తల్లితండ్రులే ప్రత్యక్ష దైవాలు
తల్లితండ్రులే ప్రత్యక్ష దైవాలు అది ఒకానొక రోజు, అర్ధరాత్రి అప్పుడే పట్టక, పట్టక కనులకు కునుకు పట్టినవేళ.. వృద్ధాప్యంలో అవయవాలు పట్టుత్వం లేని అమ్మ, నేనూ నిద్రలోకి జారుకున్నాం... కనులు మూసానో లేదో? అప్పుడే అమ్మ ఎదో ఇబ్బందితో మెల్లిగా పిలుస్తూ తట్టి నన్ను నిద్ర లేపుతుంది... బాబు.... బాబు... లే నాన్నా.. లే నాన్న అంటుంది, నేనూ కోపంగా కళ్ళు తెరచి ఏం.. చెప్పు.. పొద్దస్తామానం నిద్ర లేపుతుంటావ్, రాత్రిళ్ళు అస్సలు నిద్ర పోనియ్యవు, ఏం చెప్పు అని కసురుకున్నాను... వృద్ధాప్య సమయంలో శక్తి లేక, అవయవాలు చలికి వణుకుతున్న ఆవేదనలో అమ్మ నాతో అన్నది ఆ ఫ్యాన్స్ ఆఫ్ చేయరా చలి చంపేస్తుంది అని.. అంతే నాకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది, దీనికోసం నా నిద్ర చెడగొట్టావా? నువ్వు అని అమ్మ మీద అరుపులతో నోర్మూసుకుని పడుకో అంటూ కేకలు వేసి అలాగే పడుకున్నానేనూ... అమ్మ ఏడుస్తూ ఇంకొంచెం సేపు…