tirumala geethavali

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నిను చూడాలని నిను చేరాలని మనసే కోరెనుగా కోరిక తీరదుగా చరణం కొండంత దూరంలో కొలువైవున్నావు మామీద దయచూపి దర్శనమీయవయా తనువేమో తలచింది మనసేమో పిలిచింది దారేమో కనపడక దండాలు పెట్టేము చరణం దారేమో కనపడదు నిన్ను నమ్మకున్నాము నీనీడ మాకుంటే మా వెంట ఉన్నట్టే నిను చూడని బతుకున అన్నీ లోటేగా మాకేమో చేటేగా గోవింద అనకుంటే చరణం భక్తితో పిలిచేము ఆర్తితో కొలిచేము మనవీ వినవయ్యా అలకే మానవయా ఏడుకొండలు ఎక్కే కిటుకేదొ చెప్పవయా నిను చూసే భాగ్యము చూపగా రావయా - సి.యస్.రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి తపియించె మనసు నిను చూడాలియనుచు జపియించ సాగెనుగా గోవింద నామమును చరణం గల్లంతు కాగా ఆశలన్నియు మావి నీవే దిక్కనుచు కొలిచేము స్వామి కాపాడమనుచు వేడేము నిన్ను కలలోనయినా దర్శనము ఈయవా చరణం ఇబ్బందులున్నాయని నీ తలపు మానము మనసు తలుపులను తెరిచి ఉంచేము కొలువై ఉంటావని కోరికలను తీర్చేవని మా నిధివి నీవు మా సన్నిధివి నీవు మరిచిపోకయ్యా తరతమభేదములు లేవు నిను చూచువారికి చరణం నీ నీడచాలుగా నీ ధ్యాసనిలిపేందుకు నీ తోడు చాలుగా కష్టములను దాటేందుకు నిను నమ్మినాము మన్నించి రావయ్యా మమతనే పంచేందుకు వేగమే రావయ్యా వెతలు తీర్చేందుకు - సి.యస్.రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి శ్రీనివాసుని చూసెదమండీ కష్టాలన్నీ తీరునులెండి పదమే పాడుతు కదలాలండీ ఏడుకొండలు ఎక్కెదమండీ చరణం కలియుగమున వెలసినవాడు నిత్యపూజలను గైకొనువాడు భక్తసులభుడూ శ్రీనివాసుడు అభయమునిచ్చి కాపాడేవాడు చరణం కలతలు నలతలు తనవంటాడు తనువు మనసు తనదందాము కలియుగమందున వెలసినవాడు వేదనలన్నీ తెలిసినవాడు చరణం చిరునవ్వేగా తన ఆభరణము తన కరుణేగా మనసాధనము అండగ నిలిచి ధైర్యమునిచ్చి వేడుక చేయును మన జీవితమును - సి.యస్.రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి జగతికి వెలుగువి నీవే మా జీవనగతివీ నీవే ఏడుకొండలను దాటి మా హృదయకోవెలను చూడు చరణం కలియుగమందున వెలసీ కష్టాలన్నీ తీర్చీ బతుకే కానుక చేసి బాధ్యత మాకు నేర్పే బంధువు నీవేనయ్యా చరణం చిరునవ్వుతో మములను చూసి వింతలు వంకలు చూపి తోడుగ మాకు నిలిచే సుందర రూపము నీదే చరణం కలలే లేని మాకు కలతలు మాత్రం మిగిలె కొండల రాయుడు ఉంటే సకల శుభములు కలుగు చరణం నిను చూసే భాగ్యము లేక తపియించితిమయ్యా మేము కన్నీరే చిందగ మేము పిల్లలమైతిమి స్వామి నిను చూసే భాగ్యం కోసం నీ జాడను వెతికేమయ్యా - సి.యస్.రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఎంతగ వేడితే అంతటి కరుణను చూపేవాడవు నీవు నమ్మకముంటే దారిని చూపే స్వామివి నీవే కాదా చరణం బాటను విడచి బాధ్యత మరచి ఐహిక సుఖమే ఒకటే చాలని తలచితిమయ్యా తప్పేనయ్యా తప్పదు నీకు మార్గము చూపగ చరణం తనివేతీరదు ఆకలి ఉండదు నిను దర్శించిన మాకు నీ నామముతో బతుకే మారును నీ చిరునవ్వును ఎదలో నింపి సాగెదమయ్యా మేము చరణం బంధాలన్నీ ఛేదించుకుని నిను వెతికెదము మేము సాయము చేసి మార్గము చూపి కరుణించవయా స్వామి - సీ.యస్.రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నీ చరణములే కోరితిమయ్యా నీ శరణమునే వేడితిమయ్యా మా వేదనయే తెలిసిన నీవు మార్గము చూపి కాపాడవయా చరణం నిను చూసినచో అలుపేలేదు నీ తలపొకటే చాలును మాకు అది కలిగించును ఎంతో హాయి మా నీడవు నీవే అండవు నీవే చరణం ఏడుకొండలను చూసినచాలు బతుకే మారును ఆ వేడుకతోటి కలియుగమందున అంతా మాయే నీ చూపొకటే సత్యము స్వామీ చరణం కాలినడకన నిను చేరాలని కోరిక కలిగెను తీర్చవ స్వామీ తప్పులు ఎన్నో చేసిన మాకు నిను దర్శించుటయే విరుగుడు స్వామీ చరణం కలలోనైనా కనిపించవయా మనసుకు కలుగును ఎంతో శాంతి గోవిందాయని పిలిచెదమయ్యా మా గుండెలలో నిలవాలనుచు - సి. యస్ రాంబాబు
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి లోకబాంధవుడవుగా వినవయ్య మా మొరను పెదవేదో పలికింది మనవేదో చేసింది చరణం కలియుగ దైవమని నిను కొలిచేమయా పిలుపే వినమని నిను తలిచేమయా చరణం నీడగ నీవుంటే తోడుగ వెంటుంటే పండగ ప్రతిరోజూ పాటగ ప్రతిక్షణము చరణం కమ్మని నీ నవ్వు వెచ్చగ నీచూపు మముతాకితే చాలు ముత్యాలు రాలునుగ చరణం మాటలు రావంట మమతే నీవంట లేదంట ఏతంటా పండునిక బతుకంటా - సి. యస్ రాంబాబు
Read More