trending

ఈరోజు అంశం:- నీతి

ఈరోజు అంశం:- నీతి ఈరోజుల్లో నీతి అనే మాట ఎక్కడా వినిపించడం కనిపించడం లేదు. నీతిగా ఎవరూ బతకడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలుతున్నది. నీతి గా ఒక్కరూ లేరు. నీతి అనేది మన జీవితాలలో భార్య భర్తల దగ్గర లేదు, తండ్రి కొడుకుల మధ్య లేదు ప్రేమికుల మధ్య లేదు, తల్లి కుతుర్ల దగ్గర లేదు. ఇలా ఎక్కడ అయినా ఏ బంధంలో అయినా నీతి అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇక పోతే ఉద్యోగుల్లో, రాజకీయ నాయకులలో నీతి అనేది అసలు కనిపించదు. అందరూ అవినీతి పరులేనా అంటే అందరూ కాదు. కొందరు ఉండడం వల్ల అందరికీ పేరు వస్తుంది. అయితే అసలు నీతి అంటే ఏమిటి? నీతిగా ఎలా బతకాలి అనేది మీరు మీ రచన కథ, లేదా కవిత రూపంలో రాయండి. మీ అభిప్రాయం తెలుపండి. 
Read More

ఈరోజు అంశం:- సంతృప్తి

ఈరోజు అంశం:- సంతృప్తి మనిషి సంతృప్తి గా ఎప్పుడు ఉంటాడు? అసలు మనిషికి సంతృప్తి అనేది ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే చదువులో పక్కవాడి లాగా బాగా చదవాలి అని ఉంటుంది. అయ్యో వాడికి సీట్ వచ్చింది నాకు రాలేదు అనే బాధ ఉంటుంది. తర్వాత ఉద్యోగంలో లక్ష రూపాయలు జీతం ఉన్నా ఇంకా కావాలనే అసంతృప్తి ఉంటుంది. పెళ్లిలో ఇంకా ఎక్కువ కట్నం వస్తే బాగుండు అనే బాధ ఉంటుంది. పిల్లల విషయంలో అమ్మాయి పుడితే అబ్బాయి పుట్టలేదని అసంతృప్తి ఉంటుంది. వారి చదువుల విషయం లో ఇతరులతో పోల్చడం ఒక అసంతృప్తి గా ఉంటుంది. ఇల్లు విషయం లో సొంత ఇల్లు లేదనే సంతృప్తి, ముసలి వయసులో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో ఇతరులతో పోల్చుకుంటూ సంతృప్తి లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి మీరు కూడా అలాంటి జీవితాన్ని…
Read More

ఈరోజు అంశం:- ఒంటరి బతుకు

ఈరోజు అంశం:- ఒంటరి బతుకు పది మందిలో బతికినా కూడా చాలా మంది ఒంటరి తనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవడం లో వాళ్ళు కోల్పోతున్న దాన్ని గుర్తించలేరు. అలాగే వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారో కూడా వాళ్లకు ఒక స్పష్టత ఉండదు. అలా పది మందిలో ఉన్నా ఒంటరి జీవితాన్ని ఆస్వాదించ లేని అశక్తులు వాళ్ళు , వారికి ఒక లక్ష్యం , ఆశయం లాంటివి ఉండవు. యెప్పుడూ నిర్లిప్తత గా ఉంటూ ఉంటారు. ఎవరితో కలవకుండా మాట్లాడకుండా మనసు విప్పకుండా ఉంటారు. వారిని చూస్తున్న ఎదుటి వారికి కూడా విరక్తి భావం వస్తుంటుంది.. కానీ అంత మంది లో ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవించకుండా ఉన్న వారికంటే, ఎవరూ లేని వారి జీవితం. ఏలా ఉంటుందో అని గమనించాలి. ఒంటరి జీవితం అంటే ఎవరూ లేని వాళ్ళు కాదు. అందరిలో ఉన్నా కూడా ఒంటరిగా…
Read More

కుక్క బతుకు

కుక్క బతుకు అబ్బా ఎంత బాగుందో, ఇంత అందమైన దాన్ని చూసి ఎన్ని రోజులు అయ్యింది. ఇలాంటి వాళ్ళు మనకు ఎందుకు తారస పడరో, ఇలాంటి అందగత్తెలు అవారా గాళ్ళకే పడతారు కాబోలు, అబ్బబ్బా ఎన్నెన్ని అందాలు, ఎంతో శ్రద్ధగా పెంచినట్టు, ఎంతో ముద్దుగా పెంచినట్టు ఉన్నాయి. ఇంత శ్రద్ద తీసుకొని పెంచిన అందాలను ఎవడికి ఇస్తారో కానీ ఎంత ముద్దుగా ఉన్నారో, అరే ఇదొక్కటే అనుకుంటే అదేంటి ఎన్నో సీతాకోక చిలుకలు గుంపులుగా వస్తున్నాయి. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నాయో, ఎక్కడ ఉన్నాయో అహ నా జన్మ ధన్యం అయ్యింది. ఇన్నాళ్లు ఆ మిడిల్ క్లాస్ కాలనీ లో అంతా కప్పుకుని ఉన్న అందాలను ఆ కప్పుకున్న చాటు యెత్తులెంత ఉన్నాయో ఊహిస్తూ బ్రతికేసాను. కానీ ఇప్పుడు ఇలా సగం సగం బట్టల్లో కనిపిస్తున్న ఇన్ని అందాలను చూస్తుంటే తట్టుకోలేక పోతున్నాను. ఇన్ని అందాలు అహ నా రెండు కళ్ళూ ఎంత…
Read More

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?   సోషల్ మీడియాలో లేకపోతే జనావాసాలకు దూరంగా ఉన్నట్టా లేనట్టా? నా అభిప్రాయం. అవును చాలా మంది సోషల్ మీడియానే తమ లోకంగా బతుకుతూ లైక్ ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ మిగిలిన వాళ్ళు మీరు లోకానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేయడం ఎంత వరకు సమంజసం చెప్పండి? లోకం లో సోషల్ మీడియా కన్న చాలా విషయాలు తెలుసుకో దగినవి చాలా ఉన్నాయి అని మిగిలిన వారు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ షేర్ ల కోసం కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇవ్వన్నీ వాడకుండా ఉండటమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.     
Read More

ప్రతీ ఉపాధ్యాయుడూ చదవాల్సిన బడి అనుభవాలివి

ప్రతీ ఉపాధ్యాయుడూ చదవాల్సిన బడి అనుభవాలివి ప్రభుత్వ పాఠశాల లలొ కొంతమంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని* *తలపిస్తాయి*. *అలా ఒక ఉపాధ్యాయుడి సర్వీసు లొ ఏదురైన సంఘటనల సమూహరమే ఈ కధ* ప్రశ్న ఈ కథ చదివే ముందు ఈ వార్త చదవండి... చంద్రునిపై కాలుమోపడం నిజమే ధృవీకరించిన చంద్రయాన్ ఫోటోలు అపోలో మిషన్ పై అనుమానాలకు నాసా సమాధానం (వాషింగ్టన్ న్యూస్) చదివారు కదా... మీరు నమ్మారా... నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే... పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు. ఒక్క.. సతీష్ గాడు తప్ప... వాడు నమ్మలేదనడానికి... వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. నమ్మిన మిగతా పిల్లలందర్నీ జాలిగా చూసాడు కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి. వాడు వేసే ప్రశ్న కోసం కుతూహలం పెరిగినా... సరైన సమాధానం నా దగ్గర వుందా అనే అనుమానం పెరిగింది.…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 2

ఒక చీకటి రాత్రి పార్ట్ 2 అయినా చేతన్ తలుపులు తీసే పని మానుకోలేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని తలుపులు ఎంతకీ తెరుచుకోవడం లేదు. ఇంతలో ఆ ఆకారం చేతన్ వైపు నడక సాగిస్తూ వస్తుంది. చేతన్ తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ తలుపులు ఎంత తీసిన రావడం లేదు దాంతో ఇక విసుగు వచ్చి మళ్ళీ చేతన్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. వెనక్కి తిరిగిన ఆకారం తలుపుల దగ్గరికి వచ్చి నిలిచింది. చేతన్ కి అర్థమైపోయింది అది తనని వదలదు అని. దాంతో, ఫోన్ తీసి చార్జింగ్ పెట్టాలి అని అనుకున్నాడు. కానీ చార్జర్ తీసుకు రాలేదు అని గుర్తుకు వచ్చి ఫోన్ టేబుల్ మీద పెట్టాడు తనని తాను తిట్టుకుంటూ కనీసం రూమ్ లో అయినా ఏవైనా చార్జర్ లు ఉన్నాయేమోనని ఒకసారి చుట్టూ చూడాలని అనుకున్నాడు. కానీ భయం వల్ల తల ఎత్త లేకపోయాడు.…
Read More

సంఘర్షణ పార్ట్ 2

సంఘర్షణ పార్ట్ 2 మనలోని బాధ ను పంచుకుంటూ , తోచిన సలహాలు, సూచనలు ఇస్తూ , వెన్నంటి నడిచే వాడే మిత్రుడు. వాడికి డబ్బుందా, లేదా, పేద గొప్ప , చిన్న , పెద్ద అనే తేడాలు ఏవి ఉండవు , స్నేహానికి వయసుతో పనిలేదు , అనుభవం తో పని లేదు , ఆడ మగ అనే తారతమ్యం లేదు. మంచి స్నేహితుడు మంచి పుస్తకం తో సమానం అని పెద్దలు ఉరికే అనలేదు. మన స్నేహితుణ్ణి చూసి మనల్ని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు. ******** ఒరేయి.. ఎంటా మాటలు నీకేమన్నా మతి పోయిందా ? చస్త అంటే ఎలా ? ఇంత చిన్న విషయం కోసం నువ్వు నీ జీవితాన్ని ఎందుకు చాలించాలి రా, తెలివి తేటలు బాగానే ఉన్నాయి లే , అందుకే ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ,  అరేయి అరుణ్…
Read More

సంఘర్షణ పార్ట్ 1

సంఘర్షణ పార్ట్ 1 మనసుకు నచ్చిన పని చేయడం వల్ల మనం చాలా సంతోషంగా ఉండొచ్చు, అయితే కొన్ని కారణాల వలన మనం మన మనసుకు నచ్చిన పనులు కాకుండా, నచ్చని పనులు ఎన్నో చేస్తుంటాం, అలాంటి ఒక పని వల్ల రెండు జీవితాలు ఎంత మానసిక సంఘర్షణలో కొట్టుకుపోయాయి. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ******** అమ్మ నాకు ఈ పెళ్లి వద్దమ్మ అన్నాడు అరుణ్. తల్లి దగ్గరికి వెళ్లి బతిమాలుతూ , ఏంట్రా ఇది అన్ని రెడి అయ్యాక ఆ మాటలేంటి ? నాన్నగారు విన్నారంటే చంపేస్తారు . నోరు మూసుకుని చేసుకో, ఇన్ని రోజులు మౌనంగా ఉండి , ఇప్పుడు వద్దు అని అంటే ఎలా ? అయినా నాన్నగారు మూర్తి అంకుల్ కు మాట ఇచ్చారు అంట . నువ్వు కాదంటే బాగుండదు . వారం రోజుల లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇలా అంటే…
Read More

ధరణి మొదటి భాగం

ధరణి మొదటి భాగం మల్లెల వాన , మల్లెల వాన , నాలోనా అంటూ చెట్టుకు పూసిన పువ్వుని తన బుగ్గ మీద కొట్టుకుంటూ , సంతోషపడుతున్న మనవరాలిని చూస్తూ , ఒసే పిచ్చి మొఖమా పాడింది చాల్లే , కానీ వచ్చి ఇంత ఉడకేసి చావు , అంది నాయనమ్మ  అనసూయ. అబ్బా ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండనివ్వదు, ఈ ముసలిది అంటూ వస్తున్నా , అని లోపలికి నడిచింది ధరణి. ఏంటి ముసలమ్మ ఆకలి బాగా వేస్తోందా నీకు, అయినా ఇప్పుడే కదే చెంబు నిండా పాలు తాగావు , అప్పుడే మళ్ళి ఆకలి వేస్తుందా నాన్నమ్మ  ,అంటూ అమయాకంగా అడిగింది ధరణి .. ఓ  యబ్బో  మరి చిక్కటి పాలా, ఏమన్నన్నా, పాలు ఇచ్చావు, నేనది తాగి అరగక ఆపసోపాలు పడుతున్నా... నీ బాబు నాకు మంచి పండ్లు, పాలు తెస్తే ఇంకేం అనేదానివో, అయినా…
Read More