాయి చరణం నీడవు నీవని నమ్మితిమయ్యా తోడువు నీవని తలచితిమయ్యా పదమే కడుతూ ప్రార్థన చేసి వేడితిమయ్యా సాయి..వెతలే తీర్చవ సాయి చరణం నీవే తప్ప దైవము కలదా నీ ధ్యానమునే చేసిన చాలును దిగులు గుబులు మాయము కావా నీ దీవెనయే రక్షణమాకు సాయి చరణం ఊపిరి నీవే ఊహవు నీవే ఊయలలూపే శక్తివి నీవే కారడివందున జీవితమున్నది కాపాడేందుకు కదలిరావయా సాయి చరణం నిర్మలరూపుడు సాయినాధుడు ఆతని చరితము మనకు వేదము నిత్యము మనము పఠనము చేసిన మనమునకెంతో శాంతము కలుగును భాయీ - సి.యస్.రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ చూపు మేము వెతికేము సాయి మాలోన మలినాలను తీసేయి సాయి నడిపించు గురువు నీవేను సాయి నిను తలచుతూ మేము సాగేము సాయి చరణం నీ పేరు తోడై మా వెంటరాగా మనసెంత మురిసేను మదికెంత సంతసము అది మా సంతకము దీనజనబాంధవుడు సాయినాధుడొకడే అది మరువక మనము సాటిమనిషి మేలును ఆశిస్తూ కదిలెదము చరణం పదిమంది మేలు కోరేను సాయి కోరికలను తీర్చి సన్మార్గము చూపే సాయినాధుడుంటే మనకేల భయము తన నీడే మన మేడా తన బోధలతోటి బాధలన్ని తీరు అది తెలిసిన నాడు చింతన్నది లేదు దారంతా వెలుగే.. దిగులన్నది లేదు చరణం తలచితమా తనను మదిలోన వెలసి ధైర్యమే ఒసగును మనిషన్నవాడు సాయమే చేసి ముక్తిబాట సాగేందుకు కదలాలని చెప్పెను అది మరువక మనము తనబాటన నడిచెదము తన నామము పలికెదము శాంతి సౌఖ్యాలు మనవెంటనె వచ్చునుగావచ్చుని..వచ్చునిక - సి. యస్.…
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి దారే కనపడక బాధను దాచితిమి గురువే నీవనుచు ప్రార్థన చేసితిమి... సాయి.. మా సాయి చరణం కాలము వెలుగులో కరుణే చూపెదవు ధైర్యము నీవనుచు ముందుకు సాగెదము నీ మూర్తి దాచుకుని నీ స్ఫూర్తి తీసుకొని నిలబడినామయ్యా జీవితము నీదనుచు ఇంకేమి కోరమయా చరణం స్వార్థాన్ని విడలేని బతుకేమో మాదయ్యా దయచూపి మమ్ములను మార్చగా రావయ్యా నీ చరిత చదివినచో రాతేమో మారునయా అందరొకటేనన్న భావనే నేర్పవయా చరణం సాయి అని తలచినచో మనసేమో ఉప్పొంగు దరిచూపి దీవించి ప్రేమగా నవ్వుతావు కల్లోల జీవితాన్ని సరిజేయు వాడవుగా మావెంట నీవుంటే మదికేమో మురిపెముగా చరణం ఏ జీవికైనను ఆకలొకటేననుచు అది తీర్చు మనిషంటే నాకేమో ప్రేమనచు నీ తత్వమును తెలిపి ధన్యులను చేశావు మనిషిగ బతికేందుకు దారినే చూపావు - సి. యస్. రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ పదములతో గడువగ బతుకు నీ పాదములను చేరెను మనసు నీ మార్గమునే నడుచుట తోటి జీవితార్థమే తెలియును కాదా చరణం దానము దయలే మనిషికి ముఖ్యము తెచ్చును ఎంతో అవి సఖ్యమును ఈ సత్యమునే తెలిపినవాడవు మా కన్నులనే తెరిచినవాడవు చరణం నీ దయతోటే సాగేమయ్యా నీ కృపతోటే కదిలేమయ్యా నినుగాంచినచో సమయము తెలియదు చిత్తము అంతా ఎంతో శాంతి చరణం నీ పలుకులనే తెలియని వారము నిను కొలుచుటయే తెలిసినవారము నీ తత్వమునే బోధించమని నిత్యము నిన్నే వేడెదమయ్యా చరణం జీవనతత్వము తెలిపెడివాడు తెగులే పట్టిన మనుషులకేమో ప్రేమను చూపే సద్గురుసాయిని విడువక ఎన్నడు సాగెదమండీ - సి.యస్ .రాంబాబు
Read More

సాయిచరితము 

సాయిచరితము  పల్లవి బతుకే భారమయా ధైర్యము నీయవయా సాయము చేసేటి సాయి ఒకడేలే చరణం బాధలు భయపెడితే భయమే వెంటుంటే సాయినే తలచితివా అండ నీకు దొరుకునుగా అంధకారముంటేను ఆపద కలిగినచో నీడగ తానేమో ఉంటాడు చూడవయా చరణం తన భక్తుల కోసం పగలు రేయిని మరచి కాపాడుట కోసం వెంటే ఉండునుగా చింతే తీర్చునుగా మీరంత పిల్లలనుచు వెన్ను నిమురును తాను నీ బాధ నాదనచు ఆభయము ఇచ్చునుగా - సి. యస్. రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీచూపేగా మాకు వేదము నీరూపేగా ఎంతో అందము నీ తలపేమో ఎంతో మధురము నీవేనయ్యా మాకు దైవము చరణం నినుకొలిచినచో భయమే ఉండదు కష్టమునందున వెంటే ఉండి వేదనతీర్చీ వేడుకచూపే దత్తగురువువు నీవయ్యా కాలము మాపై పగబడుతుంటే నీ నామముతో గెలిచేమయ్య సద్గురుసేవే కాపాడునుగా నిత్యము మమ్ము చరణం పేదా గొప్ప తేడాలొదిలి మనిషిగ బతుకు అనిచెప్పితివి కులము మతము భేదములొద్దని బోధించితివి ఎన్నడో నీవు నీపై నమ్మిక ఉంచిన చాలు అదియే మాకు ఎంతో మేలు దైవము ఒకడే మార్గాలెన్నో బాటలు ఎన్నో గమ్యము ఒకటే చరణం సాయిని వేడితే సాధ్యము అన్నీ ఆకలిదప్పులు అసలే ఉండవు తన చరితమునే చదివితిమంటే మనసుకు కలుగును ఎంతో హాయి మమతల పందిరి వేయును సాయి అందరి హృదిలో నిండెను సాయి సాయి తత్వమే తెలిసిన నాడు కోపము క్రౌర్యము వీడును చూడు - సి.యస్.రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము *పల్లవి* నీ దివ్యరూపము గాంచిన కనులది ఎంతటి భాగ్యము నీ దివ్యనామము పలికే పెదవుల దెంతటి పుణ్యము *చరణం* ఆకలిదప్పులు మరచిన మాకు నీ తలపులతో నిండెను మేను నేను,మేము భావన లేదు నిను కీర్తిస్తూ గడిపెదమయ్యా *చరణం* నిను సేవించే సేవే చాలు నీ దీవెనతో కాలము కదులు ఎన్నడు మమ్ము వీడకు సాయి కలలోనైనా మా తలపే నీవు *చరణం* జీవితమంటే భయమే వలదని సకల జీవులను ప్రేమించమని బోధనచేసి దారిని చూపి భవసాగరమును దాటిస్తావు *చరణం* నీ కృపతోటి నడిచెదమయ్యా లీలలు నీవి చదివిన చాలు బెంగేలేదు భయమూ లేదు బతుకే మారును దాహము తీరగ - సి.యస్.రాంబాబు
Read More