satyasai brundavanam

జిహ్వ రుచి

జిహ్వ రుచి   అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను నిమ్మ పిండెను కొంచెమునందు లోను ఆవ కాయనే మరువకూ ఆకులోన జిహ్వ రుచికి తాళగనే వహ్వ యనదె?   - సత్యసాయి బృందావనం
Read More

గుణము

గుణము ఆటవెలది: గుణము లెన్ని యన్న ఘనముగా పదహారు బ్రహ్మ సుతుడు తెలిపె బోయ దొరకు రాఘవయ్య కన్న రాజేడి గుణమున? సత్యసాయి పలుకు సత్య వాక్కు తాత్పర్యం: గుణములు పదహారు అని బ్రహ్మ సుతుడు అంటే నారదుడు, బోయ రాజు అంటే వాల్మీకి కి తెలిపెను అని భావము.. రాఘవయ్య అంటే శ్రీరామ చంద్ర మూర్తి ఆయనకంటే గుణములలో రాజెవరూ లేరు అని ఘంటా పథంగా తెలుపుతూ రాసిన ఆటవెలది పద్యం..  - సత్యసాయి బృందావనం
Read More

బాల్యం మాయంః

బాల్యం మాయంః బాలుడు నేను, భీముడు కాను.. మీ జేబున లెక్కలు, మా స్వేదపు చుక్కలు.. నువు చేసిన నేరం నే చదువుకు దూరం, చెదరెను బాల్యం, నరకరు తుల్యం… మాసిన బట్టలు, మోసిన బుట్టలు, చూసెనట్టులే పనిచేయని చట్టాలు.. మారాము చేసేమా?? మార్పును కోరేము.. కావాలిక విడుదల, ఎన్నాళ్లీ బెడదల, దడ దడ లాడు భయజ్వాల? నా కలమే కాగడగా, భయమను నిశికే, గుండెను చీల్చి, నా కవనమే, నరసింగపు గోళ్ళై, అజ్ఞానపు హిరణ్యకశపులనంతరించగా! ఓ చైతన్య దీప్తి అవతరించదా? పై కవితతో పాటు ఆటవెలది పద్యం: బాల్య మెవరికైన బాగుండవలెగాని పనుల చేత మాకు పైసలేల గురుల విద్య లేక గురితప్పె భవితలు విడుదలంటు లేదు వినరె జనులు - సత్యసాయి బృందావనం  
Read More

రాము- సీత

రాము- సీత ఆటవెలదిః: పచ్చ చీర గట్టు పడతి మన ధరణి మెచ్చిరెల్ల సురలు మొక్కెరపుడు నచ్చి చేరి నాయి నదులన్ని వరుసగా రాగమాలపించె రాము, సీత   - సత్యసాయి బృందావనం  
Read More

ఇరు గమ్యాలు

ఇరు గమ్యాలు నావల్లే పయనమగుట నావల్లే కాదులే! నీట తిరుగు నిరంతరము కన్నీళ్ళే తెలియవులే! ఇరు గమ్యాల మధ్య తిరుగు, ఏ ఒడ్డూ తనది కాదులే! అలలుంటే ఏంటైతే, అలుపంటే ఎరగదులే! పెరగదులే తరగదులే, నొప్పసలే ఎరగదులే! నావంటూ ఏమున్నవి, నావంటూ పేరుతప్ప! వానల్లో తడిసాక నావల్లో తిరగాల! నా వొళ్ళో తిరగాల! - సత్యసాయి బృందావనం
Read More