suryaksharalu

క్షణ భంగురమీ జీవితం

క్షణ భంగురమీ జీవితం తనువు వికసించే క్షణ కాలంబున.. మనస్సు పరితపించే క్షణ సుఖంబుకై.. జీవితంబు పరుగులు తీసే అశాశ్వత జీవనముకై. జ్ఞానమెరిగి క్షణ భంగురమి జీవితమని.. తెలియునా తర్కమేరుగని ఈ తుచ్ఛమానవ జీవితగమనంబున... - సూర్యాక్షరాలు
Read More

చెరగని చిరునవ్వు సాక్షిగా

చెరగని చిరునవ్వు సాక్షిగా ఓ మానవా..! పసిపాప వయస్సు చూడని మానవమృగమా... కామవాంఛ నెత్తికెక్కిన కామమృగమా... వావివరుసలెరుగని క్రూరమృగమా... అవనివంటి అతివ ఆగ్రహపు చెరగని చిరునవ్వు సాక్షిగా మృగాళ్ల మరణశాసనం రాయును తస్మాత్ జాగ్రత్త....!! - సూర్యాక్షరాలు
Read More

అంతరంగ ఆలోచనలు

అంతరంగ ఆలోచనలు అలుపెరుగని ఆలోచన వీచికలకి జీవిత సంద్రపు కన్నీటి అలలకి అంతర్గత యుద్ధ కల్మషాలకి చిరునవ్వు వెనుక దాగివున్న కర్కశానికి నిజాయతి ముసుగులో అవినీతి వాగ్దాన వాక్కులకి మదించిన మానవమృగాళ్ల వికృత చర్యలకి జీవితసత్యమెరుగని పుస్తకమే లోకమాయె పసిమనస్సులకి అంతరంగ ఆలోచనలు మధించే నా హృదయాన్ని... ఆత్మ ఘోషించునేమో పరమాత్మ లో కలియుసమయంలో - సూర్యాక్షరాలు
Read More

అసూయ

అసూయ మానవ పుట్టక లో లేని భావన ఊహ తెలిసి ఆలోచన తారాస్థాయి కి చేరినప్పుడు కలిగే భావనలు బంధాలు విడతీయు వింతలు కరిగిపోవు ప్రేమానురాగాలు దూరం చేయు స్నేహబంధాలు ప్రతీకగా నిలుచు అసూయ ద్వేషాలు  - సూర్యాక్షరాలు
Read More