అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ
అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి వన్నె, నిండు పౌర్ణమి లాంటి ముఖం, పసిడి వన్నె పసుపు వర్ణంలో మేని ఛాయ ఆమె అందం మొదటిసారి చూడగానే ఏదో తెలియని అలజడి తన గుండెల్లో అన్ని మరిచిపోయి చూస్తున్నాడు రామ్.. అందమైన పల్లెటూరి తొలి కూత కూయగానే పచ్చని కల్లాపి జల్లి ముగ్గులతో సంతరించుకొని కొద్ది కొద్దిగా చీకటి తెరలను తొలగించుకుంటూ సూరీడు మెల్లిగా వస్తున్న వేళలో, చెట్లపైన పిట్టలు కిచుకిచుకుమంటూ వాటి సంగీత కూతలు కూస్తూ వీధంతా సందడి చేసే సమయంలో ఆ ఊరిలో అందాల సీతారాముల గుడి ఆ గుళ్ళో పూజలు స్వామి వారి ఆలయంలో మొదలై గంటలు మ్రోగుతున్న వేళ... ఆ గుడి గంట శబ్దం తన జీవితకాల నిరీక్షణకు సమాధానం దొరికిందని, తన ఎదురు చూపుల కాంక్షకి బానిస చేస్తుందని ఊహించనే లేదు రామ్ ఆక్షణం... చాలా రోజుల తర్వాత తన ఊరికి…